Weight Loss Tips: వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి సూపర్ టిప్స్..
Weight Loss Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా? వెంటనే బరువు తగ్గాలని మీరు ప్రయత్నిస్తున్నట్టైతే వెంటనే ఈ ఐదు రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.

Weight Loss Tips: ప్రస్తుత కాలంలో అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. కాగా వారి శరీర బరువును తగ్గించుకోవడానికి చాలా మంది ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తుంటారు. కొందరు ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే, మరికొందరు జిమ్ సెంటర్లలో కసరత్తులు చేస్తుంటారు. అయినా వెయిట్ లాస్ అవ్వని వారు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే వీరు కొన్ని రకాల ఆహార పదర్థాలను తినడం మూలంగానే వెయిట్ పెరగడమే తప్ప.. తగ్గడం అనేది అస్సలు ఉండదు. అందుకే ముందు వీరు తమ వంటగదినుంచే వారి వెయిట్ లాస్ ప్రక్రియను మొదలుపెట్టాలి. అదెలాగంటారా? మీరు తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు మీ బరువును అమాంతం పెంచుతాయి. అంతేకాదు మీరు గంటల తరబడి జిమ్ సెంటర్లలో కసరత్తులు చేసినా.. మీ వెయిట్ మాత్రం తగ్గదు.
ఖచ్చితంగా నేను బరువు తగ్గాలనుకునే వారు ఫుడ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకతప్పదు. ముఖ్యంగా ఈ ఐదు రకాల ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. అప్పుడే మీరు వెయిట్ లాస్ అవుతారు. మరి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
రెడ్ మీట్: రెడ్ మీట్ లో ప్రోటీన్లు, ఐరన్, విటమిన్ బీ 12 వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేసేవే అయినా.. తరచుగా తినడం వల్ల శరీరానికి తీవ్ర హాని జరుగుతుంది. ముఖ్యంగా దీని వల్ల గుండె సంబంధిత రోగాలు, ప్రమాదకరమైన కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు దీనిని తీసుకోవడం వల్ల శరీర బరువు ఈజీగా పెరుగుతుంది. రెడ్ మీట్ కు బదులుగా ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల ద్వారా మీ శరీరానికి కావాల్సిన ప్రోటీన్లను భర్తీ చేయండి. సీఫుడ్, మొక్కల ఆధారిత ఆహార పదార్థాలు, ఆర్గానికి పౌల్ట్రీ ద్వారా మీ శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు లభిస్తాయి.
చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్స్: దాహం వేస్తే చాలు షుగర్ తో నిండి ఉండే డ్రింక్స్ నే ఎక్కువగా తాగే వారు చాలా మందే ఉన్నారు. అయితే కొన్ని రకాల డ్రింక్స్ లల్లో చక్కెర అధికంగా ఉంటుంది. ఇలాంటివి దాహాన్ని తీర్చడానికి ఉద్దేశించినవి కావని మీరు గ్రహించాలి. ఈ చెక్కర ఎక్కువ మొత్తంలో ఉండే పానియాలను తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అంతేకాదు లెప్టిన్ నిరోధకత, ఇన్సులిన్ నిరోధకత కూడా పెరిగే ప్రమాదముంది. కాబట్టి మీకు తీపి తినాలనిపించినప్పుడు బెల్లంతో చేసిన వాటినే తీసుకోవడం మంచిది.
జంక్ ఫుడ్: జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఫుడ్ వల్ల శరీర బరువు పెరిగే ప్రమాదముంది. కాబట్టి ఖచ్చితంగా నేను బరువు తగ్గాలనుకునే వారు ప్రాసెస్ చేసిన లేదా జంక్ ఫుడ్ కు దూరంగా ఉండటం ఉత్తమం. వీటికి బదులుగా తాజా పండ్లు, పండ్ల రసాలు, బాదం, వాల్ నట్ , సలాడ్స్, ఓట్స్ ను తీసుకోవడం మేలు.
ఆల్కహాల్: అధిక బరువుతో బాధపడేవారు ఆల్కహాల్ కు దూరంగా ఉండటం ఉత్తమం. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీర బరువు మరింత పెరిగే ప్రమాదముంది. అందుకే వీటికి బదులుగా ఏదైనా ఫ్రూట్ జ్యూస్ ను తాగడం మంచిది.
బరువు తగ్గాలనుకునే వారు చాక్లెట్లు, స్వీట్లకు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటివల్ల కూడా బరువు పెరగొచ్చు. కాబట్టి వీటికి బదులుగా డార్క్ చాక్లెట్ ను తింటే మంచిది. ఈ డార్క్ చాక్లెట్ ను తినడం వల్ల షుగర్ ను తీసుకోవాలన్న కోరికలు పూర్తిగా తగ్గుతాయట. అంతేకాదు ఈ చాక్లెట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. అలాగే మన మానసిక స్థితి మెరుగుపడేలా చేస్తుంది.