కొబ్బరి నీళ్లను ఇలా తాగితే చాలు.. ఫాస్ట్ గా కిలోల్లో బరువు తగ్గుతారు తెలుసా?
కొబ్బరి నీళ్లలో కేలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. రోజూ కొబ్బరి నీళ్లను తాగితే బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. అంతేకాదు ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలను చేసి అలసిపోయేవారు చాలా మందే ఉన్నారు. కొందరైతే ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ.. ఇష్టమైన ఆహారాలను వదులుకుంటారు కూడా. అయినా ఇంచు బరువు కూడా తగ్గరు. ఇలాంటి వారికి కొబ్బరి నీరు ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల రీఫ్రెష్ గా అనిపించడమే.. కాదు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొబ్బరి నీళ్లు హైడ్రేటింగ్ పానీయం. ఇవి కొవ్వును కరిగించడానికి కూడా సహాయపడుతుంది.
కేలరీలు తక్కువ
కొబ్బరి నీళ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని తాగడం వల్ల కడుపు తేలికగా ఉంటుంది. దీనిలో ఉండే పొటాషియం, బయో ఎంజైమ్ లు తేలికగా జీర్ణం అయ్యేందుకు సహాయపడతాయి. ఈ పానీయంలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ ఈ కొబ్బరి నీరు మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీరు హెవీగా తినలేరు.
చక్కెర ఎక్కువ ఉండదు
ఇతర పండ్ల రసాలతో పోల్చితే కొబ్బరి నీళ్లలో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. అంతేకాదు దీనిలో ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. పండ్ల రసాల్లో ఉండే చక్కెర రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచే ఛాన్స్ ఉంది. కొబ్బరి నీళ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇవి మీ ఎలక్ట్రోలైట్ స్థాయిలను స్థిరీకరిస్తాయి. దీంతో మీరు ఫాస్ట్ గా బరువు తగ్గుతారు.
జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది
కొబ్బరి నీళ్లలో పోషకాలు, ఎంజైమ్ లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచుతాయి. దీనివల్ల కేలరీలు ఎక్కువ బర్న్ అవుతాయి. ఎందుకంటే జీవక్రియ నెమ్మదిగా ఉంటే తిన్నది నెమ్మదిగా అరుగుతుంది. దీనివల్ల మీ శరీర బరువు బాగా పెరుగుతుంది. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండేందుకు కొబ్బరి నీళ్లు దివ్య ఔషదంలా పనిచేస్తాయి.
అతిగా తినలేరు
కొబ్బరి నీళ్లలో లారిక్ ఆమ్లం ఉంటుంది. ఇది మీరు అతిగా తినకుండా చేయడానికి సహాయపడుతుంది. ఈ నీటిలో కొవ్వు అసలే ఉండదు. కొబ్బరి నీళ్లతో రోజును ప్రారంభిస్తే.. రోజంతా రీఫ్రెష్ గా ఉంటారు. దీనిలో పిండి పదార్థాలు లేనప్పటికీ.. ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. దీనిలో ఉండే పొటాషియం మీరు తొందరగా బరువు తగ్గడానికి మీ శరీరం నుంచి ఎక్కువ సోడియాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది.
coconut water
కొబ్బరి నీళ్లను ఎప్పుడు తాగాలి?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం.. కొబ్బరి నీళ్లను ఉదయం పరిగడుపున తాగడం మంచిది. ఇవి మీ శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. ఇందుకోసం రోజుకు మూడు సార్లు కొబ్బరి నీళ్లను తాగాలి. మొత్తం మీద కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మీ శరీర శక్తి స్థాయిలు పెరుగుతాయి. అలాగే బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మీ గుండె, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.