Weight Loss Tips: కొవ్వు వేగంగా కరగాలంటే వీటిని రోజూ తినండి
Weight Loss Tips: బరువు తగ్గాలనుకునే వారు రెగ్యులర్ గా వ్యాయామం చేయడంతో పాటుగా.. ఈ ఆహారాలను చేర్చుకుంటే కూడా ఫాస్ట్ గా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

క్రమం తప్పకుండా వ్యాయామం చేసేయడం వల్ల శరీరం ఆరోగ్యం, ఫిట్ గా ఉండటంతో పాటుగా బరువు కూడా తగ్గుతారు. దీనితో పాటుగా బరువు తగ్గాలనుకునే వారు తమ రోజు వారి ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కొవ్వును ఏ ఆహారాలు వేగంగా తగ్గిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Quinoa Upma
క్వినోవా (Quinoa)
బరువు తగ్గాలనుకునే వారు క్వినోవాను తప్పకుండా తినాలి. ఎందుకంటే దీనిలో ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ ప్రోటీన్ శరీరానికి శక్తిని అందించడంతో పాటుగా బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. అలాగే కేలరీలు కూడా త్వరగా బర్న్ అవుతాయి. క్వినోవాలో జింక్, విటమిన్ ఇ, సెలీనియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంతో పాటుగా.. ప్యాట్ ను బర్న్ చేయడానికి కూడా సహాయపడతాయి.
గుడ్లు (Eggs)
సాధారణంగా చాలా మంది గుడ్డును తింటే మరింత బరువు పెరుగుతారని అనుకుంటారు. నిజానికి గుడ్డు బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. గుడ్డును తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అంతేకాదు ఇది కేలరీల లోటును కూడా తీరుస్తుంది. గుడ్డులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్లను శోషించుకోవడంలో సహాయపడతాయి. అందుకే రోజుకు ఒక ఉడకబెట్టినన గుడ్డును మీ బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోండి.
గ్రీన్ టీ (Green tea)
గ్రీన్ టీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఎన్నో సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ఇది బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో కేలరీలు మొత్తమే ఉండవు. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో మీరు వేగంగా బరువు తగ్గుతారు. గ్రీన్ టీ లో ఉండే కెఫిన్ శరీరంలోని శక్తి స్థాయిలను పెంచుతుంది. జిమ్ లో ఎక్కువ సేపు కసరత్తులు చేయడానికి కావాల్సిన శక్తిని అందిస్తుందని గ్రీన్ టీ.
కాఫీ (Coffee)
కాఫీ కూడా కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది. వ్యాయామం చేయడానికి ముందు కప్పు కాఫీ తాగితే ఎక్కువ కొవ్వును బర్న్ చేయగలరని పలు అధ్యయనాలు కనుగొన్నాయి. కాఫీలో కెఫిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది శరీరంలో శక్తిని స్థాయిని పెంచుతుంది. కాఫీని తాగడం వల్ల శారీరకంగా, మానసికంగా బలంగా ఉనట్టు భావిస్తారు.
ఆకుకూరలు (Greens)
క్యాబేజీ, బచ్చలి కూర, పాలకూర వంటి ఆకు కూరల్లో కొవ్వును కరిగించే గుణాలుంటాయి. దీనిలో విటమిన్లు, మెగ్నీషియం, ఇనుము వంటి ముఖ్యమైన పోషకాలుంటాయి. ఇవన్నీ శరీరానికి శక్తిని అందిస్తాయి. అలాగే జీర్ణక్రియ సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. ముఖ్యంగా ఇవి కొవ్వును బర్న్ చేయడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.
కొబ్బరి నూనె (coconut oil)
కొబ్బరి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీళ్లు, కొబ్బరి చక్కెర వగైనా కొబ్బరిని ఏ రూపంలో తీసుకున్నా.. మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అందులో కొబ్బరి నూనెను ఉపయోగించి వేగంగా బరువు తగ్గొచ్చు. కొబ్బరి నూనెతో చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు రోజూ వ్యాయామం చేయడంతో పాటుగా ఆరోగ్య కరమైన ఆహారాలను కూడా చేర్చుకోవాలి.
kidney beans
కిడ్నీ బీన్స్ (Kidney beans)
కిడ్నీ బీన్స్ లో ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మాంసాహారాలను తినేవారికి ఇవి మంచి పోషకాహారం. వీటిలో ఫైబర్, పిండి పదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీ పొట్టను ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. ముఖ్యంగా ఇవి అంత తొందరగా జీర్ణం కావు. ఇవి జీర్ణం అయ్యేటప్పుడు కేలరీలు ఎక్కువ బర్న్ అవుతాయి.