weight loss : పరిగడుపున ఈ ఒక్కటి తీసుకుంటే చాలు.. చాలా ఫాస్ట్ గా బరువు తగ్గుతారు తెలుసా..
weight loss : ప్రతి రోజూ ఖాళీ కడుపున డిటాక్స్ పానీయాలను తాగితే కొన్ని రోజుల్లోనే వెయిట్ లాస్ అవుతారని ఆయుర్వేద నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గడానికి వ్యాయామాలు.. సరైన డైట్ ను ఫాలో అవడంతో పాటుగా కొన్ని రకాల పానీయాలను కూడా తీసుకోవాలని నిపుణులు సలహానిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని హోమ్ రెమిడీస్ వెయిట్ లాస్ అయ్యేందుకు ఎంతగానో సహాయపడతాయి. అందులో డిటాక్స్ పానీయాలు ఒకటి. ఈ పానీయాలతో ఎంతటి బరువునైనా ఇట్టే కరిగించొచ్చని ఆయుర్వేద నిపుణులు సలహానిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Weight loss
డిటాక్స్ వాటర్ ఎలా తయారుచేయాలి.. డిటాక్స్ వాటర్ ను తయారుచేయడానికి.. ముందుగా ఒక టీస్పూన్ ధనియాలను, టీ స్పూన్ జీలకర్రను , ఒక టీ స్పూన్ సోంపు గింజలను రాత్రంగా ఒక పెద్ద గ్లాస్ నీటిలో నానబెట్టాలి. ఉదయం ఆ నీళ్లను బాగా మరిగించి.. వడకట్టి చల్లారిన తర్వాత తాగండి. దీన్ని తీసుకోవడం వల్ల పోషక గణన పెరుగుతుంది. అయితే ఈ మిశ్రమానికి నిమ్మరసం లేదా pink salt కూడా జోడించొచ్చు.
జీలకర్ర ప్రయోజనాలు.. జీరాలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల జీవక్రియ వేగవంతం అవడమే కాదు జీర్ణక్రియ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ వాటర్ వేసవి నెలలో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ జీరాలో పొటాషియం, కాల్షియం, రాగి పుఉష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో ఇనుము కూడా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనేక వ్యాధుల కారకమైన బ్యాక్టీరియాతో పోరాడగలదు.
ధనియా ప్రయోజనాలు.. ధనియాలు బరువు తగ్గించడంలో అన్నింటికంటే ముందుంటాయి. అంతేకాదు ఇవి మన శరీరంలో ఉండే అదనపు నీళ్లను కూడా బయటకు పంపించడానికి ఎంతో సహాయపడతాయి. అలాగే ఇవి యాంటీ సెప్టిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. అంతేకాదు ధనియాలు చర్మాన్ని కాంతివంతంగా కూడా చేయగలవు. ధనియాలను తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. అలాగే గుండె, మెదడు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి.
సోంపు గింజల ప్రయోజనాలు.. ఈ వేసవిలో చర్మ సమస్యలను తగ్గించడానికి అలాగే శరీరాన్ని చల్లగా ఉంచేందుకు ఇవి దివ్య ఔషదంలా పనిచేస్తాయి. అంతేకాదు ఇవి హార్మోన్లను కూడా సమతుల్యంగా ఉంచగలవు. జీర్ణక్రిను పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఇవి రక్తాన్ని కూడా శుద్ధి చేయగలవు. అజీర్థి, మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ పానీయాలను పరిగడుపునన సేవించడం వల్ల ఎనర్జీ కూడా వస్తుంది. దాంతో మీరు వ్యాయామాలను అలసిపోకుండా చేయగలుగుతారు. వీటితో పాటుగా మంచి పోషకాహారం తీసుకుంటే మీరు సులభంగా బరువు తగ్గుతారు.