జుట్టు పలుచబడుతోందా..? ఇలా చేయండి పోయిన జుట్టు మళ్లీ వస్తుంది..
జుట్టుతోనే అందం, ఆరోగ్యం. జుట్టు ఊడిపోతుందంటే మన శరీరంలో ఏదో లోపం ఉన్నట్టే. అయితే కొన్ని జుట్టు రాలడాన్ని ఇవి ఆపి.. కొత్త జుట్టు వచ్చేలా చేస్తాయి. అవేంటంటే..
మారుతున్న జీవన శైలి కారణంగా నేడు ఎంతో మంది హెయిర్ ఫాల్ సమస్యను ఫేస్ చేస్తున్నారు. కానీ జుట్టు రాలిపోవడం, జుట్టు పలుచబడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. అయితే కొన్ని రకాల సింపుల్ టిప్స్ తో హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అవేంటో తెలుసుకుందాం పదండి.
గుడ్డు (Egg).. గుడ్లు సంపూర్ణ ఆహారం. ఇది జుట్టుకు పోషణను అందిస్తుంది. గుడ్డు ఊడిపోయే జుట్టును ఆపి.. కొత్త జుట్టు మొలిచేందుకు సహాయపడుతుంది. ఇందుకోసం గుడ్డులోని తెల్లసొనను తీసుకుని కుద్దళ్లకు పట్టించాలి. ఒక 20 నిమిషాలు గడిచాక తలస్నానం చేయాలి. తరచుగా ఇలా చేస్తే మీ జుట్టును చూసి మీరే ఆశ్చర్యపోతారు.
మెంతులు.. మెంతులు కూడా మన జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. ఇకపోతే కొన్ని మెంతులను తీసుకుని వాటిని రాత్రంతా నీటిలో బాగా నానబెట్టాలి. పొద్దున ఈ గింజల్లో నీళ్లన్నింటిని ఒంపేసి అందులో కొన్ని కొబ్బరి పాలను పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని జుట్టుకు బాగా అప్లై చేయాలి. అరగంట తర్వాత నీట్ గా కడిగేయాలి. దీనివల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా తయారవుతుంది.
ఉసిరి.. హెడ్ బాత్ చేసే ప్రతి సారి శాంపూలను పెట్టడం మానేయండి. వీటికి బదులుగా ఉసిరి, శీకాకాయ మిశ్రమాన్ని పెట్టండి. ఇది జట్టును బలంగా, షైనీగా తయారుచేయడంతో పాటుగా డ్యామేజ్ అయిన జట్టును బాగు చేస్తుంది కూడా.
ఉల్లి రసం.. జుట్టు ఆరోగ్యానికి ఉల్లి రసం ఎంతో సహాయపడుతుంది. దీని రసంలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టును వేగంగా పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఉల్లి రసాన్ని జుట్టు కుదుళ్లకు పెట్టి మసాజ్ చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఈ పద్దతిని వారానికి ఒకసారి మాత్రమే చేయాలి.
కలబంద.. కలబంద జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. వీటిలో ఉంటే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. మూడు రోజులకోసారి దీనిని జుట్టుకు పట్టించాలి. దీన్ని పెట్టిన అరగంట తర్వాత జుట్టును కడిగితే బెస్ట్ రిజల్ట్ వస్తుంది.
ఆముదం.. ఆముదం కూడా జుట్టు ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం కొబ్బరి నూనెను, ఆముదం నూనెను సమానంగా తీసుకుని సన్నని మంటపై బాగా వేడి చేసి పక్కన పెట్టాలి. ఇది గోరువెచ్చగా అయిన తర్వాత జుట్టుకు అప్లై చేయాలి. తరచుగా ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా వస్తుంది.
ఇవి కూడానూ.. రెగ్యులర్ గా బయటకు వెళ్లే వారు తరచుగా తలస్నానం చేయాలి. అలాగే నూనెకు కూడా రాయాలి. ఎందుకంటే పొల్యూషన్ కారణంగా కూడా జుట్టు ఊడిపోతూ ఉంటుంది.అందుకే వీరు జుట్టును తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే జుట్టులో దుమ్మూ దూళి పేరుకుపోకుండా ఉంటుంది.