Beauty Tips: ఇంట్లోనే వ్యాక్సింగ్ చేస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Beauty Tips: చాలామంది వ్యాక్సిన్ ని ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు. అయితే ఇది చాలా బాధాకరమైన ప్రక్రియ. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి బాధ లేకుండా ఇంట్లోనే వ్యాక్సిన్ చేసుకోవచ్చు అంటున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్. అది ఎలాగో చూద్దాం.
వ్యాక్సింగ్ అనేది శరీరంలోని వెంట్రుకలను వదిలించుకోవడానికి ఉపయోగించే మార్గము. ఈ వ్యాక్సింగ్ ని కొందరు బ్యూటీ పార్లర్ కి వెళ్లి చేయించుకుంటే కొందరు మాత్రం ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు. అయితే తగినంత ప్రావీణ్యత లేకపోవడం వలన ఒక్కొక్కసారి విపరీతమైన నొప్పి కలుగుతూ ఉంటుంది.
అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ఇంట్లో కూడా ఎలాంటి బాధ లేకుండా వ్యాక్సింగ్ చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీ చర్మాన్ని వ్యాక్సింగ్ కోసం ఎక్స్పోలియేట్ చేయండి. ఎక్స్పోలియేట్ చేయటానికి ఉత్తమ మార్గం షుగర్ స్క్రబ్ ని ఉపయోగించటం.
పంచదార మరియు ఆలివ్ ఆయిల్ కలిపి మీ సొంత షుగర్ స్క్రబ్ ని తయారు చేసుకోవచ్చు. వృత్తాకార కదలికలలో మీ చర్మానికి వర్తించండి. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. అలాగే మీరు వ్యాక్సింగ్ చేసుకోబోయే..
ప్రాంతాన్ని ట్రిమ్మింగ్ లేదా షేవింగ్ చేసుకోండి. ఇది మైనపు జుట్టుకు బాగా కట్టుబడి మరియు వ్యాక్సింగ్ సున్నితంగా జరగటానికి సహాయపడుతుంది. వ్యాక్సింగ్ చేసుకునేటప్పుడు ఎక్కువగా మైనం ని పోయవద్దు.
అది పారదర్శకంగా కనిపించేంత సన్నగా పూయటం అవసరం. మైనం పూర్తిగా వచ్చేవరకు దానిని మీరు లాగడానికి ప్రయత్నించకండి. మైనం ను ఎక్కువగా వేడెక్కించవద్దు. వర్తించే ముందు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచండి. అయితే ఈ వ్యాక్సింగ్ ని అందరూ చేసుకోకూడదు. ఏమైనా బహిరంగంగా గాయాలు ఉంటే వ్యాక్సింగ్ ని నివారించండి.
పీరియడ్స్ లో ఉన్నట్లయితే వ్యాక్సింగ్ ని పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. తల్లిపాలు ఇస్తున్నా, గర్భవతిగా ఉన్నప్పుడు కూడా వ్యాక్సింగ్ ని ఉపయోగించకండి. అలాగే మీరు వడదెబ్బకి గురైనా, ఏదైనా చర్మపు ఇన్ఫెక్షన్ కలిగి ఉన్న కూడా ఈ వ్యాక్సింగ్ ని ఉపయోగించకపోవడం మంచిది.