రోజూ ఇదొక్కటి తినండి చాలు.. కాలేయంలో ఉన్న కొవ్వు మొత్తం కొన్ని రోజుల్లో కరిగిపోతుంది
ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నవారు ఎక్కువ మందే ఉన్నారు. అలాంటి వారు ప్రతిరోజూ టమాటాలు తింటే మంచిదట. కాలేయంలో పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవచ్చని ఓ కొత్త అధ్యయనం చెబుతోంది.
- FB
- TW
- Linkdin
- GNFollow Us

కాలేయంలో కొవ్వు కరిగించే ఆహారం
కాలేయంలో కొవ్వు పేరుకుపోయే సమస్య ఎక్కువ మందిలోనే ఉంది. దాన్ని తగ్గించేందుకు ఎలాంటి ఆహారాలు తినాలో తెలుసుకునేందుకు ఒక అధ్యయనం జరిగింది. ప్రతిరోజూ పచ్చి టమాటాలు తినేవారిలో హెపాటిక్ స్టీటోసిస్ (లివర్‌లో కొవ్వు పేరుకుపోవడం) గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు ఈ అధ్యయనంలో గుర్తించారు.
మెటబాలిక్ డిస్‌ఫంక్షన్-అసోసియేటెడ్ లివర్ డిసీజ్ (MASLD) అనేది కాలేయంలో కొవ్వు పేరుకుపోయే సమస్య. ఈ సమస్య ఉన్నవారిపై టమాటాలు ఎలా పనిచేస్తాయో 'న్యూట్రియెంట్స్' (Nutrients) జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం వివరించింది.
అధ్యయనం ఎలా సాగింది?
ఈ అధ్యయనం కోసం MASLD సమస్యతో బాధపడుతున్న 79 మందిని ఎంపిక చేశారు. మెడిటరేనియన్ డైట్‌లో భాగమైన టమాటాలు, లివర్ స్టీటోసిస్‌ను (కాలేయంలో కొవ్వు) ఎలా తగ్గిస్తాయో పరిశోధకులు పరీక్షించారు.
పరిశోధకులు ఈ 79 మందిని రెండు గ్రూపులుగా విడగొట్టారు. ఒక గ్రూపునకు టమాటాలు లేని ఆహారం ఇచ్చారు. మరో గ్రూపునకు రోజూ 200 గ్రాముల పచ్చి టమాటాలు, 50 గ్రాముల టమాటా సాస్ తినమని చెప్పారు. వారి ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలించారు.
టమాటాలు తిన్నవారిలో బరువు, శరీరంలోని మొత్తం కొవ్వు, పొట్ట దగ్గరి కొవ్వులో పెద్దగా మార్పులు రాలేదు. కానీ, కాలేయంలోని కొవ్వు మాత్రం తగ్గిందని పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు.
టమాటాల్లో ఏముంటుంది?
MASLD సమస్య ఉన్నవారు రోజూ టమాటాలు తింటే లివర్‌లో కొవ్వు పేరుకుపోవడం తగ్గుతుంది. అంతేకాదు, లివర్‌కు సంబంధించిన ఫ్యాట్ మార్కర్స్ కూడా తగ్గుతాయని ఇటీవలి క్లినికల్ స్టడీస్ చెబుతున్నాయి.
టమాటాల్లో 'లైకోపీన్' అనే యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కాలేయ కణాల్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాపును తగ్గిస్తుంది. అందుకే రోజూ టమాటాలు తింటే ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

