MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Facts: వాషింగ్ మెషిన్ ఆన్ లో ఉన్నప్పుడు స్నానం చేయకూడదా? ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు..!

Facts: వాషింగ్ మెషిన్ ఆన్ లో ఉన్నప్పుడు స్నానం చేయకూడదా? ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు..!

Facts: ప్రతి ఒక్కరి ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంటుంది. అయితే, ఈ వాషింగ్ మెషిన్ వాడే విషయం చాలా మంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. దీని వల్ల తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 11 2026, 01:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Washing Machine
Image Credit : Getty

Washing Machine

చాలా మంది స్త్రీలు మల్టీ టాలెంటెడ్ గా ఉంటారు. ఒకేసారి ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు. ఓవైపు వంట చేస్తూ.. మరో వైపు ఇంకో పని అలా చేయడం స్త్రీలకు వెన్నతో పెట్టిన విద్య. ఇక.. చాలా మంది వాషింగ్ మెషిన్ ఆన్ చేసి.. దాని పని అది చేసుకుంటుంది కదా.. మరో పనికి వెళ్లిపోతారు. అయితే.. అలా వాషింగ్ మెషిన్ ఆన్ లో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం...

వాషింగ్ మెషిన్ ఆన్ లో ఉన్నప్పుడు... పొరపాటున కూడా స్నానానికి వెళ్లకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది చాలా మందికి సాధారణ విషయంలా అనిపించొచ్చు. కానీ.. దీని వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనే విషయం మీకు తెలుసా?

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
1.విద్యుత్ షాక్ ప్రమాదం...
Image Credit : Getty

1.విద్యుత్ షాక్ ప్రమాదం...

వాషింగ్ మెషిన్ అనేది అధిక స్థాయిలో కంపనాలను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మెషిన్. అయితే.. చాలా కాలం పాటు వాడుతూ ఉండటం వల్ల మెషిన్ లోపల ఉన్న వైర్లు అరగిపోతాయి. లేదా వదులుగా మారతాయి. ఈ మెషిన్ లోపల ఉన్న లైవ్ వైర్ దాని బాడీని గానీ లేదా నీటిని బయటకు పంపే పంపుకు గానీ తాకితే, ఆ విద్యుత్ నీటి ద్వారా ప్రయాణిస్తుంది.

చాలా ఇళ్లలో, వాషింగ్ మెషిన్, షవర్ ఒకే ప్లంబింగ్ లేదా డ్రైనేజ్ వ్యవస్థతో కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. అందువల్ల.. మెషిన్ నుండి వచ్చే పవర.. పైపులు, సింక్ ద్వారా మీరు స్నానం చేస్తున్న నీటి ద్వారా శరీరానికి తాకే అవకాశం ఉంది. దీని వల్ల కరెంట్ షాక్ తగిలే అవకాశం ఉంది. కాబట్టి.. ఈ పొరపాటు చేయకపోవడమే మంచిది.

2. వాటర్ స్పీడ్...

చాలా మంది ఇళ్లల్లో వాషింగ్ మెషిన్, షవర్ రెండూ ఒకే పైపు నుండి నీటిని తీసుకుంటూ ఉంటాయి. మీ ఇంట్లో కూడా అలానే ఉంటే.. వాషింగ్ మెషిన్ ఆన్ లో ఉన్నప్పుడు, స్నానానికి వెళ్తే.. మీకు వాటర్ స్పీడ్ ఎక్కువగా రాకపోవచ్చు. దీని వల్ల హ్యాపీగా స్నానం చేసినా ఫీలింగ్ రాకపోవచ్చు.

3. వైరింగ్‌లో ఓవర్‌లోడ్

పాత వైరింగ్ ఉన్న ఇళ్లలో, వాషింగ్ మెషీన్ , ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ (గీజర్) రెండింటినీ ఒకేసారి నడపడం వల్ల సర్క్యూట్ ఓవర్‌లోడ్ అయి, షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరగవచ్చు.

Related Articles

Related image1
Chicken Parts: చికెన్ తింటున్నారా? చికెన్ లో ఈ పార్ట్ తింటే ఆరోగ్యానికే ప్రమాదం...!
Related image2
Mangoes: కెమికల్స్ తో పండిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
33
 తీసుకోవలసిన జాగ్రత్తలు:
Image Credit : Istock

తీసుకోవలసిన జాగ్రత్తలు:

వాషింగ్ మెషీన్ వాడటం అయిపోయిన తర్వాత కనీసం 30-40 నిమిషాలు గడిచిన తర్వాత మాత్రమే స్నానం చేయండి.

మీ ఇంట్లో ఎలక్ట్రికల్ గ్రౌండింగ్ ఎల్లప్పుడూ సరిగ్గా ఉండేలా చూసుకోండి.

వాషింగ్ మెషీన్ బాత్రూమ్‌లో ఉన్నట్లయితే, తడి చేతులతో స్విచ్‌ను ఎప్పుడూ తాకవద్దు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangoes: అతిగా మామిడి పండ్లు తింటే లావవుతారా?
Recommended image2
Moisturizer: ఆరోగ్యమైన, మెరిసే చర్మం కావాలంటే మీ మాయిశ్చరైజర్ ను ఇలా ఎంచుకోండి
Recommended image3
Dark Neck: మెడ నల్లగా మారిందా? ఇవి రాస్తే ఆ నలుపు పోవడం ఖాయం
Related Stories
Recommended image1
Chicken Parts: చికెన్ తింటున్నారా? చికెన్ లో ఈ పార్ట్ తింటే ఆరోగ్యానికే ప్రమాదం...!
Recommended image2
Mangoes: కెమికల్స్ తో పండిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved