MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Food
  • Chicken Parts: చికెన్ తింటున్నారా? చికెన్ లో ఈ పార్ట్ తింటే ఆరోగ్యానికే ప్రమాదం...!

Chicken Parts: చికెన్ తింటున్నారా? చికెన్ లో ఈ పార్ట్ తింటే ఆరోగ్యానికే ప్రమాదం...!

 Chicken Parts: చికెన్ ఆరోగ్యానికి చాలా మంచిదే. కానీ... చికెన్ లో ఏ భాగం తింటున్నారు..? ఏ భాగాలు ఆరోగ్యానికి మంచిది? ఏవి ఆరోగ్యానికి మంచిది కాదో మీకు తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 09 2026, 05:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Chicken
Image Credit : Gemini ai

Chicken

నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే ఎంత ఇష్టం ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడయ్యే మాసం ఇదే. జిమ్ కు వెళ్లే వారికైనా, బరువు తగ్గాలి అనుకునేవారికైనా చికెన్ ఒక అద్భుతమైన ప్రోటీన్ ఆహారం. అయితే, కోడి మొత్తం ఆరోగ్యానికి మంచిది అనుకుంటే మాత్రం మీరు పొరపాటు పడినట్లే. కోడిలో కొన్ని భాగాలు తింటే కీడే ఎక్కువ జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.చికెన్ స్కిన్ ( కోడి చర్మం)...
Image Credit : chatgpt

1.చికెన్ స్కిన్ ( కోడి చర్మం)...

చాలా మంది చికెన్ వండేటప్పుడు స్కిన్ తో కలిపి వండుతుంటారు. చాలా మందికి నచ్చిన పార్ట్ ఇది. రుచి కూడా చాలా బాగుంటుంది. కానీ, చికెన్ స్కిన్ లో కేవలం కొవ్వు మాత్రమే ఉంటుంది. ఇందులో అధిక మొత్తంలో క్యాలరీ, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడానికి, భవిష్యత్తులో గుండె జబ్బులకు దారితీసే ప్రమాదం కూడా ఉంది.

2.మెడ, తల భాగాలు..

కోడి మెడ భాగం బ్యాక్టీరియా, వైరస్ లకు ప్రధాన నిలయం. కోళ్లకు ఇచ్చే కొన్ని ఇంజెక్షన్లు లేదా వ్యాక్సిన్లు కూడా ఈ ప్రాంతంలోనే ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అందుకే మెడ, తల భాగాలను తినడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. వీలైనంత వరకు వీటిని తినకపోవడమే మంచిది.

Related Articles

Related image1
Chicken: వారానికి ఎన్నిరోజులు చికెన్ తినాలి? ఇలా తింటే మాత్రం చాలా ప్రమాదం..!
Related image2
Ration Rice: రేషన్ బియ్యంలో...ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నారా ? అవి తింటే ఏమౌతుంది?
33
 3.లివర్, కందనకాయ..
Image Credit : Getty

3.లివర్, కందనకాయ..

చికెన్ లో లివర్, కందన కాయలు చాలా మందికి ఇష్టమైన భాగం. కానీ, ఇందులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. లివర్ , పేగుల్లో వ్యర్థాలు, బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. వీటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే జీర్ణ సంబంధిత వ్యాధులు వస్తాయి.

4. కాళ్లు , తోక భాగం

కోడి కాళ్లు నేల మీద తిరుగుతుంటాయి కాబట్టి వాటిపై బ్యాక్టీరియా లోడ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే తోక భాగంలో గ్రంథులు (Glands) ఎక్కువగా ఉంటాయి, ఇవి హార్మోన్ల అసమతుల్యతకు కారణం కావచ్చు. అందుకే వీటిని నివారించడం ఉత్తమం.

చికెన్ లో ఏ భాగాలు తినచ్చు..?

చికెన్ బ్రెస్ట్ (ఛాతి భాగం): ఇందులో కొవ్వు తక్కువగా, ప్రోటీన్ అత్యధికంగా ఉంటుంది.

లెగ్ పీస్ (కాళ్ల పైభాగం): ఇందులో ఐరన్ , జింక్ పుష్కలంగా ఉంటాయి.

వింగ్స్ (రెక్కలు): ఇవి కూడా తినడానికి సురక్షితమైనవే.

చికెన్ తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

చికెన్‌ను ఎప్పుడూ అధిక ఉష్ణోగ్రత వద్ద బాగా ఉడికించాలి. బ్రాయిలర్ కోళ్ల కంటే నాటు కోళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

వండే ముందు చికెన్‌ను ఉప్పు , పసుపుతో కడగడం వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Related Stories
Recommended image1
Chicken: వారానికి ఎన్నిరోజులు చికెన్ తినాలి? ఇలా తింటే మాత్రం చాలా ప్రమాదం..!
Recommended image2
Ration Rice: రేషన్ బియ్యంలో...ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నారా ? అవి తింటే ఏమౌతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved