MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Tulsi Plant: చిన్న తులసి మొక్క గుబురుగా పెరగాలా? ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వండి

Tulsi Plant: చిన్న తులసి మొక్క గుబురుగా పెరగాలా? ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వండి

Tulsi Plant: తులసి మొక్క మీ ఇంట్లో చిన్నగా ఉందా? అది పచ్చగా గుబురుగా, పెద్ద పెద్ద ఆకులతో పెరగాలంటే ఎలాంటి కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు. ఇంట్లో దొరికే వస్తువులతోనే మొక్కను పచ్చగా ఉంచే సీక్రెట్ హ్యాక్స్ మీకోసం.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 11 2026, 10:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే
Image Credit : ChatGTP

తులసి మొక్క గుబురుగా పెరగాలంటే

ఇంట్లో తులసి మొక్క ఉంటే ఎంతో మంచిది. అయితే కొందరి ఇళ్లల్లో తులసి చెట్టు చిన్నగా ఉంటుంది. త్వరగా పెరగదు. ఎత్తుగా పెరగకుండా, ఆకులు చిన్నగా ఉండి ఎండిపోతుంది. చిన్న మొక్కను గుబురుగా, పచ్చని పెద్ద ఆకులతో ఎలా పెంచాలో ఇక్కడ కొన్ని ట్రిక్స్ చెప్పాము అవి ఫాలో అయితే సరిపోతుంది.

మొక్కను ఒకే కొమ్మలా పైకి పెరగనివ్వకండి. మొక్క పైభాగంలో ఉండే చిన్న చిగురు ఆకులను గోటితో లేదా కత్తెరతో కత్తిరించండి. ఇలా ఒక చివర కత్తిరిస్తే, దాని పక్కనుంచి 2 కొత్త కొమ్మలు వస్తాయి. ఆ కొత్త కొమ్మలను మళ్లీ పించ్ చేస్తే 4, ఆ తర్వాత 8 కొమ్మలు వచ్చి మొక్క కొద్ది రోజుల్లోనే గుండ్రంగా, గుబురుగా (Bushy) పెరుగుతుంది.

కుండీలోని మట్టికి తగిలేలా ఉండే ఆకులను వెంటనే తుంచేయండి. మట్టిలోని తేమ ఆకులకు తగిలితే మొక్కకు ఫంగస్ వచ్చి వేర్లు కుళ్లిపోతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పూతను కత్తిరించండి
Image Credit : instagram

పూతను కత్తిరించండి

తులసి మొక్కకు పూలు లేదా గింజలు ఉన్న భాగాలు రాగానే దాన్ని కత్తిరించి తీసేయాలి. పూలు అలాగే ఉంటే, తన వయసు అయిపోయిందని మొక్క భావించి ఎండిపోవడం మొదలవుతుంది. పూలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తుంటే మొక్క ఎప్పుడూ పచ్చగా ఉంటుంది.

వర్షం పడినప్పుడు లేదా పదే పదే నీళ్లు పోసినప్పుడు కుండీలోని మట్టి గట్టిపడుతుంది. మట్టి బిగుతుగా మారితే వేర్లకు ఆక్సిజన్ అందదు. నెలకు ఒకసారి చెంచా లేదా స్క్రూడ్రైవర్‌తో మట్టిని పైనుంచి కిందకు తేలికగా కదిలించండి. దీనివల్ల నీరు, ఆక్సిజన్ వేర్లకు సులభంగా చేరుతాయి.

33
టీ/కాఫీ పొడి ఎరువు బెస్ట్
Image Credit : Getty

టీ/కాఫీ పొడి ఎరువు బెస్ట్

తులసి మొక్కకు ఎప్పుడూ ఎలాంటి రసాయన (Chemical) ఎరువులు వేయకండి. తులసి చాలా సున్నితంగా ఉంటుంది, వెంటనే ఎండిపోతుంది. సహజంగా పెరగడానికి, వాడేసిన టీ పొడి లేదా కాఫీ పొడిని (పాలు, చక్కెర పోయేలా నీటితో కడిగి ఆరబెట్టి) నెలకు ఒకసారి మట్టిలో వేయండి. దీనివల్ల మొక్కకు మంచి నైట్రోజన్ అంది ఆకులు పెద్దగా పెరుగుతాయి.

తులసి మొక్కను నీడలో లేదా ఇతర పెద్ద మొక్కల కింద ఉంచకండి. రోజుకు కనీసం 4 నుంచి 5 గంటల పాటు నేరుగా ఎండ పడే చోట ఉంచితేనే మొక్క రోగాల్లేకుండా పచ్చగా పెరుగుతుంది.

మట్టిలో వానపాములు (Earthworms) కనిపిస్తే అవి మొక్క వేర్లను తినవు. బదులుగా ఎండు ఆకులను తిని మట్టిని సారవంతం చేస్తాయి. వానపాములు ఉండటం మీ మట్టి ఆరోగ్యంగా ఉందనడానికి సంకేతం!

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Haram Designs: 4 తులాల్లో వచ్చే గోల్డ్ హారం డిజైన్లు చూసేయండి
Recommended image2
Coin Necklace:పట్టుచీరల మీదకు మీ అందాన్ని పెంచే కాసుల నక్లెస్ డిజైన్లు
Recommended image3
Banana: రాత్రిపూట అరటి పండు తింటే ఏమౌతుంది? నిజంగా బరువు పెరుగుతారా?
Related Stories
Recommended image1
Waterless Washing machine: చుక్క నీరు అక్కర్లేని వాషింగ్ మెషీన్.. దుస్తులు చక్కగా ఉతికి పొడిగానే అందిస్తుంది
Recommended image2
రోడ్లు వేసేందుకు వాడే నల్లటి తారు ఎలా తయారవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved