పడుకుని ల్యాప్ టాప్ లో వర్క్ చేస్తున్నారా? ఇదెంత డేంజరో తెలుసా..?
ల్యాప్ టాప్ ను ఉపయోగిస్తున్నామా? లేదా? అనేది కాదు.. దీన్ని సరిగ్గా వాడుతున్నామా లేదా అనేది ముఖ్యం. ఎందుకంటే ఎలా పడితే అలా వాడితే లేనిపోని శారీరక సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఒకప్పుడు ల్యాప్ టాప్ ల వాడకం చాలా అంటే చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇవి దర్శనమిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఫోన్లతో పాటుగా ల్యాప్ టాప్ లు కూడా మన జీవితంలో ఒక భాగమై పోయాయి. ల్యాప్ టాప్ లు ఒక్క ఆఫీస్ వర్క్ యే కాదు ఎన్నో రకాల పనులను అలవోకగా చేస్తాయి. కొంతమంది ఆఫీస్ వర్క్ మాత్రమే టేబుల్ పై పెట్టి చేస్తారు. మిగతా వాటికి ఒళ్లో పెట్టుకొనో లేకపోతే.. పడుకునో ఉపయోగిస్తుంటారు. ల్యాప్ టాప్ ను టేబుల్ పై పెట్టి యూజ్ చేయడమే ఆరోగ్యానికి మంచిది. కానీ వర్క్ ఫ్రం హోం వల్ల దీనిని ఎలా పడితే అలా వాడుతున్నారు. ఏ పొజీషన్ కంఫర్ట్ గా ఉంటే.. అలాగే వాడుతున్నారు. కొంతమంది అయితే బోర్లా పడుకుని ల్యాప్ టాప్ ను ముందు పెట్టుకుని యూజ్ చేస్తున్నారు. కానీ ఇలా చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మెడనొప్పి
ల్యాప్ ట్యాప్ ను వాడుతుంటే ఎంత సమయం గడిచిపోయిందో కూడా తెలియదు. అయితే పొట్టపై పడుకుని దీన్ని ఉపయోగించడం వల్ల మెడనొప్పి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఒకే పొజీషన్ లో మెడను పెట్టినప్పుడు ఈ సమస్య వస్తుంది. అంతేకాదు ఈ పొజీషన్ లో గంటలకు గంటలు ఉంటే వెన్ను నొప్పి కూడా వస్తుంది. ఎందుకంటే ఇలా ఉంటే వెన్నుపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఇది కాస్త వెన్ను నొప్పికి దారితీస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఏండ్ల నుంచి మీరు ల్యాప్ టాప్ ను ఇలా వాడుతున్నట్టైతే గర్భాశయ నొప్పి కూడా వస్తుంది. అందుకే ఈ పొజీషన్ లో ల్యాప్ టాప్ ను అస్సలు యూజ్ చేయకండి.
వెన్నుపాము సమస్య
పొట్టపై పడుకుని ల్యాప్ టాప్ ను ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల వెన్నుపాముపై చెడు ప్రభావం పడుతుంది. ఇలా పడుకోవడం వల్ల వెన్ను కండరాలు సాగుతాయి. అలాగే ఎముక నొప్పి పెడుతుంది. మీకు తెలుసో తెలియదో కానీ వెన్నుపాముకు ఏదైనా అయితే మీరు పూర్తిగా వికాలాంగులు అవుతారు. అందుకే ఇలా పడుకోవడం మానేయండి.
జీర్ణక్రియ సమస్య
కడుపు మీద పడుకుని ల్యాప్ టాప్ లో పనిచేయడం వల్ల జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఈ పొజీషన్ లో జీర్ణక్రియ దెబ్బతింటుంది. దీంతో మలబద్దకం, గ్యాస్ట్రిక్ సమస్యకు కారణమవుతుంది. ఆకలి కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది.
కళ్లపై చెడు ప్రభావం
కళ్లు చాలా సున్నితమైనవి. కానీ మీరు ఈ పొజీషన్ లో పడుకోవడం వల్ల కళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎందుకంటే ఈ పొజీషన్ లో మీ కళ్లకు, ల్యాప్ టాప్ కు చాలా తక్కువ దూరం ఉంటుంది. దీంతో బ్లూ లైట్ మీ కళ్లపై నేరుగా పడి కంటిచూపును తగ్గిస్తుంది. ఏండ్ల నుంచి మీరు ఇలాగే చేస్తున్నట్టైతే మీరు పూర్తిగా గుడ్డి వాళ్లు కావొచ్చు.