Weight loss: కిలల్లో బరువు తగ్గాలంటే ఇలా చేయండి..
Weight loss: ఎలా బరువు తగ్గేది.. సరైన డైట్ పాటిస్తున్న.. అయినా బరువు తగ్గడం లేదే ఏంటని మీరు చింతిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఇక్కడ ఇచ్చిన కొన్ని చిట్కాలు మీరు వేగంగా బరువు తగ్గడానికి ఎంతో సహాయపడతాయి. అవేంటంటే..

Weight loss: ప్రస్తుత కాలంలో అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఈ సమస్య సర్వసాధారణం అనిపించినా.. దీని బారిన పడితే ఎన్నో ప్రాణాంతక రోగాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఈ సమస్య నుంచి వీలైనంత తొందరగా బయటపడాలి.
weight loss
ఎలాంటి ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతారు.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి.. అసలు అవన్ని చేసినా బరువు తగ్గుతామా? అన్న ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి. వాస్తవానికి మీ దినచర్యలో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటే సులువుగా బరువు తగ్గొచ్చు. అంతేకాదు వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే కొన్ని రోజుల్లోనే కిలల్లో బరువును కోల్పోవచ్చు.
weight loss
పిండి పదార్థాలు.. మీకు ప్రోటన్లు ఎంత అవసరమో.. పిండి పదార్థాలు కూడా అంతే అవసరం. ప్రతిరోజూ కొంత మొత్తంలో పిండిపదార్థాలు తీసుకోవడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. అంతేకాదు ఇవి చక్కెర పదార్థాలవైపు మళ్లకుండా మిమ్మల్ని కాపాడుతుంది. వ్యాయామంలో మీరు అలసిపోకుండా మీకు శక్తినిస్తుంది. దీంతో మీరు చాలా సేపటి వరకు వ్యాయామం చేయొచ్చు. ఈ పిండి పదార్థాలను భోజనంలోనే కాదు.. వ్యాయామం తర్వాత కూడా తీసుకోవాలి. మీరు మోతాదులోనే తినాలంటే కేలరీలు తక్కువగా ఉండే కూరగాలయలు, తృణధాన్యాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.
weight loss
థెరపిస్ట్ సహాయం తీసుకోండి.. అవును థెరపిస్ట్ సహాయం తీసుకుంటే మీరు బరువు తగ్గే ప్రాసెస్ మరింత సులువు అవుతుంది. భావోధ్వేగ ఆహారం లేదా తీవ్రమైన ఒత్తిడితో మీరు మోతాదుకు మించి ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి ఆహార సమస్యలున్న వారు సరైన కౌన్సిలింగ్ తీసుకుంటే.. అధిక బరువు సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు.
నిద్ర.. ప్రస్తుత కాలంలో నిద్రలేమితో బాధపడేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా మన దేశంలో 97 శాతం మంది ప్రజలు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని ఓ సర్వే చెబుతోంది. సాధారణంగా ఒక వ్యక్తికి 7 నుంచి 8 గంటల నిద్ర ఖచ్చితంగా అవసరం. కాగా కంటికి సరిపడా నిద్రలేకపోడం వల్లే బరువు పెరుగుతున్నారు. ముఖ్యంగా సరైన నిద్రవిధానాలు లేకలేతే బరువు తగ్గే ప్రాసెస్ నెమ్మదిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
చిన్నపిల్లాడిలా ప్రవర్తించండి.. వ్యాయామం షెడ్యూల్డ్ పైనే కాకుండా.. కొన్ని చిన్నపిల్లలు చేసే అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా కూడా సులభంగా బరువు తగ్గొచ్చు. ఎలా అంటే లంచ్ తర్వాత ఇంట్లోనే కూర్చోకుండా కాసేపు బయట అలా అలా నడవండి. ఏదైనా అవసరం ఉంటే ఆన్లైలో కాకుండా మీరు స్వయంగా కిరాణం షాపుకు నడిచి వెళ్లి తెచ్చుకోండి. చిన్న చిన్నలు ఉండే విధంగా అంటే పదే పదే నడవడం వల్ల మీరు వేగంగా బరువు తగ్గొచ్చు. పిల్లలు రోజంతా అలసిపోకుండా ఎలా అయితే పెరుగుత్తుతారో అలా మీరు కూడా మీ శరీరాన్ని కదిలిస్తే చాలా ఫాస్ట్ గా బరువు తగ్గుతారు.
డైట్ లేదా వర్కౌట్.. వ్యాయామం, మంచి డైట్ యే మిమ్మల్ని అధిక బరువు సమస్య నుంచి తొందరగా బయటపడేసే మార్గాలు. మీరు ఒంటరిగా వీటిని చేయలేరు. అలాంటి సమయంలో మీ స్నేహితులతో కలిసి వ్యాయామం చేయండి. అప్పుడు ఎలాంటి బోర్ రాదు. ఒకరకంగా చెప్పాలంటే స్నేహితులతో కలిసి వ్యాయామాలు చేయడంతో మీరు మునపటి కంటే మరింత బరువును కోల్పోవచ్చు. ఎందుకంటే ఒకరికొకరు ప్రేరేపించుకోవచ్చు. దీంతో మీరు చాలా ఫాస్ట్ గా బరువు తగ్గుతారు.