గుజరాత్‌లోని భావనగర్‌కు ఎప్పుడైనా వెళ్ళారా.. ఎంత అందంగా ఉంటుందో తెలుసా?
భావనగర్ (Bhavnagar) ఒక తీర ప్రదేశం. ఇది గుజరాత్ (Gujarat) దక్షిణ భాగం లోను ఖామ్భాట్ గల్ఫ్ కు పడమటి గాను ఉంది. ఈ నగరం గుజరాత్ లోని ప్రధాన వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి. భావనగర్ విద్యా, సాంస్కృతిక పరంగా అభివృద్ధి చెందడంతో గుజరాత్ కు సంస్కారి కేంద్రం అని కూడా అంటారు. ఈ నగరంలో అనేక సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఇవి పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటాయి.

ఈ నగరం సముద్రపు వ్యాపారానికి, రత్నాలకు, సిల్వర్ ఆభరణాల వ్యాపారానికి ప్రసిద్ధి చెంది గుజరాత్ కు ప్రధాన వ్యాపార కేంద్రంగా (Business center) రూపుదిద్దుకుంది. ఈ నగరాన్ని పూర్వంలో వడవా (Vadava) అని పిలిచేవారు. ఈ నగరంలో ప్రధాన ఆకర్షణగా నీలంబాగ్ ప్యాలస్, గౌరీశంకర్ లేక్, విక్టోరియా ఫారెస్ట్, ఘోఘా బీచ్, బార్టన్ లైబ్రరీ, గంగా జలియా లేక్, గాంధీ స్మ్రితి, బ్రహ్మ కుంట, వేరవదార్ బ్లాకు బాక్ నేషనల్ పార్క్ ఇలా మొదలగునవి ఉన్నాయి.
వేరవదార్ బ్లాకు బాక్ నేషనల్ పార్క్: భావ నగర్ లో సౌరాష్ట్ర ప్రాంతంలోని భాల్ లో వేరవదార్ బ్లాకు బాక్ నేషనల్ పార్క్ (Veravadar Block Back National Park) ఉంది. ఈ నేషనల్ పార్కును 1976 లో నిర్మించారు. ఈ నేషనల్ పార్కు ప్రధాన ఆకర్షణగా (Main attraction) బ్లాకు బాక్ లు ఉన్నాయి. ఈ పార్కు సందర్శనలో బ్లాకు బాక్ లతో పాటు జకల్, వోల్ఫ్, నీల్గాయి, జంగల్ కాట్ ఇలా మొదలగు పక్షులను కూడా చూడవచ్చు.
పిరంబెత: గుజరాత్ లోని భావనగర్ జిల్లాలో ఘోఘా నుండి పిరంబెత (Pirambetha) ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ద్వీపానికి ప్రధాన ఆకర్షణగా క్రీస్తుపూర్వం 1325 లో నిర్మించిన కోట (Fortress) కలదు. ఈ దీవి సందర్శనలో ఎన్నో ప్రాణులను చూడవచ్చు. ఈ దీవి సందర్శన పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటుంది.
గాంధీ స్మ్రితి: 1955 లో మహాత్మా గాంధీ స్మారకంగా గాంధీ స్మ్రితి (Gandhi Smriti) భవనాన్ని భావ నగర్ లో నిర్మించారు. ఈ భవనం లో మహాత్మా గాంధీ ఉపయోగించిన వస్తువుల సేకరణతో పాటు వివిధ రకాల పుస్తకాలను కూడా ఉంచారు. గాంధీ గారి జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటోగ్రాఫర్ (Photographer) లను కూడా ప్రదర్శిస్తారు. ఈ భవనం భావనగర్ కు ప్రధాన ఆకర్షణగా రూపుదిద్దుకుంది.
ఘోఘా బీచ్: భావ నగర్ కు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఘోఘా బీచ్ (Ghogha Beach) ఉంది. స్థానికులు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపడానికి ఈ బీచ్ కు వస్తుంటారు. ఈ బీచ్ భావనగర్ కు ప్రధాన ఆకర్షణగా ఉండి పర్యాటకులను ఆకట్టుకునేలా (Impressive) ఉంటుంది. భావ నగర్ కు వెళ్ళినప్పుడు ఈ బీచ్ ను తప్పక సందర్శించండి.
నీలంబాగ్ ప్యాలస్: నీలంబాగ్ ప్యాలస్ (Nilambag Palace) ను క్రీ. శ 1859లో సుమారు పది ఎకరాల స్థలంలో నిర్మించారు. ఈ ప్యాలస్ లో రాజ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. ఈ ప్యాలస్ జర్మన్ శిల్పి (German sculptor) రూపొందించినప్పటికీ భారతీయ శిల్పకళ నిర్మాణాన్ని పోలి ఉంటుంది.