MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Train: రాత్రిపూట రైలు ప్రయాణం చేస్తున్నారా? ఈ 5 రూల్స్ తెలియకపోతే చిక్కుల్లో పడ్డట్లే..!

Train: రాత్రిపూట రైలు ప్రయాణం చేస్తున్నారా? ఈ 5 రూల్స్ తెలియకపోతే చిక్కుల్లో పడ్డట్లే..!

Train: చాలా మంది రాత్రిపూట రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. అయితే, రాత్రిపూట రైలులో ప్రయాణించాలి అంటే.. కొన్ని రూల్స్ కచ్చితంగా పాటించాలి. లేకపోతే..మీరే చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 18 2026, 09:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
ఈ రూల్స్ మీకు తెలుసా?
Image Credit : ఏఐ ఆధారంగా రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

ఈ రూల్స్ మీకు తెలుసా?

మన దేశంలో కోట్లాది మంది ప్రజలు ప్రయాణానికి రైళ్లనే మొదటి ఆప్షన్ గా ఎంచుకుంటారు. పగటి ప్రయాణంతో పోలిస్తే రాత్రి సమయాల్లో ప్రయాణించడం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే, రాత్రిపూట రైలులో ప్రయాణించేటప్పుడు తోటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇండియన్ రైల్వేస్ కొన్ని ప్రత్యేక నిబంధనలను అమలు చేస్తోంది. రాత్రిపూట రైలులో ప్రయాణించాలంటే కచ్చితంగా పాటించాల్సిన 5 రూల్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
1.రాత్రి 10 తర్వాత సౌండ్ పొల్యూషన్ వద్దు...
Image Credit : ఏఐ ఆధారంగా రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

1.రాత్రి 10 తర్వాత సౌండ్ పొల్యూషన్ వద్దు...

రాత్రి 10 గంటలు దాటిన తర్వాత తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా ప్రవర్తించడం నిబంధనలకు విరుద్ధం. ఇయర్‌ఫోన్స్ లేకుండా లౌడ్‌స్పీకర్లలో పాటలు వినడం, ఫోన్లలో గట్టిగా అరవడం లేదా పెద్దగా మాట్లాడటం వంటివి చేయకూడదు. ఇది నిద్రపోతున్న మిగతా ప్రయాణికులకు తీవ్రమైన డిస్టర్బెన్స్‌ను కలిగిస్తుంది.

లైట్ల వినియోగంపై ఆంక్షలు 

రాత్రి సమయంలో అందరూ ప్రశాంతంగా నిద్రపోవడానికి వీలుగా కేవలం 'నైట్ లైట్' మాత్రమే ఉపయోగించాలి. మిగతా మెయిన్ లైట్లన్నీ ఆఫ్‌ చేయడం మంచిది. అర్ధరాత్రిళ్లు ప్రకాశవంతమైన లైట్లు వేయడం వల్ల ఇతరులకు నిద్ర భంగం కలుగుతుంది.

 మిడిల్ బెర్త్ నిబంధనలు 

రైళ్లలో లోయర్, మిడిల్, అప్పర్ బెర్త్‌ల కేటాయింపుపై స్పష్టమైన రూల్స్ ఉన్నాయి. మిడిల్ బెర్త్ ప్రయాణికులు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మాత్రమే తమ బెర్త్‌ను నిద్రపోవడానికి ఉపయోగించుకోవాలి. మిగతా సమయాల్లో మిడిల్ బెర్త్‌ను మడతపెట్టి ఉంచాలి. అలాగే, రాత్రి 10 తర్వాత లోయర్ బెర్త్ ప్రయాణికులను ఇబ్బంది పెట్టకుండా నిబంధనలు పాటించాలి.

 రాత్రిపూట ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు..

చాలా వరకు ట్రైన్లలో రాత్రి 10 గంటల తర్వాత ఆన్‌బోర్డ్ క్యాటరింగ్ లేదా ఫుడ్ సర్వీస్ నిలిచిపోతాయి. కాబట్టి మీకు రాత్రి సమయంలో ఆకలి వేస్తే ముందుగానే డిన్నర్ ప్లాన్ చేసుకోవడం లేదా ఈ-కేటరింగ్ ద్వారా ముందే ఫుడ్ ఆర్డర్ బుక్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవడం ఉత్తమం.

మొబైల్, లాప్‌టాప్ ఛార్జింగ్.. 

చాలా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రాత్రి 11 గంటల తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా ఛార్జింగ్ పాయింట్ల వద్ద పవర్ సప్లై నిలిపివేస్తారు. కాబట్టి రాత్రి 11 గంటలలోపే మీ మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఇతర గ్యాజెట్లను ఛార్జ్ చేసుకుని ఉంచుకోవడం చాలా ముఖ్యం.

రైలు ప్రయాణం అందరిదీ.. తోటి ప్రయాణికుల సౌకర్యాన్ని గౌరవిస్తూ, ఈ చిన్న చిన్న రైల్వే రూల్స్‌ను పాటిస్తే మన ప్రయాణం ఎంతో సురక్షితంగా, ప్రశాంతంగా సాగిపోతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 
3rd ODI • AUS vs ENG 2026
Live
AUSAUS
-
ENGENG
(11.4 ov)96/1
ENG chose to bat.
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Stumps
PAKPAK
(37.2 ov)121/3
SLSL
98
Day 1
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Sweet Corn Idli: పప్పు నానబెట్టే పనిలేకుండా క్షణాల్లో రెడీ అయిపోయే స్వీట్ కార్న్ ఇడ్లీ
Recommended image2
Gold Necklace: అర తులం బంగారంలో వచ్చే లైట్ వెయిట్ నెక్లెస్ డిజైన్లు!
Recommended image3
Gardening: ఇంట్లో కుండీలో కొత్తిమీర పెంచాలా? ఇలా చేసి చూడండి
Related Stories
Recommended image1
Om Island: ప్రకృతి సిద్ధంగా ‘ఓం’ ఆకారంలో ఏర్పడిన దీవి ఏదో తెలుసా? మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?
Recommended image2
Smallest River: భారతదేశంలో అతి చిన్న నది ఇది, 60 ఏళ్లు ఎండిపోయి.. మళ్లీ ప్రాణం పోసుకున్న నది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved