- Home
- Life
- Indian Tourism : స్కాంట్లాండ్ ఆఫ్ ఇండియాగా పిలిచే టూరిస్ట్ ప్లేస్ ఏది? ఈ ప్రకృతి అందాలకు ఆంగ్లేయులే ఫిదా
Indian Tourism : స్కాంట్లాండ్ ఆఫ్ ఇండియాగా పిలిచే టూరిస్ట్ ప్లేస్ ఏది? ఈ ప్రకృతి అందాలకు ఆంగ్లేయులే ఫిదా
నవంబర్ నెలలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లేదా పార్ట్‌నర్‌తో కలిసి ట్రిప్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ చలికాలంలో ఎంజాయ్ చేయడానికి మన పొరుగురాష్ట్రం కర్ణాటకలో బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.

నవంబర్‌లో ట్రిప్ వేయడానికి 5 బెస్ట్ ప్లేసెస్
వానాకాలం వెళ్లిపోయి, చలికాలం మొదలయ్యే నవంబర్ నెల ట్రిప్స్‌కు భలే సెట్ అవుతుంది. పచ్చని కొండలు, కాఫీ తోటలు, చారిత్రక కట్టడాలు, వైల్డ్ లైఫ్, ప్రశాంతమైన బీచ్‌లు చూడటానికి ఇదే కరెక్ట్ టైమ్. మరి తెలుగు రాష్ట్రాలకు పొరుగునే ఉన్న కర్ణాటకలో ఇలాంటి అద్భుతమైన ప్లేసెస్ చాలా ఉన్నాయి. వాటిగురించి తెలుసుకొండి… నవంబర్ లో ట్రిప్ ప్లాన్ చేసుకొండి.
స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా - కూర్గ్
తెల్లవారుజామున కురుస్తున్న మంచులోంచి సూర్యుడి కిరణాలు దూసుకొచ్చి లేత ఎండ శరీరానికి తాకుతుంటే ఆ హాయి వేరే లెవెల్ ఉంటుంది… ఈ అనుభూతిని పొందాలంటే కూర్గ్ వెళ్లాల్సిందే. ఇక చలిగాలులు, పచ్చని కొండలు, పక్షుల కిలకిలరావాలు, జలపాతాలు… కర్ణాటకలోకి కూర్గ్ ప్రాంతం అందాలకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అందుకే ఇండియాను పాలించిన ఆంగ్లేయులే ఈ ప్రాంతాన్ని ''స్కాంట్లాండ్ ఆఫ్ ఇండియా'' గా అభివర్ణించారు. దక్షిణాది ప్రజలు దీనిని కర్ణాటక కాశ్మీర్‌గా పిలుచుకుంటారు.
కూర్గ్ (కొడగు) నవంబర్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ ఉదయం పూట వాతావరణం భలే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి అందాలను పరవశించనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు… అందుకే కూర్గ్ కు వెళితే తిరిగి వెనక్కి రావాలనిపించదని చాలామంది చెబుతుంటారు.
ఇండియాలో అత్యధికంగా కాఫీని ఉత్పత్తిచేసే ప్రాంతం కూర్గ్. కొండల అంచుల్లోని ఆ కాఫీతోటలు పర్యాటకులను కట్టిపడేస్తాయి… వీటి మధ్య మీ పార్ట్‌నర్‌తో కలిసి నడుస్తుంటే ఆ ఫీలింగే వేరు. అబ్బే ఫాల్స్, రాజా సీట్, దుబారే ఎలిఫెంట్ క్యాంప్, తలకావేరి లాంటివి ఇక్కడ చూడొచ్చు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో వెళ్లడానికి ఇది బెస్ట్ స్పాట్.
కబిని
మైసూర్ దగ్గర్లోని కబిని డ్యామ్ చలికాలంలో చూడాల్సిన బెస్ట్ ప్లేస్. మీరు కూర్గ్ వెళ్లేటప్పుడు లేదా వస్తున్నప్పుడు దీన్ని కవర్ చేయొచ్చు. ఇక్కడ వైల్డ్ లైఫ్ సఫారీ చాలా ఫేమస్. ఏనుగులు, పులులు, రకరకాల పక్షులను దగ్గరి నుంచి చూడొచ్చు.
కబిని బ్యాక్ వాటర్స్ అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. నేచర్ లవర్స్‌కు ఇది పర్ఫెక్ట్ స్పాట్. అయితే సఫారీ టైమింగ్స్, పర్మిషన్స్ గురించి ముందే తెలుసుకుని వెళ్లడం మంచిది.
గోకర్ణ
నవంబర్ ట్రిప్‌కు గోకర్ణ కూడా బెస్ట్ ఆప్షన్. ఓం బీచ్, కుడ్లే బీచ్, మహాబలేశ్వర్ టెంపుల్, అరేబియా సముద్రం అందాలు ఇక్కడ స్పెషల్. వానాకాలం తర్వాత ఇక్కడి వాతావరణం చాలా బాగుంటుంది. అయితే సముద్రంలోకి దిగేముందు స్థానిక భద్రతా నియమాలను కచ్చితంగా పాటించండి.
చిక్కమగళూరు
నవంబర్‌లో వెళ్లాల్సిన మరో అందమైన ప్లేస్ చిక్కమగళూరు. ముళ్లయనగిరి, బాబాబుడన్‌గిరి, కాఫీ తోటలు ఇక్కడ స్పెషల్. మీరు ట్రెక్కింగ్ ఇష్టపడేవారైతే కచ్చితంగా ఇక్కడికి వెళ్లాల్సిందే. నవంబర్‌లో వానలు తగ్గి, వాతావరణం చల్లగా ఉంటుంది.
కర్ణాటకలోనే ఎత్తైన శిఖరం ముళ్లయనగిరి ఇక్కడే ఉంది. ఝరి ఫాల్స్, కాఫీ తోటల అందాలను ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఫోటోగ్రఫీ ఇష్టపడేవాళ్లకు ఇది సూపర్ స్పాట్.
హంపి
చలికాలంలో హంపి ట్రిప్ ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. డిసెంబర్, జనవరిలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నవంబర్‌లో వెళ్లడం బెస్ట్. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ఇక్కడ కళ్లారా చూడొచ్చు. రాతి రథం, విరూపాక్ష, విజయ విఠల ఆలయాలు, తుంగభద్ర నది అందాలు ఆకట్టుకుంటాయి.
నవంబర్‌లో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి పగటిపూట హంపి అంతా నడుచుకుంటూ తిరగొచ్చు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ప్లేస్ హిస్టరీ లవర్స్‌కు బాగా నచ్చుతుంది. పక్కనే ఉన్న అంజనాద్రి కొండ పైనుంచి హంపిని చూస్తే ఆ వ్యూ అద్భుతంగా ఉంటుంది.





