- Home
- Life
- Seafood Capital: మన దేశపు సీఫుడ్ రాజధాని ఇదే... ఇక్కడ దొరికే చేపల రకాలు మరెక్కడా దొరకవు..!
Seafood Capital: మన దేశపు సీఫుడ్ రాజధాని ఇదే... ఇక్కడ దొరికే చేపల రకాలు మరెక్కడా దొరకవు..!
Seafood Capital: చికెన్, మటన్ కి మించిన క్రేజ్ చేపలకు ఉంటుంది. మన దేశంలో చాలా చోట్ల చేపలు దొరుకుతాయి. కానీ, స్పెషల్ గా సీఫుడ్ కి ఒక స్పెషల్ క్యాపిటల్ ఉంది. అక్కడ దొరికినన్ని చేపల రకాలు మీకు మరెక్కడా దొరకవు.

తాజా చేపలు ఇక్కడి స్పెషల్..
భారతదేశంలో సీఫుడ్ అంటే కేవలం ఒక ఆహారం మాత్రమే కాదు... అది ఒక సంప్రదాయం. చాలా మందికి జీవనోపాధి. ఘాటైన రొయ్యల ఇగురు నుంచి... కమ్మని చేపల పులుసు, ఫిష్ ఫ్రై వరకు ప్రతి తీర ప్రాంతానికి దానికంటూ ప్రత్యేకమైన రుచులు, కథలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సీఫుడ్ ని ఇష్టపడేవారు ఉన్నారు... దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ సీ ఫుడ్ దొరకచ్చు. కానీ, దేశవ్యాప్తంగా ఎక్కడా దొరకనన్ని చేపల రకాల, పలు రకాల సీఫుడ్స్ దొరికే ఓ ప్రదేశం ఉంది. మన దేశంలోనే సీఫుడ్ కి రాజధానిగా నిలిచిన ప్రదేశం ఒకటి ఉంది. అది ఏంటి? దాని ప్రత్యేకత ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...
భారత దేశ సీఫుడ్ క్యాపిటల్...
మన తెలుగు రాష్ట్రాల్లో సీఫుడ్ విపరీతంగా దొరికే ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిని మించిన ప్రదేశం మరొకటి ఉంది అదే.అరేబియా సముద్ర తీరాన నైరుతి భారతదేశంలో ఉన్న కొచ్చి నగరం. ఇక్కడ సీ ఫుడ్ తో ఉన్న బంధం కేవలం వంటకాలకే పరిమితం కాలేదు. అది ఆర్థిక, సాంస్కృతికంగా చాలా పేరు పొందింది. శతాబ్దాలుగా చాలా మంది ప్రజలు ఇక్కడ చేపలు పడుతూ తమ జీవితాన్ని సాగిస్తున్నారు. ఉదయం సూర్యోదయానికి ముందే చపల వేటకు వెళ్లి.. మధ్యాహ్నం అదే చేపలను వేలం వేస్తూ మత్స్యకారులు అక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తారు.
కొచ్చిలో ఎక్కువగా ఎలాంటి సీఫుడ్ దొరుకుతుందంటే...
తాజా రొయ్యలు పెర్ల్ స్పాట్ ఫిష్ - కొర్రమీను..
పీతలు, లాబ్ స్టర్స్,
మస్ల్స్, క్లామ్స్ స్క్విడ్ , కటిల్‌ఫిష్ సీర్ ఫిష్ , ట్యూనా రకం చేపలు చాలా ఎక్కువగా దొరుకుతాయి.
చాలా తీర ప్రాంతాల్లో చేపలు, సీఫుడ్స్ దొరుకుతాయి. కానీ, వల వేసి చేపలను పట్టి.. రెండు, మూడు రోజుల తర్వాత వాటిని అమ్మే అవకాశం ఉంటుంది. కానీ, కొచ్చిలో మాత్రం కాదు. ఇక్కడి తీర ప్రాంతంలో చేపలు నేరుగా బోటులో నుంచి వంట గదిలోకి అడుగుపెడతాయి. అంటే... ఇక్కడ దొరికినంత తాజాగా చేపలు మరెక్కడా దొరకవు.
కొచ్చి సీఫుడ్ లో ప్రత్యేక ఏంటి?
చాలా నగరాల్లో సీఫుడ్ కేవలం ఒక పాపులర్ వంటకం కాకపోవచ్చు. కానీ కొచ్చిలో మాత్రం అది ఒక జీవన విధానం. ఇక్కడ సీఫుడ్ తయారు చేసే వంటల్లో కచ్చితంగా కొబ్బరి, కరివేపాకు, ఆవాలు, నల్లమిరియాలు, పచ్చిమిర్చి, చింతపండు వాడతారు. అంతేకాదు.. చాలా తక్కువ మంట మీద నెమ్మదిగా వండతారు. అందుకే.. ఇక్కడ సీఫుడ్ చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ అతి పెద్ద ఫిష్ మార్కెట్ కూడా ఉంది. చాలా మంది.. ఆ మార్కెట్ కి వెళ్లి... డైరెక్ట్ గా కొనుక్కొని వెళ్తూ ఉంటారు. కేవలం అక్కడి స్థానికులు మాత్రమే కాదు... పర్యాటకులు కూడా అక్కడి చేపలను డైరెక్ట్ గా కొనుక్కొని.. తాము ఉన్న హోటల్ కి తీసుకువెళ్లి స్పెషల్ గా వండించుకుంటూ ఉంటారు.
కొచ్చిలో తప్పకుండా రుచి చూడాల్సిన సీఫుడ్ డిషెస్...
మీరు కనుక ఎప్పుడైనా కొచ్చి వెళితే.. ఈ కింది డిషెస్ టేస్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.. ఈ ఫుడ్స్ మీకు కేవలం ఫేమస్ రెస్టారెంట్స్ లో మాత్రమే కాదు.. అక్కడ ఏ ఇంటికి వెళ్లినా.. ఇంతే అద్భుతంగా వండిపెడతారు.
కొరమీను పొలిచత్తు : మసాలాలతో మారినేట్ చేసిన పెర్ల్ స్పాట్ చేపను అరటి ఆకులో చుట్టి, నెమ్మదిగా కాల్చి తయారు చేసే అద్భుతమైన వంటకం.
కేరళ ఫిష్ కర్రీ : కొబ్బరి, చింతపండు, ఆ రోజు దొరికిన తాజా చేపలతో చేసే కమ్మనైన పులుసు.
చెంమీన్ కర్రీ : కేరళ తీర ప్రాంత రుచులను పూర్తిగా ప్రతిబింబించే రిచ్ ప్రాన్స్ (రొయ్యల) కూర.
క్రాబ్ రోస్ట్ : కరివేపాకు, ఉల్లిపాయలు దట్టించిన మసాలాలో వండిన కారకారలాడే పీతల రోస్ట్.
మీన్ మోయిలీ : కొబ్బరి పాలు, పసుపు, పచ్చిమిర్చితో వండే లైట్ ఫిష్ కర్రీ.
కొచ్చి ఎందుకు ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది?
మంగళూరు, విశాఖపట్నం, చెన్నై లాంటి నగరాలు కూడా అద్భుతమైన సీఫుడ్‌కు పేరుగాంచినవే. ప్రతి నగరానికి దానికంటూ బలమైన తీర ప్రాంత ఆహార సంస్కృతి ఉంది. అయితే కొచ్చి నే సీఫుడ్ క్యాపిటల్ గా ఎందుకు నిలిచింది అంటే.. అక్కడ ఉన్న ఓడరేవు, మత్స్యాకారుల సంప్రదాయాలు, స్థానిక సీఫుడ్ వెరైటీలు, పేరుగాంచిన కేరళ వంటకాలు.. ఇవన్నీ.. కొచ్చీని టాప్ లో ఉంచాయి.





