టొమాటో ఫేస్ ప్యాక్స్ తో మీరెంత అందంగా మారిపోతారో..!
మన శరీర ఆరోగ్యానికి టమాటాలు ఎంతగానో మేలు చేస్తాయి. అంతేకాదు ఇవి చర్మానికి కూడా ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. టమాటా ఫేస్ ప్యాక్ తో ఎన్నో చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Tomato Face Pack Benefit
క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి టమోటాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే టమాటాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మొటిమల మచ్చలు, ముడతలు వంటి చర్మ సమస్యలను తగ్గించడానికి టమాటా ఫేస్ ప్యాక్ లు బాగా ఉపయోగపడతాయి. చుండ్రును వదిలించుకోవడానికి, చర్మంపై జిడ్డును, తెరిచిన రంధ్రాలను తగ్గించడానికి టమోటాలు ఒక అద్భుతమైన నివారణ.
టమోటాలు తక్కువ మొత్తంలో ఆమ్ల పదార్ధాలను కలిగి ఉంటాయి. వీటిలో పొటాషియం, విటమిన్ సి లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది చర్మానికి మెరుపును ఇవ్వడానికి సహాయపడుతుంది. టమోటాలలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోతుల్లోంచి శుభ్రం చేస్తాయి. అందుకే టమాటా చర్మం పీహెచ్ స్థాయిని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందుకోసం టమాటాలను ఎలా ఉపయోగించాలంటే..
టమాటా రసం
చర్మంపై జిడ్డు తగ్గాలంటే టమోటాలను కట్ చేసి దీన్ని నుంచి రసాన్ని తీయండి. దీన్ని ముఖానికి, మెడకు అప్లై చేయండి. ఐదు నుంచి పది నిమిషాల పాటు అలాగే వదిలేయండి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోండి. వారానికి రెండు, మూడు సార్లు ఇలా చేయొచ్చు.
<p>face pack</p>
టమాటా, చక్కెర
టమోటాలు, చక్కెర చాలా మంది సులభంగా ఉపయోగించే స్క్రబ్. ఇందుకోసం టొమాటోను సగానికి కట్ చేసి దాన్ని పంచదారలో ముంచి ముఖానికి స్క్రబ్ చేయండి. ఇది ముఖాన్ని కాంతివంతం చేయడానికి, ముఖంపై పేరుకుపోయిన మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది.
టమాటా, పెరుగు, నిమ్మరసం
పెరుగు, నిమ్మరసం, టొమాటో పేస్ట్ ను కలిపి మాస్క్ గా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం 2 టేబుల్ స్పూన్ల టమోటా గుజ్జు లో 1 టేబుల్ స్పూన్ పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలిపి ప్యాక్ లా తయారుచేసుకోండి. ఆ తర్వాత ముఖానికి, మెడకు రాసుకోండి. ఈ ప్యాక్ ను వారానికి రెండు, మూడు సార్లు వేసుకోవాలి.