MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Bangalore Rent: 1BHKకి లక్షన్నర డిపాజిట్ అడిగిన ఓనర్.. బెంగళూరు టెకీ ఏం చేశాడంటే

Bangalore Rent: 1BHKకి లక్షన్నర డిపాజిట్ అడిగిన ఓనర్.. బెంగళూరు టెకీ ఏం చేశాడంటే

Bangalore Rent:  బెంగళూరులో అద్దె ఇల్లు దొరకడమే కష్టం. దొరికాక దానికి అద్దె కట్టలేక, డిపాజిట్లు చెల్లించలేక మరింత కష్టాలు పడాల్సి వస్తుంది. కేవలం సింగిల్ బెడ్ రూమ్ ఇదికి లక్షన్నర రూపాయల డిపాజిట్ అడగడంతో ఓ టెక్కీ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.

1 Min read
Author : Haritha Chappa
Published : Jul 03 2026, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బెంగళూరులో అద్దె ఇల్లు
Image Credit : Asianet News

బెంగళూరులో అద్దె ఇల్లు

బెంగళూరులో ఇల్లు వెతకడం ఎంత కష్టమో చెప్పే మరో ఘటన ఇది. ఈ నగరంలో అద్దెలు, సెక్యూరిటీ డిపాజిట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి తోడు ఇంటి ఓనర్ల కఠిన నిబంధనలు. దీంతో సరైన ఇల్లు దొరక్క ఐటీ ఉద్యోగులు నానా తంటాలు పడుతున్నారు. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన అనుభవాన్ని పంచుకున్నాడు. నగరంలో 1BHK ఇంటిని అద్దెకు తీసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే కంపెనీ ఆఫీసుకు రమ్మని పిలిచింది. దీంతో అద్దె కోసం వెతకగా ఆ సింగిల్ బెడ్ రూమ్ కు  ఏకంగా ₹1.5 లక్షల డిపాజిట్ అడిగాడట ఇంటి యజమాని. దీంతో షాక్ అయిన టెకీ  ఆఫీసుకు రావడం కంటే ఇంటి నుంచే పనిచేసే అవకాశం (WFH) ఇవ్వమని కంపెనీని కోరాడు. కంపెనీ అందుకు ఒప్పుకోలేదు. ఎలాగైనా బెంగళూరు ఆఫీసుకు రావాల్సిందేనని చెప్పింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
టెక్కీ ఏం చేశాడంటే
Image Credit : Gemini AI

టెక్కీ ఏం చేశాడంటే

ఉద్యోగి ఎన్నిసార్లు తన పరిస్థితి చెప్పినా అభ్యర్థించినా కంపెనీ అంగీకరించలేదు. 'WFH సాధ్యం కాదు, ఆఫీసులో చేరండి లేదా ఉద్యోగం మానేయండి' అని రెండు ముక్కల్లో తేల్చి చెప్పింది. దీంతో ఆ ఉద్యోగి చివరికి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అతను సోషల్ మీడియాలో తన అనుభవాన్ని రాశాడు.  ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేకాదు, కొంతమంది ఇంటి ఓనర్లు అద్దెకు ఉండేవారి లింక్డ్‌ఇన్ ప్రొఫైల్స్ చెక్ చేయడం, ఉద్యోగ వివరాలు అడగడం, భారీ సెక్యూరిటీ డిపాజిట్లు డిమాండ్ చేయడం ఇప్పుడు సాధారణమైపోయిందని కూడా ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

33
సోషల్ మీడియాలో వైరల్
Image Credit : our own

సోషల్ మీడియాలో వైరల్

ఈ సంఘటన వైరల్ అయిన తర్వాత, చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. 'బెంగళూరులో ఉద్యోగం సంపాదించడం కంటే ఇల్లు సంపాదించడమే కష్టం' అని కొందరు కామెంట్ చేస్తే, మరికొందరు నగరంలో అద్దె నియంత్రణ చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కథనంలోని సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్ ఆధారంగా రాసింది. ఇందులోని వివరాలను స్వతంత్రంగా ధృవీకరించలేదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి.? ఓసారి రైలు ప్రయాణాన్ని గుర్తు చేసుకోండి చాలు
Recommended image2
Frogs: ఈ దేశంలో పాలల్లో బతికి ఉన్న కప్పలు వేస్తారు.. ఎందుకో తెలుసా?
Recommended image3
Salary: ఆఫ్రికాలో స్కూల్ టీచర్ల జీతం ఎంత ఉంటుంది? ఫీజులు ఎంత వసూలు చేస్తారో తెలుసా?
Related Stories
Recommended image1
Last Indian Railway Station: మనదేశ చిట్టచివరి రైల్వే స్టేషన్ ఇదే.. ఇక్కడ నుంచి వేరే దేశం మొదలవుతుంది
Recommended image2
First Petrol Bunk: మన దేశంలో మొట్టమొదటి పెట్రోల్ బంక్ ఇదే.. అప్పట్లో పెట్రోల్‌ను వాహనాల్లో ఎలా నింపేవారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved