MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Beauty Tips: ఆయిలీ స్కిన్ తో మేకప్ నిలవడం లేదా.. ఈ టిప్స్ తో ఆ సమస్యకు చెక్ పెట్టండి!

Beauty Tips: ఆయిలీ స్కిన్ తో మేకప్ నిలవడం లేదా.. ఈ టిప్స్ తో ఆ సమస్యకు చెక్ పెట్టండి!

Beauty Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. హడావుడి అంతా ఆడవాళ్ళదే. ఉన్న అందాన్ని రెట్టింపు చేయడం కోసం మరింత మేకప్ వేసుకుంటారు. అయితే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి మేకప్ చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ సమస్యకి ఎలా చెక్ పెట్టాలో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Navya G
Published : Sep 04 2023, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 నిజానికి జిడ్డు చర్మం ఉన్నవారికి మేకప్ ఎక్కువసేపు ఉండేలా చేయడం చాలా కష్టమైన పని. జిడ్డు చర్మం పై మేకప్ వేసినప్పుడు అది అలాగే ఉండటానికి నిరాకరిస్తుంది. మేకప్ వేయడం వల్ల మరింత జిడ్డు ఉత్పన్నమై మేకప్ అసహ్యంగా కనిపించే లాగా చేస్తుంది. కాబట్టి అలాంటి సమస్యలకు చెక్ పెట్టడం కోసం మేకప్ వేసుకునేటప్పుడు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి.

26

 ఆపై ముఖం మీద ఉండే రంధ్రాలు మూసుకుపోకుండా తేలికైన నూనె లేని మాయిశ్చరైజర్ ఫేస్ కి అప్లై చేయండి. ఆ తరువాత మ్యాట్ ఫినిషింగ్  ప్రైమర్ తప్పనిసరిగా ఉపయోగించండి. ఇది చర్మం మీద ఉండే నూనెను గ్రహించి, మేకప్ ఎక్కువ సేపు ఉండేలాగా సహాయపడుతుంది.
 

36

ఆ తర్వాత ఫౌండేషన్ విషయానికి వస్తే జిడ్డు చర్మం కలవారు తప్పనిసరిగా ఆయిల్ ఫ్రీ, అలాగే సాలిసిలిక్ యాసిడ్ వంటి పదార్థాలను కలిగి ఉండే ఫౌండేషన్ మాత్రమే ఉపయోగించాలి. అలాగే జిడ్డు చర్మం తీవ్రతరం కాకుండా ఉండటానికి ఆయిల్ ఫ్రీ..

46

అలాగే నాన్ కామెడోజనిక్ అనే లేబుల్ చేయబడిన ప్రత్యేకమైన ఉత్పత్తులను మాత్రమే ఎంచుకోండి. ఇవి మేకప్ ని బ్రేకప్ కాకుండా చూస్తుంది. అలాగే ఆయిలీ స్కిల్ ఉన్నవారు కచ్చితంగా వారి హ్యాండ్ బ్యాగ్ లో బ్లాటింగ్ పేపర్స్ ని పెట్టుకోండి. మేకప్ వేసిన తర్వాత అదనపు నూనెను గ్రహించడంలో ఇవి మీకు సహాయపడతాయి.

56

అలాగే పౌడర్ తో మీ మేకప్ ని అమర్చుకోవటం జిడ్డు చర్మం కోసం అత్యంత అవసరమైన చిట్కా. కాబట్టి మీ స్కిన్ టోన్ కి సరిపోయే పౌడర్ ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని పెద్ద మెత్తని బ్రష్ తో ఫేస్ పై అప్లై చేయండి.
 

66

 అలాగే పడుకునే ముందు కచ్చితంగా మేకప్ ని రిమూవ్ చేయడం మర్చిపోవద్దు. లేదంటే ముఖంపై రంద్రాలు మూసుకుపోతాయి. ఇంకెందుకు ఆలస్యం ఆయిల్ స్కిన్  వారు కూడా అదిరిపోయే మేకప్ తో ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఫంక్షన్స్ కి వెళ్ళవచ్చు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved