MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • బ్రెస్ట్ సైజ్ పెరగాలంటే ఇలా చేయండి..

బ్రెస్ట్ సైజ్ పెరగాలంటే ఇలా చేయండి..

రొమ్ముల పరిమాణం కొంతమందికి చిన్నగా ఉంటే.. మరికొంతమందికి పెద్దగా ఉంటాయి. అయితే బ్రెస్ట్ చిన్నగా ఉందని బాధపడేవారు కూడా చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారికోసం కొన్ని చిట్కాలు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 01 2022, 11:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

36-24-36 లాంటి బాడీ షేప్ ఉండాలని చాలా మంది ఆడవారు ఆశపడుతుంటారు. ఈ 36-24-36 అంటే బ్రెస్ట్, నడుము, తుంటి చుట్టు కొలతలని అర్థం. ఈ కొలతలు పర్ఫెక్ట్ బాడీ షేప్ ను సూచిస్తాయి. అయితే అందరూ ఒకేలా ఉండరు. సాధారణంగా చాలా మంది అమ్మాయిలకు లేదా మహిళలు మంచి షేప్ లో ఉండే శరీరాన్ని పొందడానికి ఏం చేయాలో తెలియదు. ఇక అందులో కొంతమందికి బ్రెస్ట్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. ఆలాంటి వారిలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. అలా అని కొంతమందైతే బ్రెస్ట్ సైజ్ పెరగడానికి  శస్త్రచికిత్స కూడా చేయించుకుంటారు. కానీ వీటివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నిజానికి మంచి రొమ్ము సైజు పొందడానికి మీరు పెద్దగా కష్టపడిపోవక్కర్లేదు. పెద్దగా ఖర్చు కూడా పెట్టక్కర్లేదు. నేచురల్ గా రొమ్ముల సైజును ఎలా పెంచుకోవచ్చు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మసాజ్ చేయడం 

మీ రొమ్ము సైజు చిన్నగా ఉందనుకుంటే రోజూ కాసేపు మసాజ్ చేయండి. ఇందుకోసం ప్రతిరోజూ స్నానం చేయడానికి ముందు ఏదైనా మంచి నూనెతో మీ రొమ్ములను మసాజ్ చేయండి. దీంతో కొన్ని రోజుల్లోనే మీ బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది. 
 

35

మెంతులు

మెంతులు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇవి జుట్టు, చర్మానికి మంచి మేలు చేస్తాయి. వీటితో అధిక బరువుకు కూడా చెక్ పెట్టొచ్చు. అంతేకాదు మెంతులు రొమ్ముల పరిమాణాన్ని కూడా పెంచుతాయి. ఈ గింజల్లో మెస్టోజెనిక్ మూలకం ఉంటుంది. ఇది రొమ్ము ఎదుగుదలకు సహాయపడుతుంది. రొమ్ము పరిమాణాన్ని పెంచడానికి మెస్టోజెనిక్ మూలకాన్ని ఎన్నో రకాల క్రీములల్లో కూడా ఉపయోగిస్తారు.  కానీ సహజంగా ఇది మెంతుల్లో కూడా ఉంటుంది. అందుకే రొమ్ముల సైజు పెంచాలనుకున్న వాళ్లు రోజూ మెంతులను తినాలి. అయితే మెంతులను నానబెట్టి పేస్ట్ చేసి రొమ్ముపై అప్లై చేయడం వల్ల కూడా రొమ్ము పరిమాణం పెరుగుతుంది.

45

వ్యాయామం, యోగా 

వ్యాయామం, యోగా లు మన శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి. అంతేకాదు ఇవి రొమ్ముల పరిమాణం పెరిగేందుకు కూడా ఉపయోగపడతాయి. బ్రెస్ట్ సైజ్ ను పెంచేందుకు ఉస్త్రాసనం సహాయపడుతుంది. ప్రతిరోజూ ఈ వ్యాయామం చేయడం ద్వారా మీ రొమ్ము పరిమాణం పెద్దగా అవుతుంది. ఎందుకంటే ఈ ఆసనంలో మీ శరీరాన్ని సాగదీయడం వల్ల రొమ్ము పరిమాణం పెరుగుతుంది.
 

55

బ్రెస్ట్ సైజును పెంచడానికి ఈస్ట్రోజెన్ హార్మోన్ కూడా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీ రోజు వారి ఆహారంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని పెంచే ఆహారాలను ఎక్కువగా తినండి. ఇందుకోసం ఉల్లిపాయ, బ్రోకలీ, టమాటాలు, ద్రాక్ష, ఆపిల్, గింజలను ఎక్కువగా తినండి. ఇవి  మీ బ్రెస్ట్ సైజ్ ను తొందరగా పెంచుతాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Psychology: శత్రువు కి దగ్గరైనా ఉండొచ్చు.. కానీ,‘ Crab mentality’ ఉన్నవారికి మాత్రం దూరంగా ఉండాలి.. !
Recommended image2
Hibiscus Shampoo: మందారం షాంపూ తయారుచేసుకుని వాడితే జుట్టు రాలడం ఆగిపోతుంది
Recommended image3
Eggs: కోడి గుడ్లను ఫ్రిజ్ లో పెడుతున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved