MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మధ్య రాత్రి మళ్లీ మళ్లీ మెలుకువ వస్తోందా? హాయిగా నిద్రపోవాలంటే ఇలా చేయండి..

మధ్య రాత్రి మళ్లీ మళ్లీ మెలుకువ వస్తోందా? హాయిగా నిద్రపోవాలంటే ఇలా చేయండి..

ప్రతి ఒక్కరూ రాత్రిపూట ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవాల్సిందే. ఇంతకు మించి తక్కువ గంటలు నిద్రపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 14 2022, 04:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పగలు పనిచేసి అలసి సొలసిన శరీరానికి రాత్రిళ్లు విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. నిద్రతోనే శరీరం తిరిగి శక్తిని పుంజుకుంటుంది. శరీర భాగాలను రిపేర్ చేసుకుంటుంది. కానీ కొంతమంది పొద్దంతా ఎంతో పనిచేస్తారు. కానీ రాత్రిళ్లు మాత్రం అస్సలు నిద్రపోరు. ఒకవేళ నిద్రపోయినా.. మధ్య మధ్యలో తరచుగా మేల్కొంటుంటారు. దీనివల్ల తెల్లవార్లూ నిద్రుండదు పాడుండదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆరోగ్యంగా ఉండే వయోజనులు ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అసలు రాత్రిళ్లు నిద్రలో మళ్లీ మళ్లీ లేవకుండా హాయిగా పడుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

25

రాత్రిపూట పిండి పదార్థాలను తినొద్దు

రాత్రిపూట కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి రాత్రిళ్లు నిద్రలేకుండా చేస్తాయి.  బంగాళాదుంపలు, చిప్స్, పాస్తా, అన్నం, అరటిపండ్లు వంటి వాటిలో కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కార్భోహైడ్రేట్లు మీ నిద్రకు బంఘం కలిగిస్తాయి. వీటిని తింటే రాత్రిళ్లు మళ్లీ మళ్లీ మెలుకువ వస్తుంది. అందుకే రాత్రిళ్లు వీటిని తినకండి. 
 

35
coffee

coffee

టీ, కాఫీ లను తాగకూడదు
 
ఇండియాలో టీ, కాఫీ ప్రియులకు కొదవే లేదు. కానీ వీటిని ఎప్పుడు పడితే అప్పుడు అసలే తాగకూడదు. ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత. ఒక వేళ తాగితే మీరు ఏం చేసినా రాత్రిళ్లు రాదు. తెల్లవార్లూ జాగారం చేయాల్సిందే. ఎందుకంటే వీటిలో పుష్కలంగా ఉండే కెఫిన్ మనల్ని రీఫ్రెష్ చేసి నిద్రమత్తును వదిలిస్తుంది. అందుకే నిద్రపోవడానికి 2 నుంచి 3 గంటల మందు టీ, కాఫీలను అసలే తాగకండి. 

45

ఎక్కువ టెన్షన్ పడకండి

ప్రస్తుతం చాలా మంది ఒత్తిడితో కూడిన లైఫ్ నే లీడ్ చేస్తున్నారు. ఒత్తిడి సర్వ సాధారణం అయినప్పటికీ.. అవసరమైన దానికంటే మరీ ఎక్కువగా ఒత్తిడికి గురైతే మీ ఆరోగ్యం ఎన్నో విధాలుగా ప్రభావితమవుతుంది. ముఖ్యంగా ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని చాలా దెబ్బతిస్తుంది. ఇది నిద్రలేమికి దారితీస్తుంది.  
 

55
sleeping

sleeping

హాయిగా పడుకోవాంటే.. 

రాత్రిళ్లు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా హాయిగా పడుకోవడానికి ప్రతిరోజూ అర్థగంట అయినా వ్యాయామం చేయండి. పొద్దున్న సూర్యరశ్మిలో కాసేపు నిలబడండి. అలాగే మెగ్నీషియం ఎక్కువగా ఉండే.. బాదం, అవొకాడో, ఆకుకూరలు, గుమ్మడి గింజలను ఎక్కువగా తినండి. రాత్రిపూట మరీ హెవీగా తినకండి. ఎలాంటి  ఆలోచనలు చేయకండి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Hormonal Imbalance in Men: టెస్టోస్టెరాన్ తగ్గుతోందా? బాడీ ఇచ్చే ఈ 5 సిగ్నల్స్ గుర్తించండి
Recommended image2
Leftover Soap Uses: మిగిలిపోయిన సబ్బు ముక్కలతో ఇలా కూడా చేయొచ్చు..యూజ్‌ఫుల్ టిప్స్ ఇవిగో
Recommended image3
Paneer: మీకు పనీర్ అంటే పిచ్చా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved