Blackheads: బ్లాక్ హెడ్స్ తో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..
Blackheads: బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ముక్కుమీదే కనిపిస్తాయి. ఈ బ్లాక్ హెడ్స్ ముక్కుమీదుంటే రంధ్రాల్లో మురికి పేరుకుపోయినప్పుడు ఏర్పడతాయి. అయితే వీటిని సింపుల్ టిప్స్ తో వదిలించుకోవచ్చు. అవేంటంటే

కలబంద (Aloe vera)
కలబందలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. చర్మ సంరక్షణగా కూగా ఉపయోగపడుతుంది. ఇది ముఖంపై పేరుకుపోయిన మురికిని వదిలిస్తుంది. రెగ్యులర్ గా కలబందను ఉపయోగించడం వల్ల బ్లాక్ హెడ్స్ వదిలిపోతాయి. అలాగే ముఖంపై ఉండే మొటిమలు, కళ్ల చుట్టూ ఉండే బ్లాక్ సర్కిల్స్ కూడా మటుమాయం అవుతాయి. బ్లాక్ హెడ్స్ ఉన్న వాళ్లు కలబంద గుజ్జును 15 నిమిషాల పాటు బ్లాక్ హెడ్స్ పై అప్లై చేయాలి. ఆ తర్వాత నీట్ గా కడిగేయాలి.
గుడ్డులోని తెల్లసొన
బ్లాక్ హెడ్స్ ను వదిలించడంలో గుడ్డులోని తెల్లసొన ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం రెగ్యులర్ గా బ్లాక్ హెడ్స్ పైన గుడ్డులోని తెల్లసొనను అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేయాలి. ఈ పద్దతిని రెండు వారాల పాటు ఫాలో అయితే బ్లాక్ హెడ్స్ మటుమాయం అవుతాయి.
నిమ్మరసం
నిమ్మరసం కూడా బ్లాక్ హెడ్స్ ను వదిలిస్తుంది. ఇందుకోసం టేబుల్ స్పూన్ నిమ్మరసంలో టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ ను కలిపి.. బ్లాక్ హెడ్స్ పైన అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడగండి. ఈ రెండింటిలో ఉండే సహజ బ్లీచ్ గుణాలు బ్యాక్టీరియాను తొలగిస్తాయి.
ఐస్ క్యూబ్స్ (Ice cubes)
ఐస్ క్యూబ్స్ కూడా బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు బ్లాక్ హెడ్స్ పై ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేయండి. కొన్ని వారాల్లోనే ఇవి పూర్తిగా తొలగిపోతాయి.
రోజ్ వాటర్
రోజ్ వాటర్ కూడా బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది. ఇందుకోసం కొద్దిగా రోజ్ వాటర్ తీసుకుని అందులో దోసకాయ రసం మిక్స్ చేయాలి. దీన్ని బ్లాక్ హెడ్స్ పైన అప్లై చేయండి. కొద్దిసేపు మసాజ్ చేసి.. అది పూర్తిగా ఎండిపోయిన తర్వాత కాటన్ క్లాత్ తో తుడవండి. ఈ పద్దతిని రెగ్యులర్ గా ఫాలో అయితే కొద్ది రోజుల్లోనే బ్లాక్ హెడ్స్ మటుమాయం అవుతాయి.