అందమైన గోర్ల కోసం సింపుల్ చిట్కాలు..
గోర్లు కేవలం అందానికే కాదు.. రక్షణగా కూడా ఉంటాయి. అందుకే వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో మీ గోర్లను మరింత అందంగా, ఆకర్షణీయం మార్చవచ్చు.

చర్మాన్ని సంరక్షించుకున్నట్టే మన గోళ్లను కూడా సంరక్షించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి మనకు రక్షణగా ఉంటాయి. అయితే కొంతమంది గోర్లు చాలా త్వరగా విరిగిపోతుంటాయి. పోషకాల లోపం వల్ల కూడా గోర్లు విరిగిపోతుంటాయి. గోళ్లను ఆరోగ్యంగా, అందంగా ఉంచడగానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉంటాయి. దీనిని గోర్లకు అప్లై చేయడం వల్ల విరిగిపోయిన, పగిలిన, దెబ్బతిన్న గోర్లు నయమవుతాయి. కొబ్బరి నూనెతో వారానికి రెండు నుంచి మూడు రోజులు మీ గోళ్లను మసాజ్ చేయడం వల్ల గోర్లు అందంగా మెరిసిపోతాయి. ఆరోగ్యంగా కూడా ఉంటాయి.
ఆలివ్ నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది తేమగా, సులువుగా శోషించుకుంటుంది కూడా. దీనిని గోర్లకు అప్లై చేయడం వల్ల గోళ్లు ఫాస్ట్ గా పెరుగుతాయి. ఆలివ్ ఆయిల్ తో మీ గోళ్లను మసాజ్ చేయడం వల్ల మీ గోర్ల ఆరోగ్యం బాగుంటుంది.
అరటి పండు కూడా గోర్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందుకోసం అరటిపండును మిక్సీలో వేసి పేస్ట్ లా తయారుచేయండి. దీన్ని మీ చేతులకు, గోర్లకు అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా అప్పుడప్పుడు చేయడం వల్ల చేతులు పొడిబారడం తగ్గిపోతుంది. దీంతో మీ గోళ్లు అందంగా మారుతాయి.
నిమ్మరసం కూడా గోర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మరసం గోళ్లను ప్రకాశవంతంగా చేయడమే కాదు మరకలను కూడా తొలగించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం మీ గోళ్లకు నిమ్మరసం అప్లై చేసి, అరగంట తర్వాత రోజ్ వాటర్ లో ముంచిన కాటన్ తో తుడవండి. ఇది మీ గోర్లు అందంగా మెరిసేలా చేస్తుంది.
గోర్లు అందంగా పెరిగేందుకు కలబంద కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం రోజ్ వాటర్, కలబంద జెల్ ను మిక్స్ చేసి గోర్లపై అప్లై చేయండి. ఆ తర్వాత 10 నిమిషాల పాటు మసాజ్ చేసి కడిగేయండి. ఇలా చేయడం వల్ల మీ గోర్లు బలంగా తయారవుతాయి.
బాదం నూనె కూడా గోర్ల ఆరోగ్యానికి చాలా మంచిది. గోర్లకు బాదం నూనెను అప్లై చేయడం వల్ల గోర్లు బలంగా అవుతాయి. ఆరోగ్యంగా కూడా పెరుగుతాయి. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు గోర్లకు బాదం నూనె అప్లై చేయండి. ఉదయం లేచేసరికి గోర్లు అందంగా తయారవుతాయి.
వీటితో పాటుగా.. ప్రోటీన్ ఫుడ్ కూడా మీ గోర్లను అందంగా ఉంచుతుంది. శరీరంలో ప్రోటీన్ లోపిస్తేనే మీ శరీరంతో పాటుగా గోర్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. గోర్లు ఊరికే విరిగిపోవడం, రంగు పాలిపోవడం, పెరగకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే బాదం, వాల్ నట్స్, చేపలు, బీన్స్ వంటి ఎక్కువగా తింటూ ఉండాలి. ఎందుకంటే వీటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.