Thyroid Weight Loss: థైరాయిడ్ పేషెంట్లు ఇలా చేస్తే తొందరగా బరువు తగ్గుతారు..
Thyroid Weight Loss: థైరాయిడ్ కారణంగా చాలా మంది విపరీతంగా బరువు పెరిగిపోతుంటారు. అయితే వీరు బరువు తగ్గాలనుకుంటే ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ సమస్య బారిన పడుతున్నారు. ఈ సమస్య కారణంగా కొంతమంది బరువు తగ్గితే.. మరికొంతమంది మాత్రం విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు. ఈ థైరాయిడ్ సమస్య వల్ల రోగి శరీరంలో థైరాయిడ్ హార్బోన్ల స్థాయిలు బాగా తగ్గిపోతాయి. దీంతో వీరి శరీరంలో కొవ్వు విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో వీరి బరువు దారుణంగా పెరుగుతుంది. అయితే బరువు బరువు తగ్గే ప్రాసెస్ లో కొన్ని మిస్టేక్ లను చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాదు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. మరి థైరాయిడ్ పేషెంట్లు బరువు తగ్గేందుకు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
థైరాయిడ్ పేషెంట్లు బరువు తగ్గేటప్పుడు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. తెల్ల పిండి, వైట్ బ్రెడ్, కేకులు మొదలైన వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. అందుకే వీటిని తినడం మానేయాలి. ఎందుకంటే ఇవి మీ బరువును మరింత పెంచుతాయి.
బరువు తగ్గాలని చాలా మంది ఆహార పదార్థాలను పూర్తిగా తగ్గిస్తారు. ఇలా చేయడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభించవు. దీంతో మీ శరీరం బలహీనంగా మారుతుంది. బరువు తగ్గడం కూడా కష్టమవుతుంది. అందుకే మీరు శరీరానికి పోషకాలనందించే ప్రోటీన్ ఫుడ్ ను, పీచు పదార్థాలను ఎక్కువగా తినండి. ఇవి లేకపోతే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది.
థైరాయిడ్ పేషెంట్లు బరువు తగ్గాలనుకున్నప్పుడు గోయిట్రోజెన్ పుష్కలంగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇది మీరు అయోడిన్ వాడకాన్ని పరిమితం చేస్తుంది.
థైరాయిడ్ పేషెంట్లు ఎప్పుటికప్పుడూ నీళ్లను పుష్కలంగా తాగుతూ ఉండాలి. వీరి శరీరంలో నీరు లోపిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు తగినన్ని నీళ్లను తాగడంతో పాటుగా హెల్తీ ద్రవ పానీయాలను తీసుకుంటూ ఉండాలి. నీరు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆకలిని కూడా నియంత్రణలో ఉంచుతుంది. నీళ్లు శరీరానికి హాని చేసే ట్యాక్సిన్స్ తొలగిపోతాయి.
బరువు తగ్గే థైరాయిడ్ పేషెంట్లు ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
fiber
ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ట్యాక్సిన్స్ ను కూడా తొలగించడానికి సహాయపడుతుంది. పైబర్ కంటెంట్ ఎక్కువ సేపు కడుపును నిండుగా ఉంచుతుంది. ఇది తొందరగా బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. ఇందుకో ఫైబర్ ఎక్కువగా ఉండే జామకాయ, అవొకాడో, ఓట్స్, బెర్రీలు, ఆపిల్, నట్స్ వంటి వాటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చండి.