Thyroid Diet: థైరాయిడ్ పేషెంట్లు తప్పక తినాల్సిన సూపర్ ఫుడ్స్ ..!
Thyroid Diet: థైరాయిడ్ నియంత్రణలో ఉండాలంటే వీరు కొన్ని రకాల ఆహారాలను తప్పక తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

థైరాయిడ్ అసమతుల్యత బరువు తగ్గడానికి లేదా బరువు పెరగడానికి దారితీస్తుంది. మన రోజువారీ కార్యకలాపాల్లో ఆకస్మిక మార్పులు థైరాయిడ్ కు దారితీస్తాయి. ఈ రోజుల్లో థైరాయిడ్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు దారుణనంగా పెరిగిపోతోంది. కాగా థైరాయిడ్ (Thyroid) మన శరీరంలోని అతి ముఖ్యమైన గ్రంథులలో ఒకటి. ఇది జీవక్రియ (Metabolism)ప్రక్రియలు సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.
ఇది మొత్తం ఆరోగ్యాన్ని నియంత్రిస్తుంది. కాబట్టి దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. బిజీ లైఫ్ స్టైల్ కూడా థైరాయిడ్ హార్మోన్ లో అసమతుల్యతకు కారణమవుతుంది. దీనికి మెడిసిన్స్ వాడే వారు కూడా పోషకాహారం తీసుకోవడంతో పాటుగా ఆరోగ్యకరమైన (Healthy)జీవనశైలి (Lifestyle) ని Maintain చేయడం చాలా ముఖ్యం.
థైరాయిడ్ ను నియంత్రించడంలో కొన్ని రకాల ఆహారాలు ఎంతో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.
ఉసిరి.. ఉసిరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇది థైరాయిడ్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. నారింజ (Orange) కంటే ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
కొబ్బరి.. థైరాయిడ్ రోగులు కొబ్బరిని అలాగే తిన్నా లేదా నూనె రూపంలో తీసుకున్నా ఎంతో మంచి జరుగుతుంది. ఇది కొవ్వు ఆమ్లాలు (MCFA), మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCT) తో సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి దీని క్రమం తప్పకుండా తీసుకోవడం జీవక్రియ మెరుగుపడుతుంది.
గుమ్మడి గింజలు (Pumpkin seeds).. గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలో ఉండే ఇతర విటమిన్లు, ఖనిజాల శోషణకు కూడా సహాయపడతాయి. జింక్ శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణకు సహాయపడుతుంది.
గుడ్లు.. గుడ్లు అయోడిన్ యొక్క గొప్ప మూలం. ఇది ప్రధాన థైరాయిడ్ హార్మోన్ థైరాక్సిన్ ను తయారు చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉండే గుడ్లు కూడా బరువును తగ్గించడానికి సహాయపడతాయి.
చియా విత్తనాలు.. చియా విత్తనాలు థైరాయిడ్ ఆరోగ్యకరమైన పనితీరుకు సహాయపడే అన్ని ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. దీనిలో ఉండే ఒమేగా -3 కొవ్వులు శరీరంలో మంటను నివారించడంలో సహాయపడతాయి.
గింజలు (Nuts).. థైరాయిడ్ రోగులకు గింజలు ఉత్తమ ఆహారాలలో ఒకటి. వీటిలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంధిలో యాంటీ ఆక్సిడెంట్ నిరోధకతను కలిగిస్తుంది.