MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Ginger Tea: ప్రతి ఉదయం ఖాళీపొట్టతో అల్లం టీ తాగితే జరిగేది ఇదే

Ginger Tea: ప్రతి ఉదయం ఖాళీపొట్టతో అల్లం టీ తాగితే జరిగేది ఇదే

అల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అల్లంలో యాంటీఆక్సిడెంట్ గుణాలు అధికం. ఇందులో ఉండే జింజెరాల్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనితో తయారుచేసే  అల్లం టీ పరగడుపున ఖాళీపొట్టతో తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Dec 05 2025, 05:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అల్లం టీతో ఉపయోగాలు
Image Credit : Asianet News

అల్లం టీతో ఉపయోగాలు

చలికాలంలో చాలా మంది అల్లం టీని తాగేందుకు ఇష్టపడతారు. ఇది శరీరంలో సహజంగా వేడి పెంచుతుంది. అల్లంలో ఉండే 'జింజరోల్' అనే సహజ రసాయనం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరం చల్లగా అనిపించినప్పుడు అల్లం టీ తాగితే వెంటనే వేడి ఏర్పడి అసౌకర్యం తగ్గుతుంది. అందుకే జలుబు, దగ్గు వచ్చినప్పుడు కూడా అల్లం టీ ఎక్కువగా సిఫారసు చేస్తారు. అయితే ఖాళీ పొట్టతో అల్లం టీ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జీర్ణక్రియ
Image Credit : stockphoto

జీర్ణక్రియ

అల్లంటీ ఖాళీ పొట్టతో తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి వల్ల కలిగే కడుపునొప్పి, వికారం, వాంతులు, గ్యాస్, మలబద్ధకం వంటివి రాకుండా ఇది అడ్డుకుంటుంది. ఉదయాన్నే పరగడుపున అల్లం టీ తాగితే ఈ సమస్యలేవీ రావు. నాలుగు రోజులు తాగితే చాలు మీకు దీని ప్రభావం తెలుస్తుంది.

35
రోగనిరోధక శక్తి
Image Credit : Freepik

రోగనిరోధక శక్తి

చలికాలంలో చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. వాటిని ఎదుర్కొవడానికి శరీరానికి రోగ నిరోధక శక్తి అవసరం. అల్లం లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి ఇమ్యూనిటీని బలపరుస్తాయి. వాతావరణంలో మార్పులు వచ్చిన ప్రతిసారి జలుబు పట్టే వారిలో అల్లం టీ చాలా ఉపయోగకరం.

45
వాంతులు తగ్గుతాయి
Image Credit : Freepik

వాంతులు తగ్గుతాయి

 ప్రయాణాల సమయంలో కొందరికి ఉబ్బసం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అల్లం టీ తాగడం ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం కడుపును ప్రశాంతంగా ఉంచి, వాంతులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. ప్రత్యేకంగా మహిళల్లో వాంతులు తగ్గేందుకు కూడా అల్లం సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు.  ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

55
పొట్ట కొవ్వును కరిగించడానికి
Image Credit : Freepik

పొట్ట కొవ్వును కరిగించడానికి

అల్లం టీ తాగడం జీవక్రియను పెంచుతుంది. కేలరీలను బర్న్ చేస్తుంది, పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.  ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని అల్లం టీ తాగితే బరువు తగ్గడంలో కొంత సహాయం అవుతుంది. పైగా ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం వల్ల పొట్ట బిగువుగా అనిపించే సమస్యలు తగ్గుతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి కూడా అల్లం టీ తాగడం మంచిది. రక్తపోటును తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడానికి అల్లం టీ తాగడం మంచిది. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kova Sweet: పాలు కాచే పనిలేకుండా మిల్క్ పౌడర్‌తో ఈజీగా కోవాలు చేసేయండిలా
Recommended image2
Diamond Ring: అమ్మాయిల మనసు దోచే లైట్ వెయిట్ డైమండ్ రింగ్స్
Recommended image3
ఈ పండు గుజ్జుతో ఫేస్ ప్యాక్ రోజూ వేశారంటే వారంలో ముఖానికి మెరుపు ఖాయం
Related Stories
Recommended image1
2026లో మేషరాశి వారికి ఎలా ఉంటుంది?
Recommended image2
చామంతులు గుత్తులుగుత్తులగా పూయాలంటే ఈ చిన్న పని చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved