చామంతులు చలికాలంలోనే పూస్తాయి. ఇవి మంచి రంగుతో పెద్దగా పూలు పూయాలంటే రోజులో కనీసం అయిదు గంటలు ఎండ తగిలేలా జాగ్రత్తలు తీసుకోండి.
చామంతి మొక్కను పెంచేందుకు 40 శాతం మట్టి , 30 శాతం కోకోపీట్, 30 శాతం పశువుల పేడను కలపండి. ఇలాంటి మట్టిలో చామంతి మొక్కల ఆరోగ్యంగా ఎదిగి గుత్తులుగా పూలు పూస్తుంది.
ద్రవ రూప ఎరువులను వాడవచ్చు. పశువుల ఎరువు ద్రావణం, ఫిష్ అమినో లేదా టీ పొడి ద్రావణం వంటి రెండు వారాలకు ఒకసారి వేస్తే మంచిది. దీనివల్ల పూలు రెట్టింపు వేగంతో వికసిస్తాయి.
చామంతి మొక్క అయిదు నుంచి ఆరు అంగుళాలు పెరిగాక పైభాగంలో కొత్త చిగుర్లను తెంచి పడేయండి. దీనివల్ల పక్క కొమ్మలు పెరిగి ఒకే మొక్కకు డజన్ల కొద్దీ పూలు పూస్తాయి.
చామంతికి పురుగులు పట్టడం సాధారణం. 1 లీటరు నీటిలో 5ml వేప నూనె కలిపి వారానికి ఒకసారి స్ప్రే చేస్తే, పూలు తాజాగా, ఆకులు పచ్చగా ఉంటాయి.
పూసిన పువ్వుల్లో కొన్ని వాడిపోతాయి. వాటిని వెంటనే తుంచి పడేయాలి. అప్పుడు మిగతా పువ్వులకు శక్తివస్తుంది.
చామంతులను ముందుగానే వానాకాలం చివర్లో లేదా చలికాలంలో ప్రారంభంలో నాటితే ఈ పాటికి గుత్తుగుత్తులుగా పూలు పూస్తాయి.
మొక్క గుబురుగా పెరిగితేనే పువ్వులు ఎక్కువ పూస్తాయి. ఇందుకోసం ఎప్పటికప్పుడు చివరలను కత్తిరిస్తూ ఉండాలి. అప్పుడే కొత్త కొమ్మలు పుట్టుకొచ్చి పువ్వులు అధికంగా పూస్తాయి.