Cancer: తల్లికి ఉన్న ఈ అలవాటు బిడ్డకు క్యాన్సర్ వచ్చేలా చేస్తుంది, జాగ్రత్త
క్యాన్సర్ (Cancer) కేసుల విపరీతంగా పెరిగిపోతున్న కాలం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. గైనకాలజిస్ట్ చెబుతున్న ప్రకారం తల్లి చేసే చిన్న తప్పు పిల్లలు క్యాన్సర్ బారిన పడేలా చేస్తుంది.

క్యాన్సర్ కు కారణాలు
క్యాన్సర్ ఒక తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధి. దాని పేరు వింటేనే వణుకు పుడుతుంది. క్యాన్సర్ రావడానికి జన్యుపరమైనవే కాదు, ఆహారపరమైన అలవాట్లు కూడా కారణం అవుతాయి. అయితే కొంతమంది తల్లులు చేసే చిన్న తప్పులు కూడా పిల్లల్లో క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి కారణం కావచ్చు అని గైనకాలజిస్టులు వివరిస్తున్నారు.
ఇలా ఫోన్ పెడితే
తల్లిదండ్రులు ఎక్కువగా ఇప్పుడు ఫోన్ వాడుతున్నారు. చిన్న పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు వారి పక్కనే పడుకుని దగ్గరగా ఫోన్ పెట్టి తాము వీడియోలు చూసుకుంటున్నారు. ఇలా పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు, నిద్రపుచ్చేటప్పుడు తల్లులు తరచుగా ఫోన్ వినియోగిస్తూ ఉంటారు. అయితే ఫోన్ నుండి వెలుపడే వేడి రేడియేషన్ చిన్నపిల్లలకు చాలా ప్రమాదకరం.
రేడియేషన్ వల్ల
చంటి పిల్లలకు దగ్గరగా ఫోన్లు ఉన్నప్పుడు దాని నుండి వచ్చే రేడియేషన్ పిల్లల అభివృద్ధి పై ప్రభావం చూపిస్తుంది. వారి చర్మం, ఎముకలు, కండరాలపై ఆ ప్రభావం పడుతుంది. ఎందుకంటే పిల్లల అవయవాలు, చర్మం, ఎముకలు వంటివి పెద్దలతో పోలిస్తే మృదువుగా ఉంటాయి. దీనివల్ల ఎక్కువ స్థాయి రేడియేషన్ కి అవి త్వరగా గురవుతాయి.
ఈ వయసు పిల్లలతో జాగ్రత్త
రెండేళ్లలోపు పిల్లల దగ్గర ఫోను ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకుంటే పిల్లల మెదడు, శారీరిక అభివృద్ధి తగ్గే అవకాశం ఉంటుంది. మొదటి రెండు సంవత్సరాల్లోనే పిల్లలు మానసికంగా, శారీరకంగా త్వరగా ఎదుగుతారు. కాబట్టి ఆ సమయంలో వారి దగ్గరలో ఫోన్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లులకే ఉంది.
రోగనిరోధక శక్తి బలహీనంగా మారి
చిన్న వయసులో పిల్లలు అధిక రేడియేషన్ బారిన పడితే వారిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇది మెదడు అభివృద్ధిని నెమ్మదించేలా చేస్తుంది. నిద్ర కూడా పట్టకుండా అనేక వ్యాధుల బారిన పడేలా ప్రేరేపిస్తుంది. ఈ రోగ నిరోధక శక్తిని కూడా బలహీనంగా మారుస్తుంది. దీనివల్ల క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది.

