పొరపాటున కూడా వీళ్లు జామకాయను తినకూడదు
జామకాయలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే ఈ పండ్లను ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే కొంతమంది మాత్రం జామకాయలను అసలే తినకూడదు.

guava
జామ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎంతో రుచిగా ఉండే కొన్ని జామ కాయల గుజ్జు ఎర్రగా ఉంటే.. మరికొన్ని దాంట్లో మాత్రం తెల్లగా ఉంటుంది. ఈ జామకాయల్లో పొటాషియం, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. అంతేకాదు ఈ కాయల్లో బీటా కెరోటిన్, ఫోలేట్ లు కూడా ఉంటాయి. ఈ పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ.. దీన్ని కొంతమంది అస్సలు తినకూడదు. ఎందుకు? ఎవరెవరు తినకూడదో తెలుసుకుందాం పదండి.
దగ్గు, జలుబు
దగ్గు, జలుబు సమస్యలతో బాధపడేవారు జామకాయలను తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ పండు ఈ సమస్యలను మరింత ఎక్కువ చేస్తుంది. జామలో చలువ చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా దీన్ని ఎట్టి పరిస్థితిలో రాత్రిపూట తినకూడదు. లేకపోతే జలుబు చేసే అవకాశం ఉంది.
irritable bowl syndrome
irritable bowl syndrome సమస్య ఉన్నవారు కూడా జామకాయలకు దూరంగా ఉండాలి. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగ్గా చేస్తుంది. అజీర్థి, మలబద్దకం వంటి సమస్యలను కూడా పోగొడుతుంది. అయితే ఈ పండును మోతాదుకు మించి తింటే జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే బౌల్ సిండ్రోమ్ సమస్య ఉన్నవారు జామకాయలను ఎక్కువగా తినకూడదు.
ఇన్ఫ్లమేషన్
జామలో విటమిన్ సి తో పాటుగా ఫ్రక్టోజ్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే మాత్రం మీ శరీరంలో విటమిన్ సి ఎక్కువయ్యి అది శోషించుకోవడం కష్టతరమవుతుంది. కడుపులో మంట కూడా పెరుగుతుంది. ముఖ్యంగా జామకాయలను మోతాదుకు మించి తింటే కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే జామకాయను తిని ఆ వెంటనే అస్సలు నిద్రపోకూడదు. ఇవి ఉబ్బరం సమస్యను మరింత ఎక్కువ చేస్తుంది.
డయాబెటీస్ పేషెంట్లు
జామలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందుకే మధుమేహులు దీనిని ఎక్కువగా తినాలని సలహానిస్తుంటారు. అయినప్పటికీ డయాబెటీస్ పేషెంట్లు జామకాయను మోతాదులో తింటేనే ప్రయోజనాలను పొందుతారు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ఎందుకంటే జామలో షుగర్ కంటెంట్ కూడా ఉంటుంది.
రోజులో ఎన్ని జామకాయలను తినాలి
రోజుకు ఒకటి లేదా రెండు తినడం మంచిది. అప్పుడే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. ఈ రెండు పండ్లను కూడా గంట గ్యాప్ ఇచ్చి తినాలి. వ్యాయామం చేయాడానికి ముందు ఒక జామకాయను తింటే మంచి ప్రయోజనాలను పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.