MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఉసిరికాయను వీళ్లు అస్సలు తినకూడదు.. మర్చిపోయి తిన్నారో అంతే సంగతులు..

ఉసిరికాయను వీళ్లు అస్సలు తినకూడదు.. మర్చిపోయి తిన్నారో అంతే సంగతులు..

ఉసిరికాయను సీజన్ తో సంబంధం లేకుండా తినొచ్చు. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. కానీ కొంతమంది మాత్రం ఉసిరికాయను మర్చిపోయి కూడా తినకూడదు. ఒకవేళ తింటే..  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 13 2022, 11:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఉసిరి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే దీన్ని సీజన్లతో సంబంధం లేకుండా తినొచ్చంటారు ఆరోగ్య నిపుణులు. ఉసిరికాయలో విటమిన్ ఎ, పొటాషియం, విటమిన్ బి6, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉసిరి చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా చేస్తుంది. అలాగే ఇది జుట్టు సమస్యలను కూడా పోగొడుతుంది. తెల్లజుట్టును నల్లగా చేయడం, హెయిర్ ఫాల్ ను ఆపడం, చుండ్రును పోగొట్టడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరి వాంతులు, విరేచనాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వీటితో పాటుగా ఉసిరి మనకు ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయినప్పటికీ ఉసిరికాయను కొంతమంది అసలే తినకూడదు. ఎవరెవరు తినకూడదు..? ఎందుకు తినకూడదో తెలుసుకుందాం పదండి. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండేవారు

రక్తంలో ఉండాల్సిన వాటికంటే తక్కవ చక్కెర స్థాయిలు ఉన్నవారు ఉసిరి కాయలను తినకూడదు. ఒకవేళా తిన్నా ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిలను మరింత తగ్గిస్తుంది. 
 

35

ఎసిడిటీ

ఈ రోజుల్లో ఎసిడిటీతో బాధపడేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. అయితే ఎసిడిటీ ఉన్నవారు కూడా ఉసిరికాయను తినడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే దీనిలో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది హైపర్ ఎసిడిటీ ఉన్నవారి సమస్యలను మరింత పెంచుతుంది. అందుకే ఈ సమస్య ఉన్నవారు ఉసిరిని మర్చిపోయి కూడా తినకూడదు. 
 

45

శస్త్రచికిత్స

ఏదైనా శస్త్రచికిత్స చేయించుకున్నవారు కూడా ఉసిరికాయను తినకూడదు. కొన్ని రోజుల పాటు ఉసిరికాయల జోలికి వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలాంటి వాళ్లు ఉసిరికాయను తింటే రక్తస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. అందుకే వీళ్లు దీన్ని తినకూడదు.
 

55

డీహైడ్రేషన్

శరీరంలో తగినంత నీరు లేకపోతే బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఈ డీహైడ్రేషన్ మన ప్రాణాలను కూడా తీయొచ్చు. డీహైడ్రేషన్ సమస్య ఉన్నవారు ఉసిరి కాయను మర్చిపోయి కూడా తినకూడదు. ఎందుకంటే ఉసిరి డీహైడ్రేషన్ సమస్యను మరింత పెంచుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Pearl nose pins: ముత్యాల ముక్కుపుడకలు పెట్టుకుంటే ఎంతో అందం
Recommended image2
Railway Facility: మీరు ఎక్కాల్సిన రైలు క్యాన్సిల్ అయ్యిందా? లేటు అయ్యిందా? ఈ హోటల్ సర్వీస్ మీకే..!
Recommended image3
Earrings: హగ్గీ ఇయర్ రింగ్స్.. ఆఫీసుకు వెళ్లే వారికి బెస్ట్ ఆప్షన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved