- Home
- Life
- టాయిలెట్ సీట్లు పచ్చగా మారాయా? ఎన్ని లిక్విడ్స్ వాడినా ఫలితం లేదా? సింపుల్ టిప్స్‌తో మ్యాజిక్..
టాయిలెట్ సీట్లు పచ్చగా మారాయా? ఎన్ని లిక్విడ్స్ వాడినా ఫలితం లేదా? సింపుల్ టిప్స్‌తో మ్యాజిక్..
టాయిలెట్ బేసిన్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేదంటే క్రిములతో పాటు, రంగు కూడా ఇట్టే మారుతుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మార్కెట్లో లభించే రకరకాల లిక్విడ్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ సమస్యకు సహజంగా చెక్ పెట్టేందుకు కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టాయిలెట్ షీట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే పసుపు మరకలు ఏర్పడుతుంటాయి. అందుకే మార్కెట్లో లభించే లిక్విడ్స్‌తో క్లీన్ చేస్తుంటారు. అయితే వీటి కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఇవి పెద్దగా ప్రభావాన్ని చూపకపోతుండొచ్చు. అయితే కొన్ని రకాల నేచురల్ విధానాల ద్వారా కూడా టాయిలెట్ షీట్లను తళుక్కుమనేలా చేయొచ్చు.
టాయిలెట్ షీట్లను తళుక్కుమనేలా చేయడంలో వైట్ వెనిగర్ బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ముందుగా ఒక మగ్‌లో 2 కప్పుల వైట్ వెనిగర్‌ను తీసుకోవాలి. అనంతరం అందులో బేకింగ్ సోడాను కలపాలి. ఈ లిక్విడ్‌ను టాయిలెట్ షీట్లపై పోసి కాసేపు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత కాసేపు బ్రష్‌తో కడిగేసి నీరు పోస్తే సరిపోతుంది. అంతే టాయిలెట్ షీట్ తళుక్కుమననడం ఖాయం.
బోరాక్స్ పౌడర్ కూడా మరకలు తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం ముందుగా కొంత బోరాక్స్ పౌడర్‌ను తీసుకోవాలి. అనంతరం అందులో నిమ్మకాయ రసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని పసుపుగా ఉన్న టాయిలెట్ షీట్‌పై వేసి బ్రష్‌తో బాగా రాయాలి. ఆ తర్వాత నీటితో కడిగేస్తే సరిపోతుంది. తెల్లగా మారుతాయి.
ఇక టాయిలెట్ షీట్‌ను క్లీన్ చేయడానికి చాలా మంది సర్ఫ్ వంటి పౌడర్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే ఇవి కేవలం షీట్స్ ఉండే రంగును తొలగిస్తుంది కానీ క్రిములను తొలగించవచ్చు. అందుకే పైన తెలిపిన టిప్స్ పాటించడం ద్వారా అటు మరకలతో పాటు క్రిములు కూడా పూర్తిగా దూరమవుతాయి.