MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఎప్పుడూ ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నారా? అయితే ఈ అలవాట్లను మార్చండి.. ఏ జబ్బూ రాదు..

ఎప్పుడూ ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నారా? అయితే ఈ అలవాట్లను మార్చండి.. ఏ జబ్బూ రాదు..

కొంతమంది ఎప్పుడూ చూసినా ఏదో ఒక జబ్బుతో బాధపడుతూనే ఉంటారు.  జ్వరం కాకపోతే  దగ్గు.. ఇది కాకపోతే జలుబు లేదా కడుపునకు సంబంధించిన సమస్యలు. ఇవి ఎప్పుడూ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇలాంటి వారు లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకుంటే ఏ సమస్యా రాదు..  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 27 2022, 04:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చలికాలం షురూ అయ్యింది. ఈ సమయంలో జ్వరం, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి సమయంలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఋతువులలో మార్పుల కారణంగా..  దాదాపుగా ప్రతి ఒక్కరూ జలుబు, దగ్గు సమస్యలతో బాధపడుతుంటారు. ఇవి జస్ట్ సీజన్ మారడం వల్లే వస్తుంటాయి. అయితే చాలా మంది సీజన్లతో సంబంధం లేకుండా తరచుగా శారీరక సమస్యలతో బాధపడుతుంటారు. పదే పదే అనారోగ్యానికి గురవుతుంటారు. కొన్నిసార్లు జ్వరం, ఇంకొన్ని సార్లు జలుబు-దగ్గు లేదా కడుపు సమస్యలు మళ్లీ మళ్లీ వస్తుంటాయి. ఇలాంటి వాళ్లు జీవనశైలిలో ఈ మార్పులు చేసుకుంటే మీకు ఇలాంటి అనారోగ్య సమస్యల బాధ తప్పుతుంది. అవేంటో తెలుసుకుందాం పదండి.. 
 

26

డైట్ : అన్నింటికంటే ముందు మీ డైట్ ను మార్చండి. మీరు ప్రతిరోజూ  తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉండేట్టు చూసుకోండి. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తినండి. మీ శరీరంలో ఎలాంటి పోషక లోపం లేకుండా చూసుకోండి. అప్పుడే ఎలాంటి రోగాలు రావు. 

36
walking

walking

ప్రతిరోజూ ౩౦ నిమిషాల నడక: సరైన పోషకాహారమే కాదు.. వ్యాయామం లేకపోవడం వల్ల కూడా ఎన్నో శారీరక సమస్యలు వస్తాయి. అందుకే ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలైనా నడవండి. అప్పుడే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరగడం నుంచి అలసట, గుండె జబ్బులు వంటివి ఎన్నోరోగాలు వస్తాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. మరువకుండా ప్రతి రోజూ 30 నిమిషాల పాటు నడిస్తే.. కండరాలను బలోపేతం అవుతాయి. ఎముకలను బలంగా మారుతాయి. 
 

46

ప్రతిరోజూ పుష్కలంగా నీళ్లను తాగాలి:  ఆరోగ్యంగా ఉండాలంటే 7 నుంచి 8 గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలి. అప్పుడే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే డీహైడ్రేషన్ కు గురవుతారు. దీనివల్ల లేనిపోని రోగాలు వస్తాయి. మీకు తెలుసా డీహైడ్రేషన్ వల్ల విపరీతమైన అలసటే కాదు.. ప్రాణాలు కూడా పోవచ్చు.
 

56

తింటున్నప్పుడు నీళ్లను తాగకూడదు: చాలా మందికి నీరు లేనిదే ముద్ద కూడా దిగదు. బుక్క బుక్క కు నీళ్లను తాగుతూనే ఉంటారు. కానీ  ఇలా తాగడం అస్సలు మంచిది కాదు.  దీనివల్ల ఫుడ్ జీర్ణం కాదు. ఒకవేళ తాగాల్సి వస్తే తక్కువగా తాగండి. వాటర్ కు బదులుగా నిమ్మకాయ నీటిని తాగండి. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు. 

66

నిద్ర: మనలో చాలా మంది రాత్రి భోజనం చేయడమే ఆలస్యం వెంటనే నిద్రపోతుంటారు. కానీ ఇది మంచి పద్దతి కాదు. రాత్రి పడుకోవడానికి 3 నుంచి 4 గంటల ముందే భోజనం చేయాలి. ఇలా అయితేనే మీరు తిన్నది సరిగ్గా జీర్ణం అవుతుంది. దీంతో జీవక్రియ కార్యకలాపాలు బాగా జరుగుతాయి. తిన్నవెంటనే పడుకుంటే మాత్రం అజీర్థి, మలబద్దకంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Dosas : మన పెసరట్టు... వరల్డ్ వైడ్ హిట్టు
Recommended image2
Travel Guide : మీ మానసిక స్థితి ఏంటి..? ఏ ట్రిప్ కు వెళ్లాలో తెలుసా..?
Recommended image3
Chaat Masala: ఈ ఒక్క పొడితో స్నాక్స్ కు నోరూరించే టేస్ట్, పిల్లలు అస్సలు వదలరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved