MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • క్యాన్సర్ రాకూడదంటే ఈ పండ్లను, కూరగాయలను తప్పకుండా తినండి

క్యాన్సర్ రాకూడదంటే ఈ పండ్లను, కూరగాయలను తప్పకుండా తినండి

కొన్ని ఆహారాలు కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 24 2022, 04:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

అనియంత్రిత కణాల పెరుగుదల శరీరంలోని ఇతర కణజాలాలను ప్రభావితం చేసే పరిస్థితినే క్యాన్సర్ అంటారు. చాలా వరకు కొన్ని కాన్సర్లను  ముందుగా గుర్తిస్తే.. ప్రాణాలతో బయటపడొచ్చు. ఏదేమైనా  చాలా క్యాన్సర్ల లక్షణాలను ప్రారంభంలో అస్సలు గుర్తించలేం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది క్యాన్సర్లతో చనిపోతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

అయితే కొన్ని రకాల ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఎంతో సహాయపడతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందుకే మీరు పండ్లు, కూరగాయలు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను పుష్కలంగా తినండి. అయితే మాంసాహారం, ఉప్పు,  స్వీట్లు, ఆయిలీ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ ను ఎక్కువగా అస్సలు తినకూడదు. అలాగే  ఒక్కరోజూ మిస్ కాకుండా వ్యాయామం చేయాలి. ఇంతకి ఎలాంటి ఆహారాలను తింటే క్యాన్సర్ ముప్పు తగ్గుతుందో తెలుసుకుందాం పదండి.

39

బెర్రీలు

క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో బెర్రీలు ముందు వరుసలో ఉంటాయి. స్ట్రాబెర్రీలు, రాస్బెర్రీలు, బ్లాక్బెర్రీలు, బ్లాక్ బెర్రీలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ముఖ్యమైన ఖనిజాలు క్యాన్సర్ కణాలతో పోరాడటానికి సహాయపడతాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. అందుకే రోజూ గుప్పెడు బెర్రీలను తినడం మర్చిపోకండి.

49

క్యాబేజీ, కాలీఫ్లవర్

క్యాబేజీ, కాలీఫ్లవర్ కూరగాయలను ఎన్నో వంటల్లో ఉపయోగిస్తారు. అయితే ఈ కూరగాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోండి. ఇవి బరువు తగ్గేందకు కూడా సహాయపడతాయి.
 

59

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లైనా నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్లు కూడా క్యాన్సర్ ముప్పును తప్పిస్తాయి. ఈ సిట్రస్ పండ్లలో ఉండే విటమిన్ సి, కాల్షియం, ఫోలేట్  లు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 2013 లో ప్రచురించబడిన జర్నల్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అధ్యయనంలో..  సిట్రస్ పండ్లను ఎక్కువగా తినే మహిళలకు రొమ్ము క్యాన్సర్ అభివృద్ధి చెందే ప్రమాదం 10% తక్కువగా ఉందని కనుగొన్నారు.

69

క్యారెట్లు

క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అంతేకాదు క్యారెట్లలో ఉండే విటమిన్ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. దీన్ని తరచుగా తింటే చర్మం కూడా నిగనిగలాడుతుంది. చర్మ సమస్యలు తొలగిపోతాయి. 
 

79

టమాటాలు

టమాటాలు లేకుండా కూరలను అసలే వండలేం కదా.. నిజానికి టమాటాల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. టమోటాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. టమాటాల్లో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. టమాటా జ్యూస్ ను తాగితే బరువు తగ్గడం నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. అందుకే రోజూ టమాటాలను తినాలి.
 

89

దానిమ్మ పండ్లు

దానిమ్మ పండ్లు రొమ్ము క్యాన్సర్ తో సహా ఎన్నో రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి.  క్యాన్సర్ ప్రివెన్షన్ రీసెర్చ్ లో ప్రచురించబడిన 2010 అధ్యయనం ప్రకారం.. దానిమ్మలో ఎలాగిటానిన్స్ అని పిలువబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను, వ్యాప్తిని నిరోధిస్తాయి. అందుకే ఈ పండ్లను రోజూ ఒకటైనా తినండి. ఈ పండ్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
 

99

బ్రోకలీ

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బ్రోకలీని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. బ్రోకలీలో ఉండే కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు దీనికి సహాయపడతాయి. బ్రోకలీ ఎముకలను కూడా బలంగా చేస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ ఆకలిని నియంత్రిస్తుంది. రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా సహాయపడుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Relationship : వీడెవడండీ బాబు.. పెళ్లాం కోసం అత్తారింటికి వెళ్లి అందమైన అత్తనే లేపుకెళ్లాడా..!
Recommended image2
Snake Plant: ఇంటి లోపల ఈ మొక్కను పెంచితే ఇన్ని లాభాలా?
Recommended image3
IRCTC Maharashtra Tour Package : కేవలం రూ.5770 కే మహారాష్ట్ర టూర్.. షిరిడి, త్రయంబకేశ్వర్, పంచవటి, నాసిక్ యాత్ర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved