MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • వీటిని తింటే కూడా గుండెపోటు వస్తుంది జాగ్రత్త..

వీటిని తింటే కూడా గుండెపోటు వస్తుంది జాగ్రత్త..

ఒకప్పుడు గుండె జబ్బులు వయసు మీద పడుతున్న వారికి మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్న వయసు వారు సైతం గుండెపోటు బారిన పడుతున్నారు. దీనికంతటికి ప్రధాన కారణం మన జీవన శైలి, మనం తినే ఆహారాలే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.   

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 02 2022, 02:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సైలెంట్ కిల్లర్ గా పిలువబడే గుండె పోటు ఎంతో మంది యువకుల ప్రాణాలను తీసింది. తీస్తూనే ఉంది. ఒకప్పుడు పెద్దవయసు వారికి ఇది వచ్చేది. ఇప్పుడు 40 ఏండ్ల వయసు వారు సైతం గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి బాహ్య కారణాలుగా.. జీవన శైలి, ఒత్తిడి, కుటుంబ చరిత్ర వంటివి చెప్పుకోవచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బాహ్య కారణాల సంగతి పక్కన పెడితే శరీరం లోపల అంతా సవ్యంగా జరిగితే ఇలాంటి రోగాలు వచ్చే చాలా తక్కువగా ఉంటుందని  ఆరోగ్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇక మన శరీర ఆరోగ్యాన్ని మనం తీసుకునే ఆహారమే నిర్ణయిస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు మన ఆరోగ్యాన్ని దారుణంగా ప్రభావితం చేస్తాయి. అలాగే ఇంకొన్ని ఆహారాలు గుండెను ప్రమాదంలో పడేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

37

ఉప్పు (salt)

ఉప్పు మన శరీరానికి చాలా అవసరం. అయినప్పటికీ దీనిని మోతాదుకు మించి అస్సలు తినకూడదు. ముఖ్యంగా ఒక వయోజనుడు రోజుకు 5 గ్రాములకు తక్కువ కాకుండా ఉప్పును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కానీ చాలా మంది ఉప్పును మోతాదుకు మించి తినేవాళ్లు చాలా మందే ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఉప్పు వినియోగాన్ని అవసరం మేరకే తీసుకుంటే.. ప్రతి ఏడాది 2.5 మిలియన్ల మరణాలు తగ్గుతాయని తెలియజేసింది. 

సోడియం మన శరీరానికి అవసరమయినప్పటికీ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది శరీరానికి ప్రాణాంతకం కావొచ్చు. ఒక పరిశోధన ప్రకారం.. భారతీయులు ఒక రోజుకు 11 గ్రాముల కంటే ఎక్కువగా ఉప్పును తీసుకుంటున్నారట. అంటే ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన దానికంటే ఎక్కువ. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 
 

47

సంతృప్త కొవ్వు

American Heart Association ప్రకారం.. మనం తీసుకునే రోజు వారి ఆహారంలో  సంతృప్త కొవ్వు 5 నుంచి 6 ఉంటే సరిపోతుంది. ఇంతకు మించితేనే శరీరం దెబ్బతింటుంది. కాగా వయసు పెరుగుతున్న కొద్దీ కొవ్వు పదార్థాలను చాలా వరకు తగ్గించాలి. ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు ఈ  కొవ్వులను తీసుకోకపోవడమే మంచిది. కాగా ఈ సంతృప్త కొవ్వులు కొన్ని నూనెల్లో జుంతు ఉత్పత్తులో ఉంటుంది. 
 

57
sugar

sugar

చక్కెర (Sugar)

చక్కెర మన శరీరానికి చాలా అవసరం. అలా అని అదేపనిగా చక్కెరను తీసుకుంటే మాత్రం ఎన్నో రోగాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వయోజనులు రోజుకు 30గ్రాముల చక్కెరను తీసుకుంటే చాలు. ఇంతకు మించి తీసుకుంటే గుండె జబ్బులు వచ్చి మీ ప్రాణాలకే ప్రమాదం కలుగుతుంది. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే గుండె ప్రమాదంలో పడుతుందని పలు పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేశాయి. 

కాగా షుగర్ వినియోగంపై ఒక పరిశోధన 15 సంవత్సరాలకు పైగ కొనసాగింది. ఈ అధ్యయనం ప్రకారం..  రోజుకు 25 శాతం కంటే ఎక్కువ మొత్తంలో షుగర్ తీసుకునే వ్యక్తిని.. 25 శాతం కంటే తక్కువగా తీసుకునే వ్యక్తితో పోల్చితే.. అతనే తొందరగా గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఉంది. అంతేకాదు గుండెపోటుతో మరణించే అవకాశం రెట్టింపులో ఉందని పరిశోధనలు తేల్చి చెప్పాయి. 

కేకులు, సోడాలు, పేస్ట్రీలు, బాటిల్ డ్రింక్ ల్లో ఉండే షుగర్ గుండెకు ఏ మాత్రం మంచిది కాదు. వీటిల్లో ఉండే చక్కెర గుండెను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. 
 

67

తక్కువ నిద్ర (less sleep)

ఈ రోజుల్లో కంటి నిండా నిద్రపోయే వారు తక్కువేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ సరిగ్గా నిద్రపోతేనే శరీరం, మనస్సుకు విశ్రాంతి లభిస్తుంది. ఒకవేళ అలసిన శరీరానికి విశ్రాంతి లేకపోతే కూడా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. 

నిపుణుల అభిప్రాయం ఒక వ్యక్తి రోజుకు 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. అలా పడుకుంటే మీరు మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

వీటితో పాటుగా మీ గుండెను స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అనారోగ్యకరమైన అలవాట్లు కూడా ప్రమాదంలో పడేస్తాయి. అందుకే వీటికి వీలైనంత దూరంగా ఉండండి. 
 

77

ఇంటి ఫుడ్ కంటే బయటఫుడ్ నే ఎక్కువగా తినే వారు చాలా మందే ఉన్నారు. వివిధ యాడ్ లల్లో చూసి రకరకాల చిప్స్ ను ప్యాకెట్స్ ను కొని లాగిస్తుంటారు. కానీ ఇవి గుండెపోటుకు దారితీస్తాయి. చిన్నవయసు వారు గుండెపోటు బారిన పడటానికి అసలు కారణం ఇదే అంటున్నారు నిపుణులు. 

అలాగే శరీరక వ్యాయామాలు లేకపోతే కూడా గుండె ప్రమాదంలో పడుతుంది. అందుకే ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు వ్యాయామం చేయండి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chicken: చికెన్ కూర వండేటప్పుడు ఈ తప్పులు చేస్తే.. కూర రుచి పాడౌతుంది..!
Recommended image2
Lunch Box Recipes: నిమిషాల్లో తయారయ్యే లంచ్ బాక్స్ రెసిపీలు.. టేస్ట్ అదుర్స్!
Recommended image3
Sarees: ఎవరికైనా నప్పే టాప్ ట్రెండింగ్ చీరలు ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved