ఇలాంటి ఆహారాలను తింటే కడుపు నొప్పి వస్తుంది జాగ్రత్త..
మనం తినే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. పోషకలేమి ఆహారం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం, తాగడం వల్ల కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మనం తినే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా.. కానీ చాలా మంది అనారోగ్యానికి గురి చేసే ఆహారాలను తింటూ అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటి వల్ల గ్యాస్, అసిడిటీ, కడుపు నొప్పి , కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి ఆహారాలను తింటే కడుపు నొప్పి వస్తుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి..
పచ్చి కూరగాయలు: పచ్చి కూరగాయలైన నైట్ షేడ్ కు చెందిన ఆలుగడ్డ, ముంగ్ బీన్ టమాటా, గోజీ బెర్రీలు, మిరియాలు, వంకాయలను తినడం వల్ల కడుపు నొప్పి సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు వీటి వల్ల పేగుకు సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిట్రస్ టమోటోలను తినడం వల్ల యాసిడ్ సమస్య వస్తుందట. అంతేకాదు గుండెలో మంట కూడా వస్తుంది.
ఎక్కువ ఫైబర్ ఆహార పదార్థాలు: ఫైబర్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనకు తెలుసు. కానీ అధికంగా ఫైబర్ ఉండే ఆహారాలు మనల్ని అనేక అనారోగ్య సమస్యలకు గురిచేస్తాయి. అరటిపండ్లు, చిక్కుళ్లు, యాపిల్స్ పండ్లలో కూడా ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని రోజులో ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కడుపులో మంట, నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాగే మలబద్దకం సమస్య కూడా అటాక్ చేస్తుంది. ముఖ్యంగా ఫైబర్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగు సంబంధిత రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.
protein
ప్రోటీన్: అధిక ప్రోటీన్లు ఉండే ఆహారంతో కూడా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేల ప్రోటీన్ ఆహారాలను తినాలనుకుంటే రోజులో తక్కువ మొత్తంలో తినండి. ఇలా తింటే అవి సులభంగా జీర్ణం అవుతాయి. ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం కడుపు నొప్పి, అజీర్థి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
పాల ఉత్పత్తులు: పులియబెట్టని పాల ఉత్పత్తులను తీసుకుంటే కూడా పొత్తి కడుపు నొప్పి , కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కడుపు ఉబ్బరానికి గురిచేసే హార్మోన్లు ఆవు పాలలో ఉంటాయి.
ఆల్కహాల్: చాలా మందికి రాత్రుళ్లు మద్యం తాగే అలవాటు ఉంటుంది. ఇది తాగినప్పుడు అది Digestive system గుండా వెళ్లడం వల్ల కడుపులో వికారం, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆల్కహాల్ లో పోషకాలు చాలా తక్కువ మొత్తంలో ఉండటం వల్ల.. కడుపులో మంట, అసౌకర్యంగా, చికాకుగా అనిపించడం వంటి సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
మసాలా ఫుడ్: జంక్ ఫుడ్, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కావు. వీటిని తినడం వల్ల కడుపులో యాసిట్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. ఈ స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల కడుపు నొప్పితో పాటుగా కడుపులో Peptic ulcer ,పొట్టలో పుండ్లు (Gastritis) వంటి సమస్యలు వస్తాయి.