MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health: ఆరోగ్యానికి మేలు చేస్తుందని వెల్లుల్లిని అతిగా తీసుకుంటే అంతే సంగతులు..

Health: ఆరోగ్యానికి మేలు చేస్తుందని వెల్లుల్లిని అతిగా తీసుకుంటే అంతే సంగతులు..

Health: కరోనా రాకతో ప్రజలు ఆహారపు అలవాట్లు పూర్తి మారిపోతున్నాయి. అంటే ఆరోగ్యకరమైన ఆహారం వైపు మొగ్గుచూపుతున్నారు. ఇదంతా కరోనా చలవనే చెప్పాలి. కరోనా నుంచి తమను తాము రక్షించుకోవడానికి పోషకవిలువలుండే ఆహారాన్ని తీసుకుంటున్నారు. వీటిలో ఒకటైన వెల్లుల్లి వాడకం కూడా బాగా పెరిగింది. అయితే..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 23 2022, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Health: కరోనా పుణ్యమా అని జనాలంతా మెరుగైన ఆహారం వైపు మొగ్గుచూపుతున్నారు. ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మందిచి? ఏయే ఆహార పదార్థాలతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందో అలాంటి ఆహారాలకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. వాటినే తినడం అలవాటు చేసుకుంటున్నారు.  అందులోనూ బలమైన ఆహారమే కరోనాకు విరుగుడు అని నిపుణులు చెప్పడంతో వాటినే ఎక్కువగాతింటున్నారు. ఇలాంటి ఆహార పదార్థాల్లో వెల్లుల్లి కూడా ఒకటి. ఈ వెల్లుల్లిలో కాల్షియం, పొటాషియం, కాపర్, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ బీ1 వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. అందుకే ప్రతి వంటలో వెల్లుల్లిని ఖచ్చితంగా వాడుతున్నారు. 

25


కూరల్లో రుచిని పెంచడంతో పాటుగా ఇమ్యునిటీ పవర్ ను పెంచడంలో కూడా వెల్లుల్లి అన్నింటికంటే ముందుంటుంది. అందుకే జనాలు ఈ వెల్లుల్లి వాడకాన్ని విపరీతంగా పెంచేశారు. అయితే ఆరోగ్యానికి మేలు చేస్తుందని మితిమీరి దీన్ని వాడితే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని అతిగా తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
 

35
blood pressure

blood pressure

వెల్లుల్లితో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయని మోతాదుకు మించి తీసుకుంటే Blood pressure తగ్గే ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు బీపీ తక్కువ ఉన్నవారు వెల్లుల్లిని మోతాదుకు మించి తీసుకుంటే రిస్క్ తప్పదని పేర్కొంటున్నారు. 

45

వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటే చాతిలో మంట సమస్య వచ్చే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే వెల్లుల్లిలో యాసిడ్ శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు అసిడిటీ సమస్య ఉన్నవారికి ఇది ఏమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య ఉన్న వారు మోతాదులోనే వెల్లుల్లిని తీసుకోవాలి. వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటే చాతిలో మంట సమస్య వచ్చే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే వెల్లుల్లిలో యాసిడ్ శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు అసిడిటీ సమస్య ఉన్నవారికి ఇది ఏమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య ఉన్న వారు మోతాదులోనే వెల్లుల్లిని తీసుకోవాలి. 

 

55

వెల్లుల్లి కమ్మనైన రుచిని ఇవ్వడమే కాదు.. వాసన వచ్చేలా కూడా చేస్తుంది. అంటే ఎక్కువగా వెల్లుల్లిని ఎవరైతే తీసుకుంటారో వారికి నోటి దుర్వాసన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు వెళ్లడిస్తున్నారు. అంతేకాదు చెమట కూడా దారుణంగా వచ్చి అది దుర్గందంగా మారే ఛాన్సెస్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Earrings: ఈ సిల్వర్ ఇయర్ రింగ్స్ తో ప్రీమియం లుక్ మీ సొంతం
Recommended image2
Grey Hair: కలర్ వేయకుండా తెల్ల జుట్టు కవర్ చేసే ట్రిక్స్
Recommended image3
Chanakya Niti: కోట్లు సంపాదించడం కాదు.. ఈ అలవాట్లు ఉంటేనే డబ్బు నిలుస్తుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved