- Home
- Life
- Bones Weaken: ఈ ఐదు ఆహార పదార్థాలు చాలు మన ఎముకలు దెబ్బతినడానికి.. వాటికి దూరంగా ఉండకపోతే మీ పని అంతే..
Bones Weaken: ఈ ఐదు ఆహార పదార్థాలు చాలు మన ఎముకలు దెబ్బతినడానికి.. వాటికి దూరంగా ఉండకపోతే మీ పని అంతే..
Bones Weaken: మానవ శరీరంలో ఎముకలు ఎంతో ముఖ్యమైనవి. ఎందుకంటే మన శరీరమంతా ఎముకలపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి. ఎముకలు బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. అందుకే ఎముకలను బద్రంగా ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎముకలు దెబ్బతినేలా చేస్తాయి.

Bones Weaken: మన శరీరమంతా ఎముకలపైనే ఆధారపడి ఉంటుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. అందుకే ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. ఎముకలకు ఏదైనా సమస్య వస్తే మన శరీరం మొత్తంపై ప్రభావం పడే ప్రమాదముంది. అందుకే ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా ఎప్పటికప్పుడూ చూసుకుంటూ ఉండాలి. అయితే మనం రోజూ తీసుకునే కొన్ని రకాలైన ఆహార పదార్థాలు ఎముకలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. తద్వారా ఎముకలు దెబ్బతినే ప్రమాదముంది. మరి ఎలాంటి ఆహారాలు ఎముకలను దెబ్బతీస్తాయో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
ఉప్పు: ఉప్పు మన శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఎంత ఎక్కువ ఉప్పు తీసుకుంటే శరీరంలో క్యాల్షియం అంతగా తగ్గుతూ ఉంటుంది. అంతేకాదు దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి. ఎవరైతే ఉప్పు అధిక మొత్తంలో తీసుకుంటారో వారు బోలు ఎముకల వ్యాధి బారిన పడే ప్రమాదముంది.
కెఫిన్: కెఫిన్ ఎముకల ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. కెఫిన్ ఎక్కువ మొత్తంలో ఎవరైతే తీసుకుంటారో వారి ఎముకలు ప్రమాదంలో పడ్డట్టే. ఈ కెఫిన్ వల్ల ఎముకల బలం తగ్గుతుంది. పలు అధ్యయనాల ప్రకారం.. 100 mg ల కెఫిన్ మన శరీరంలోని 6 mg క్యాల్షియాన్ని తగ్గిస్తుంది.
చక్కెర: అధిక బరువుతో బాధపడేవారు చక్కెరకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ శరీర బరువును పెంచడంలో ముందుంటుంది కాబట్టి. దీంతో పాటుగా ఈ చక్కెర ఎముకలు దెబ్బతినేలా చేస్తుంది. స్థూలకాయంతో బాధపడేవారు చక్కెరను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల వారికి కీళ్ల నొప్పులు వస్తాయి.
మిరియాలు, టొమోటోలు, వంకాయలు, తెల్ల బంగాళ దుంపలు వంటి వెజిటేబుల్స్ ఆరోగ్యానికి మంచి చేసేవే అయినా.. ఎముకలకు మాత్రం చేటే చేస్తాయి. వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే.. ఎముకల్లో మంట వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇవి ఎముకలు బలహీన పడేలా చేస్తాయి.
ఆల్కహాల్: లిమిట్ కు మించి మద్యం సేవించడం, సోడా డ్రింక్స్ తాగడం వల్ల కూడా ఎముకలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ డ్రింక్స్ ఎముకల ఖనిజ సాంద్రతను తగ్గించే గుణాలను కలిగి ఉంటాయి. అంతేకాదు ఆల్కహాల్ ఎముకలు పగుళ్లు వచ్చేలా చేస్తాయి.