- Home
- Life
- 10 కి 3 కలిపితే పదమూడు, 10 కి 4 కలిపితే పద్నాలుగు.. మరి పదికి ఐదు కలిపితే పదిహేను ఎలా అయ్యింది?
10 కి 3 కలిపితే పదమూడు, 10 కి 4 కలిపితే పద్నాలుగు.. మరి పదికి ఐదు కలిపితే పదిహేను ఎలా అయ్యింది?
పదికి మూడు కలిపితే పదమూడు, పదికి నాలుగు కలిపితే పదనాలుగు అయినప్పుడు... పదికి ఐదు కలిపినప్పుడు మాత్రం అది పదహేను ఎలా అయ్యింది? దీని వెనక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా?

ఇది గమనించారా?
తెలుగు భాష ఎంత అద్భుతమైనదో, దాని వ్యాకరణం, మనం రోజూ వాడే నెంబర్ల వెనక ఉన్న లాజిక్ అంతకంటే విచిత్రంగా ఉంటుంది. మన జీవితంలో రోజువారీగా వాడే సంఖ్యలను ఒక్కసారిగా లోతుగా పరిశీలిస్తే.. ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురౌతాయి. ముఖ్యంగా తెలుగు అంకెల పేర్లలో దాగి ఉన్న ఈ చిన్న చమత్కారాన్ని ఎప్పుడైనా గమనించారా?
పదికి మూడు కలిపితే పదమూడు అంటాం. పదికి నాలుగు కలిపితే పద్నాలుగు అవుతుంది. అంకెల క్రమం ప్రకారం చూస్తే.. పదికి ఐదు కలిపితే పదఐదు అని అనాలి కదా..? కానీ, మనం దానిని పదహేను అని ఎందుకు పిలుస్తాం? దీని వెనక ఉన్న కారణం ఏంటో తెలుసా?
తెలుగుకు మూలం...
తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష. కేవలం తెలుగుకు మాత్రమే కాదు.. తమిళం, కన్నడ, మలయాళం ఇవన్నీ కూడా ద్రవిడ భాష కుటుంబానికి చెందినవే. ఈ ద్రావిడ భాషలన్నింటికీ మాతృకగా ప్రోటో ద్రావిడ లేదా ప్రోటో తెలుగు అని చెప్తారు. ఈ ప్రాచీన ప్రోటో తెలుగులో ఏను అంటే ఐదు అని అర్థం. అందుకే.. పదితో ఐదు కలిస్తే... పదిహేను గా మారింది.
అంటే 'పది' అనే సంఖ్యకు, ఐదు అనే అర్థాన్నిచ్చే ప్రాచీన రూపం 'ఏను' కలవడం వల్లనే ఇది 'పదిహేను' అయింది. కాలక్రమేణా 'ఏను' అనే పదం స్థానంలో 'ఐదు' అనేది వాడుకలోకి వచ్చినప్పటికీ, సంఖ్యల పేర్లలో మాత్రం ఆనాటి ప్రాచీన రూపాంతరం 'పదిహేను' అలాగే స్థిరపడిపోయింది.
ఉచ్ఛారణ సౌలభ్యం, భాషా పరిణామం భాషా శాస్త్రం ప్రకారం మనుషులు మాట్లాడేటప్పుడు నాలుకకు సులభంగా తిరిగేలా కొన్ని పదాలు కాలక్రమంలో రూపాంతరం చెందుతాయి. 'పది' , 'ఐదు'లను కలిపి 'పదఐదు' అని పలకడం కంటే, ప్రాచీన వేరు 'ఏను'తో ఏర్పడిన 'పదిహేను' అని పలకడం చాలా తేలికగా, శ్రావ్యంగా ఉంటుంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పదఐదు అని పిలుస్తారు. అంతేకాదు, మన తెలుగు సంఖ్యల్లో పది అనే పదం వేర్వేరు అంకెలతో కలిసినప్పుడు 'పద్మ-', 'పద-', 'పదిహే-' వంటి వేర్వేరు రూపాలను సంతరించుకుంటుంది.

