MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Late Night Dinner: రోజూ ఆలస్యంగా డిన్నర్ చేస్తే ఏమౌతుంది? శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి?

Late Night Dinner: రోజూ ఆలస్యంగా డిన్నర్ చేస్తే ఏమౌతుంది? శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి?

Late Night Dinner: పని కారణంగా, ప్రతిరోజూ ఆలస్యంగా డిన్నర్ చేస్తున్నారా? దీని వల్ల మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? ఎలాంటి ఫుడ్ తింటున్నాం అనేది ముఖ్యమా? లేక ఏ టైమ్ లో తింటున్నాం అనేది ముఖ్యమా?

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 15 2026, 01:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రాత్రిపూట తినే అలవాటు ఉందా?
Image Credit : Asianet News

రాత్రిపూట తినే అలవాటు ఉందా?

ప్రస్తుత కాలంలో లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. అర్థరాత్రి 11, 12 దాటే వరకు ఎవరూ పడుకోవట్లేదు. ఈ కారణంగానే డిన్నర్ కూడా చాలా ఆలస్యంగా చేస్తున్నారు. ఇది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. కానీ, రాత్రి సమయం అనేది మన శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమయ్యే సమయం. అలాంటి సమయంలో భారీగా ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అసలు, ప్రతిరోజూ ఆలస్యంగా తినడం వల్ల హెవీగా బరువు పెరుగుతారు. ఇంకా ఎన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య సమస్యలు ఇవే:
Image Credit : Asianet News

రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య సమస్యలు ఇవే:

1. జీర్ణక్రియ సమస్యలు & ఎసిడిటీ తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల కడుపులోని ఆమ్లాలు (Acids) పైకి వచ్చి ఎసిడిటీ, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. రాత్రి సమయంలో జీర్ణ వ్యవస్థ వేగం తగ్గుతుంది, దీనివల్ల ఆహారం సరిగ్గా అరగక కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది.

2. వేగంగా బరువు పెరగడం రాత్రివేళ మన శరీర జీవక్రియ రేటు చాలా మందగిస్తుంది.ఆలస్యంగా తిన్నప్పుడు కలగలిసే కేలరీలు శక్తిగా మారడానికి బదులు శరీరంలో కొవ్వు (Fat) రూపంలో నిల్వ ఉంటాయి. దీనివల్ల ఊబకాయం లేదా బరువు పెరిగే ప్రమాదం ఉంది.

3. నిద్రలేమి కడుపు నిండా ఆహారం ఉండి జీర్ణక్రియ జరుగుతున్నప్పుడు శరీరం విశ్రాంతి స్థితికి వెళ్లలేదు.దీనివల్ల మంచి నిద్ర పట్టక రాత్రంతా అసౌకర్యంగా ఉంటుంది. పదే పదే మెలకువ వస్తూ ఉటుంది. దీని వల్ల.. మరుసటి రోజు.. అలసట, నీరసానికి దారితీస్తుంది.

4. షుగర్ (మధుమేహం) పెరిగే ప్రమాదం రాత్రి ఆలస్యంగా తినడం వల్ల రక్తంలో ఇన్సులిన్ తీవ్రత మారుతుంది. దీనివల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడం కష్టమై, దీర్ఘకాలంలో 'టైప్-2 డయాబెటిస్' వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

5. గుండె ఆరోగ్యానికి ప్రమాదం రాత్రిపూట ఆలస్యంగా తినే అలవాటు ఉన్నవారిలో బిపి (రక్తపోటు), కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

Related Articles

Related image1
Reverse Waterfall: ఈ వాటర్ ఫాల్ లో నీరు కిందకు రాదు.. పైకి వెళతాయి, జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే..!
Related image2
River: మన దేశంలో వెనక్కి ప్రవహించే ఏకైక నది ఏది? ఇది ఎలా సాధ్యం..?
33
ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
Image Credit : Asianet News

ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

సరైన సమయం: రాత్రి భోజనాన్ని వీలైనంత వరకు రాత్రి 7:00 నుండి 8:00 గంటల లోపు పూర్తి చేయడం మంచిది.

గ్యాప్ ఇవ్వండి: తిన్న తర్వాత కనీసం 2 నుండి 3 గంటల సమయం తర్వాతే నిద్రపోవాలి.

లైట్ ఫుడ్: ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో ఆలస్యమైతే, మైదా, వేపుళ్లు, మసాలా పదార్థాలు కాకుండా ఆవిరిపై ఉడికించినవి లేదా లైట్ ఫుడ్ (సూప్స్, పండ్లు, సలాడ్స్) తీసుకోవడం మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
మీకు బుగ్గల్లో సొట్టలు పడుతున్నాయా? అయితే మీ వ్యక్తిత్వం చాలా స్పెషల్
Recommended image2
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Recommended image3
Gold Rings: 2 గ్రాముల్లో వచ్చే లేటెస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్స్.. ఇవిగో!
Related Stories
Recommended image1
Reverse Waterfall: ఈ వాటర్ ఫాల్ లో నీరు కిందకు రాదు.. పైకి వెళతాయి, జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే..!
Recommended image2
River: మన దేశంలో వెనక్కి ప్రవహించే ఏకైక నది ఏది? ఇది ఎలా సాధ్యం..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved