Castor Oil Benefits: కీళ్ల నొప్పులే కాదు.. పాదాల వాపులను కూడా ఈ నూనె తగ్గిస్తుంది..
Castor Oil Benefits: పాదాల వాపు, కీళ్లనొప్పులను తగ్గించడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది ఆముదం నూనె.

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందులో ఒకటి పాదాల పాపు. ఎక్కువ సేపు కూర్చుంటే పాదాలు వాపు రావడమే కాదు.. కండరాలు కూడా నొప్పి పెడతాయి. ఈ నొప్పి వల్ల సరిగ్గా నడవడానికి కూడా రాదు. ఇక ఈ నొప్పులను తట్టుకోలేక.. పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్లను వేసుకునే వారు చాలా మందే ఉన్నారు.
కానీ ఈ మందు బిల్లలు మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అయితే కీళ్ల నొప్పులను, వాపులను తగ్గించడానికి ఆముదం నూనె (Castor Oil) ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
ఆముదం నూనెలో రిసినోలియెక్ ఆమ్లం (Ricinoleic Acid), ఒమెగా – 6 ఫ్యాటీ ఆమ్లాలు (Omega - 6 fatty acids), యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని అనేక ఇన్ఫెక్షన్లను నొప్పులను తగ్గించడానికి సహాయపడతాయి. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
పాదాల వాపును తగ్గించేస్తుంది: ఆముదం నూనెలో ఎన్నో ఔషద గుణాలుంటాయి. ఈ నూనె వాపు (Swelling) తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం ఆముదం నూనెను గోరు వెచ్చగా చేసి.. ఆముదం ఆకులకు అప్లై చేయాలి. వీటిని ఎక్కడైతే వాపు వచ్చిందో అక్కడ కట్టాలి. దీంతో వాపు తగ్గడమే కాదు.. నొప్పి కూడా వదిలిపోతుంది. ఆముదం ఆకులు అందుబాటులో లేకుంటే.. గోరువెచ్చగా చేసిన ఆముదం నూనె ను నేరుగా వాపు దగ్గర అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత దానికి ఒక గుడ్డను కట్టి రాత్రంతా అలాగే ఉంచాలి.
గాయాలను మాన్పుతుంది: గాయాలను తొందరగా మాన్పే ఔషద గుణాలు ఆముదం నూనెలో ఉన్నాయి. అంతేకాదు ఇది కణజాల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.
మడమల పగుళ్లను తగ్గిస్తుంది: ఆడవారికే కాదు మగవారికి కూడా మడమలు పగులుతుంటాయి. అయితే మడమల పగుళ్లను తగ్గించడానికి ఆముదం నూనె ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం పాదాలను నీట్ గా కడిగి.. చీలమండలపై ఆముదం నూనెను అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. రెగ్యులర్ గా ఇలా చేస్తే పగుళ్లు చాలా తొందరగా తగ్గిపోతాయి.
కీళ్ల నొప్పులు తగ్గుతాయి: దీర్ఘకాలిక కీళ్ల నొప్పులను సైతం తగ్గించే ఔషదగుణాలు ఆముదం నూనెలో ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందుకోసం రాత్రి టైంలో పడుకునే ముందు కీళ్లకు ఈ నూనెతో మసాజ్ చేయాలి.