- Home
- Life
- Psychology: బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్.. అనుపమ చెప్పిన 'నార్సిసిస్ట్' బిహేవియర్ లక్షణాలు ఇవే..!
Psychology: బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్.. అనుపమ చెప్పిన 'నార్సిసిస్ట్' బిహేవియర్ లక్షణాలు ఇవే..!
Psychology: తన బాయ్ ఫ్రెండ్ ది ‘నార్సిసిస్ట్’ బిహేవియర్ అని.. అందుకే బ్రేకప్ చెప్పాను అంటూ ఇటీవల అనుపమ తన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. అసలు.. నార్సిసిస్ట్ బిహేవియర్ అంటే ఏంటి? ఎలా గుర్తించాలి?

సైకాలజీ ఏం చెబుతోంది..?
‘ప్రేమించడమే నేను చేసిన పెద్ద తప్పా? అస్సలు నా తప్పేమీ లేకపోయినా నాదే తప్పు అని నమ్మించారు. నా వ్యక్తిత్వం కుంచించుకుపోయేలా చేశారు... హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో తన మాజీ బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్తూ చేసిన సంచలన వ్యాఖ్యలివి. తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయ్యాక, అతడిది ఒక 'నార్సిసిస్ట్' (Narcissist) బిహేవియర్ అని ఓపెన్‌గా చెప్పేసింది. అసలు ఇంతకీ అనుపమను అంతగా నరకం చూపించిన ఆ 'నార్సిసిస్ట్ బిహేవియర్' అంటే ఏంటి? ఆ మనస్తత్వం ఉన్నవాళ్లు ఎలా ప్రవర్తిస్తారు? సైకాలజిస్టులు ఏం చెబుతున్నారో చూద్దాం..
నార్సిసిస్ట్ బిహేవియర్ ఎలా ఉంటుంది..?
నార్సిసిజమ్ అంటే మానసిక శాస్త్రంలో తన గురించి తాను విపరీతమైన గొప్పలు ఊహించుకుంటూ, ఎదుటివారి భావాలను పూర్తిగా తొక్కిపడేసే స్వార్థపూరిత మనస్తత్వం.
'అపరిచితుడు' తరహా ప్రవర్తన (Extreme Mood Swings):
అనుపమ చెప్పినట్లుగా ఆ వ్యక్తి ఒకరోజు విపరీతమైన ప్రేమ చూపుతాడు , మరుసటి రోజే ఏ చిన్న విషయానికైనా రాక్షసంగా మారతాడు. ఆ తర్వాత మళ్లీ తన తప్పు లేనట్లే వచ్చి క్షమాపణలు చెప్పి ఏడుస్తాడు. ఈ విధమైన సైకలాజికల్ డ్రామాతో ఎదుటివారిని అయోమయానికి గురిచేస్తారు.
గ్యాస్ లైటింగ్ :
తప్పు వారిదే అయినా, మాటల చాతుర్యంతో ఎదుటివారిపైకి నెట్టేస్తారు. "నీ వల్లే నేను ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది" అని నమ్మించి, ఎదుటివారినే గిల్టీగా ఫీల్ అయ్యేలా చేస్తారు.
ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం:
అనుపమ "ఆ రిలేషన్‌షిప్‌లో నా వ్యక్తిత్వం కుంచించుకుపోయినట్లు అనిపించింది" అని చెప్పారు. నార్సిసిస్ట్‌లు తమ భాగస్వామి ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసి, వారిని తమపై మాత్రమే ఆధారపడేలా చేస్తారు.
విక్టిమ్ కార్డ్ వాడటం :
సంబంధంలో ఎంత హింసించినా, బయటి ప్రపంచానికి లేదా చివర్లో మాత్రం తామే బాధితులమని కలరింగ్ ఇస్తారు.
ఎంపతీ లేకపోవడం:
భాగస్వామి ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నా వీరికి పట్టింపు ఉండదు. అంతా తమ ఆధిపత్యం, తమ అవసరాల చుట్టూనే తిరగాలని కోరుకుంటారు.
నార్సిసిస్ట్ మనస్తత్వం ఉన్నవారితో ప్రేమలో ఉండటం అంటే ప్రతిరోజూ ఒక మానసిక యుద్ధం చేయడమే. ఇలాంటి ప్రవర్తన అమ్మాయిల్లో ఉన్నా, అబ్బాయిల్లో ఉన్నా.. వారితో జీవితం కొనసాగించడం చాలా కష్టం. అలాంటి బంధాన్ని వాడుకోవడమే మంచిది..

