MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Life
  • Marriage Rituals: ఇక్కడ పెళ్లైన 15 రోజులకే విడిపోతారు.. తర్వాత మరో పెళ్లి..!

Marriage Rituals: ఇక్కడ పెళ్లైన 15 రోజులకే విడిపోతారు.. తర్వాత మరో పెళ్లి..!

Marriage Rituals: జీవితంలో పెళ్లి ఒక్కసారే వస్తుంది. ఒక్కసారి ఆ దేవుడు వేసిన బంధాన్ని నూరేళ్లు కాపాడుకోవాలనే తాపత్రయం చాలా మందిలో ఉంటుంది. అయితే.. ఈ దేశంలో మాత్రం అలా కాదు..పెళ్లైన 15 రోజులకే విడిపోతారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 13 2026, 01:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
wedding..
Image Credit : AI meta

wedding..

భారతీయ సంస్కృతిలో వివాహాన్ని ఒక పవిత్రమైన బంధంగా పరిగణిస్తారు. పెళ్లి చేసుకున్నవారికి జీవితాంతం కట్టుబడి ఉండాలని నమ్ముతారు. ఆ బంధానికి విలువ ఇచ్చి.. జీవితాంతం కలిసి జీవిస్తారు. కష్ట సుఖాల్లో ఒకరికి మరొకరు తోడుగా నిలుస్తారు. అయితే.. ఈ మధ్యకాలంలో భారత్ లో కూడా విడాకుల రేటు పెరిగింది. అయితే.. ఆ విడాకులు తీసుకోవాలన్నా చట్టం నుంచి అనుమతి అవసరం. అంతేకాదు.. విడాకుల తర్వాత భర్త ఆదాయం నుంచి భార్యకు భరణం కూడా ఇస్తారు.

కానీ ఒక దేశంలో ఇందుకు భిన్నంగా జరుగుతుంది. అంటే.. అక్కడ ప్రజలు వాళ్లకు నచ్చినన్ని సార్లు పెళ్లి చేసుకోవచ్చు. విడాకులు తీసుకోవడానికి స్పెషల్ గా చట్టం అనేది కూడా ఏదీ ఉండదు. విడిపోయిన తర్వాత భార్య భరణం ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాంట్రాక్ట్ పద్దతిలో పెళ్లి చేసుకుంటారు. ఎవరికి నచ్చిన వాళ్లను వారు పెళ్లి చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ ముగియగానే విడిపోతారు. మరి ఇలాంటి పద్ధతి ఏ దేశంలో ఉంది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇండోనేషియాలో కాంట్రాక్ట్ వివాహాలు..
Image Credit : Gemini AI

ఇండోనేషియాలో కాంట్రాక్ట్ వివాహాలు..

ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక కేంద్రంగా పేరు గాంచిన ఇండోనేషియాలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా పుంచాక్ వంటి పర్వత ప్రాంతాల్లో ఈ కాంట్రాక్ట్ పెళ్లిళ్లు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. వీళ్లు ఇలా పెళ్లి చేసుకోవడం వెనక చాలా సామాజిక, ఆర్థిక కారణాలు ఉన్నాయి.

నికా ముతా అంటే ఏమిటి?

ముతా అంటే అరబిక్ భాషలో ఆనందం లేదా సుఖం అని అర్థం. ఇది తాత్కాలిక వివాహ ఒప్పందం. అంటే.. పెళ్లి చేసుకోవడానికి ముందే ఎంత కాలం కలిసి ఉండాలో ఇద్దరూ ఒప్పందం కుదుర్చుకుంటారు. వారు డీల్ కుదర్చుకున్న సమయం ముగియగానే విడిపోతారు.

Related Articles

Related image1
Chicken Parts: చికెన్ తింటున్నారా? చికెన్ లో ఈ పార్ట్ తింటే ఆరోగ్యానికే ప్రమాదం...!
Related image2
Mangoes: కెమికల్స్ తో పండిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
33
విదేశీయులతోనూ వివాహం...
Image Credit : AI meta

విదేశీయులతోనూ వివాహం...

ఈ ప్రాంతానికి పర్యాటకులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ నుండి వచ్చే పర్యాటకులు ఇండోనేషియాలో విహార యాత్రకు వచ్చినప్పుడు ఇక్కడి స్థానికులు మహిళలను వివాహం చేసుకుంటారు. వారు అక్కడ ఉన్నంత కాలం మహిళకు భర్తగా ఉండి, వెళ్లేటప్పుడు.. ఇంతకాలం తమకు భార్యగా ఉన్నందుకు డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతారు. దీనిని కొందరు వ్యభిచారంగా పరిగణిస్తారు.

ప్రభుత్వ గుర్తింపు లేదు: ఇండోనేషియా అధికారిక చట్టాల ప్రకారం ఈ కంట్రాక్ట్ వివాహాలకు ఎటువంటి చట్టబద్ధత లేదు. దీనిని కేవలం మతపరమైన ముసుగులో జరిగే రహస్య వివాహాలు గానే పరిగణిస్తారు. ఈ వివాహాల వల్ల పుట్టే పిల్లలకు తండ్రి ఆస్తిలో హక్కులు ఉండవు. అలాగే విడాకుల తర్వాత భార్యకు ఎటువంటి భరణం (Alimony) లభించదు.

పేదరికమే ప్రధాన కారణం...

అక్కడి మహిళలు ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం తీవ్రమైన పేదరికం. తమ కుటుంబాలను పోషించుకోవడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వారు ఈ రిస్క్ తీసుకుంటారు. ఒక్కో వివాహానికి వీరు సుమారు $300 నుండి $500 వరకు తీసుకుంటారు. వీరు పెళ్లిని ఒక బంధంలా కాకుండా... కేవలం డబ్బులు సంపాదించే వ్యాపారంగా పరిగణిస్తారు.

భారతీయ సంస్కృతిలో వివాహం ఏడు జన్మల బంధంగా భావిస్తే, ఇక్కడ ఇది కేవలం కొన్ని రోజుల ఒప్పందంగా మిగిలిపోవడం విచారకరం. మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు ఈ పద్దతిని అరికట్టాలని ఇండోనేషియా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
పంచదార తినడం మానేస్తే చాలు ముఖం మెరిసిపోతుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే
Recommended image2
Bangles: తులం బంగారంలో లైట్ వెయిట్ బ్యాంగిల్స్, డైలీవేర్ కి బెస్ట్
Recommended image3
Did You Know: ఆకలి లేకపోయినా తినాలని ఎందుకు అనిపిస్తుందో తెలుసా? అసలు కారణం ఇదే!
Related Stories
Recommended image1
Chicken Parts: చికెన్ తింటున్నారా? చికెన్ లో ఈ పార్ట్ తింటే ఆరోగ్యానికే ప్రమాదం...!
Recommended image2
Mangoes: కెమికల్స్ తో పండిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved