MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటే ఏమౌతుందో తెలుసా...?

రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటే ఏమౌతుందో తెలుసా...?

రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటేనే మీరు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉంటారు. లేదంటే సర్వరోగాలు మీకే చుట్టుకునే ప్రమాదం ఉంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 17 2022, 02:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కరోనా మహమ్మారి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి.. ప్రజలు తమ ఆరోగ్యం గురించి మునుపెన్నడూ లేనంతగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడానికి బలమైన ఆహారాలనే తీసుకుంటున్నారు. ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్లే ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాలు చుట్టుకునే ప్రమాదముంది. చెడు జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల  ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. 

27

రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉందని ఎలా గుర్తించాలి

రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉంటే ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యను ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాతావరణంలో చిన్నపాటి మార్పొచ్చినా దగ్గు, జ్వరం, జలుబు వంటి సమస్యలు వస్తాయి. వీటికి మెడిసిన్స్ ను వాడినా.. త్వరగా తగ్గవు. 

37

స్కిన్ ఇన్ఫెక్షన్స్

రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండే వారికి చర్మ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ బలహీనమైన ఇమ్యూనిటీ వ్యవస్థ వల్ల చర్మ సంక్రమణ, న్యూమోనియా ప్రమాదాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇతర చర్మ సమస్యలు కూడా అటాక్ చేస్తాయి. 

47

కడుపునకు సంబంధించిన సమస్యలు

ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీనంగా ఉంటే కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అంటే తరచుగా కడుపు నొప్పి, వాంతులు, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి  సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే స్టమక్ సంక్రమ్యత ప్రమాదం బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఇలాంటి సమయంలో మీ కడుపులోకి హానికలిగించే బ్యాక్టీరియా సులువుగా చేరుకోగలదు. 
 

57
Fatigue

Fatigue

అలసట

ఏం పనిచేయకపోయినా.. రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోయినా.. కొంతమంది అలసిపోయినట్టుగానే ఉంటారు. ఇలాంటి వారు చిన్న చిన్న పనులను కూడా చేయలేరు. ఇలా అనిపించడానికి మీ రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండటమే కారణంటున్నారు నిపుణులు.  
 

67

గాయాలు తొందరగా మానకపోవడం

రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటేనే గాయలు చాలా త్వరగా మానిపోతాయి. రోగ నిరోధక వ్యవస్థే గాయలను ఎలాంటి ఎన్ఫెక్షన్స్ లేకుండా మాన్పుతాయి. ఇది తగ్గిందంటే మీ గాయాలు చాలా లేటుగా నయమవుతాయి. 

77

విటమిన్ డి లోపించడం

సూర్యరశ్మి ద్వారా మన శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందుతుంది. మీకు తెలుసా.. మన శరీరంలో విటమిన్ డి లోపిస్తే కూడా రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ఎందుకంటే సూర్యకిరణాలు రోగ నిరోధక వ్యవస్థను బలంగా చేస్తాయని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Amla Benefits: రోజూ ఉసిరికాయలు తింటే ఏమవుతుంది?
Recommended image2
Manthena Hair Care Tip: ఈ సీక్రెట్‍తో వద్దన్నా కూడా జుట్టు పెరిగిపోతుంది
Recommended image3
Crispy Dosa: హోటల్ స్టైల్ లో దోశలు క్రిస్పీగా రావాలా? పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved