MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Summer tips: వేసవిలో పాలు విరగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

Summer tips: వేసవిలో పాలు విరగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

వేసవికాలం మొదలైంది. ఎండలవేడికి ఇంట్లో ఉండే చాలా ఆహార పదార్థాలు త్వరగా పాడవుతుంటాయి. మరీ ముఖ్యంగా పాలు విరిగిపోతూ ఉంటాయి. మరీ పాలు పాడవకుండా ఉండాలంటే ఈ చిట్కాలు ఫాలో కావాల్సిందే.

2 Min read
Author : Kavitha G
Published : Mar 04 2025, 02:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వేసవి కాలం మొదలైంది. ఎండలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వేడి వల్ల ఇంట్లో ఉండే కొన్ని ఆహార పదార్థాలు కూడా పాడైపోతాయి. కాబట్టి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఎండవేడికి త్వరగా పాడయ్యే వాటిలో పాలు ముందు ఉంటాయి. మరి వాటిని పాడవకుండా ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇక్కడ చూద్దాం.

26
పాలు విరగకుండా ఏం చేయాలి?

పాలు విరగకుండా ఏం చేయాలి?

వేసవి కాలంలో పాలు విరిగిపోవడం సాధారణ సమస్య. పాలు పాడవకుండా ఉండాలంటే పాలని బాగా మరిగించి తర్వాత చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అయినప్పటికీ కొన్నిసార్లు పాలు పాడైపోతాయి. దానికి కారణం కరెంట్ సమస్య కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పాలని ఫ్రిజ్‌లో కూడా పెట్టలేము. మరి అప్పుడు ఏం చేయాలి?

36
ఫ్రిజ్ లో పెట్టకపోయినా పాలు తాజాగా..

ఫ్రిజ్ లో పెట్టకపోయినా పాలు తాజాగా..

ఫ్రిజ్‌లో పెట్టకుండా పాలు పాడవకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే చాలు. పాలు పాడవకుండా తాజాగా ఉంటాయి. పాలు పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

46
పాలు మరిగించే విధానం:

పాలు మరిగించే విధానం:

పాలని మీరు రోజుకి మూడు నుంచి నాలుగు సార్లు తప్పకుండా మరిగించాలి. అలా మరిగించేటప్పుడు మీరు 2-3 పొంగులు మాత్రమే రానిస్తే చాలు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.

56
పాల పాత్రను శుభ్రంగా ఉంచండి

పాల పాత్రను శుభ్రంగా ఉంచండి

మీరు పాలు మరిగించే పాత్రను శుభ్రంగా కడిగి ఉపయోగించండి. అంటే పాలు మరిగించే ముందు ఆ పాత్ర శుభ్రంగా ఉందా.. లేదా అనేది ముందుగా సరిచూసుకోండి. బాగా శుభ్రం చేశాకే అందులో పాలు పోసి మరిగించాలి. అలాగే పాలు మరిగించే ముందు పాత్రలో రెండు లేదా మూడు స్పూన్ల నీళ్లు వేస్తే పాలు మరిగించేటప్పుడు పాలు అడుగున అంటుకోకుండా ఉంటాయి.

66
ప్యాకెట్ పాలు

ప్యాకెట్ పాలు

నగరాల్లో ప్యాకెట్ పాలు ఎక్కువగా దొరుకుతాయి. నిపుణుల ప్రకారం, పాశ్చరైజ్ చేసిన పాలని వేడి చేయాల్సిన అవసరం లేదు. ఇంకా వాటిని ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కంపెనీల్లో ప్యాకింగ్ చేసే ముందు పాలని బాగా శుభ్రం చేస్తారు. దీనివల్ల అందులో బ్యాక్టీరియా లేకుండా ఉంటాయి. ఒకవేళ ప్యాకెట్ పాలని మళ్లీ వేడి చేస్తే అందులోని పోషకాలు తగ్గుతాయి. ప్యాకెట్ పాలు కొంటే, ఒక గోనె సంచిని చల్లటి నీటిలో తడిపి ప్యాకెట్ పాలని దాంతో కప్పి ఉంచండి. ఇలా చేస్తే 5 నుంచి 6 గంటల వరకు పాలు పాడవకుండా ఉంటాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Trendy Bangles: అదిరిపోయే డిజైన్‍లో లక్క గాజులు.. ట్రై చేయకపోతే ఎలా?
Recommended image2
Crocs Health Risks: పిల్లలు వేసుకునే ఈ చెప్పుల్లో విషం..బయటపడ్డ అసలు నిజం!
Recommended image3
Blouse Designs: సమ్మర్ పార్టీల కోసం అదిరిపోయే డిజైన్‍లో బ్లౌజ్‍లు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved