MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే వెంటనే చక్కెరను తినడం మానేయండి.. లేకపోతే..?

శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే వెంటనే చక్కెరను తినడం మానేయండి.. లేకపోతే..?

చక్కెర శరీరానికి అవసరమే అయినప్పటికీ దీనిని మోతాదుకు మించి తీసుకుంటే.. ఎన్నో రకాల రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా శరీరంలో కొన్ని రకాల మార్పులు కనిపిస్తే చక్కెరను తీసుకోవడం మానేయండని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 13 2022, 03:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

స్వీట్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అందులో బెల్లంతో చేసిన స్వీట్ ఐటమ్స్ కంటే చక్కెరతో చేసిన స్వీట్ ఐటమ్స్ నే ఎక్కువగా తింటూ ఉంటారు. ఇక టీ, కాఫీల్లో కూడా చక్కెర పక్కాగా ఉండాలంతే. కొంతమంది అయితే భోజనం తర్వాత పక్కాగా స్వీట్లను తినాల్సిందే అని పట్టుబడుతుంటారు. కానీ మీరు తీసుకునే చక్కెర ఎన్నో రోగాలకు కారణమవుతుందన్న సంగతి మీకు తెలుసా..? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
sugar

sugar

మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు షుగర్ కూడా అవసరమే. అలా అని చక్కెరను అతిగా తినకూడదు. ఈ షుగర్ కంటే పండ్లలో ఉండే సహజ చక్కెరే మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

39

ఈ షుగర్ బరువును పెంచడమే కాదు.. అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. చక్కెరను అతిగా తీసుకోవడం వల్ల చర్మానికి ఎంతో నష్టం వాటిల్లుతుంది. చర్మం గానీ, శరీరం గానీ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా రోజు వారి ఆహారం నుంచి చక్కెర శాతాన్ని చాలా వరకు తగ్గించడమో.. లేకపోతే.. పూర్తిగా వదులుకోవడమో చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చక్కెర మన ఆరోగ్యానికి ఏ విధంగా చేడు చేస్తుంది.. ఎవరెవరు చక్కెరను మొత్తమే తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

49

దంత క్షయం

చక్కెర దంత క్షయానికి దారితీసే కారకాల్లో ఒక్కటి.  చక్కెరను విపరీతంగా తీసుకోవడం వల్ల దంతాల ఎనామిల్ నాశనం అవుతుంది. కాబట్టి దంత క్షయం బారిన పడినట్టనిపిస్తే వెంటనే చక్కెరను తీసుకోవడం మానేయంది. 

59

చర్మంపై నల్లని మచ్చలు

చర్మంపై నల్లని మచ్చలు కనిపిస్తే కూడా అనుమానించాల్సిందే.  ముఖ్యంగా ముఖంపై, చేతులపై, పాదాలపై నల్లని మచ్చలు కనిపిస్తే వెంటనే చక్కెరను తీసుకోవడం మానేయండి. చక్కెరలో ఉండే అనేక పదార్థాలు చర్మానికి హానిచేస్తాయి. ముఖ్యంగా చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. 

69

బరువు తగ్గాలనుకుంటే

బరువు తగ్గాలనుకునే వారు ముందుగా చేయాల్సిన పని చక్కెర వాడాన్ని పూర్తిగా మానేయడం. అవును షుగర్ వల్లే విపరీతంగా బరువు పెరుగుతారు. ఎందుకంటే దీనిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆరోగ్యంగా ఉండి బరువు తగ్గాలనుకునేవారు షుగర్ ను తీసుకోవడం పూర్తిగా మానేయాలి.

79

షుగర్ డిప్రెషన్ కు కారణం కావచ్చు

షుగర్ కూడా డిప్రెషన్ కు కారణం కావొచ్చన్న సంగతి దాదాపుగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఎక్కువగా చక్కెర తినే వ్యక్తులు నిరాశతో బాధపడుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మీ రోజు వారి ఆహారం నుంచి షుగర్ ను తొలగించండి. చక్కెర మూత్రపిండాలపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది.

89

మోకాళ్ల నొప్పులున్న వారు కూడా చక్కెరను తీసుకోకూడదు. ఎందుకంటే చక్కెరను ఎక్కువగా తినడం వల్ల కాళ్లలో నొప్పి కలుగుతుంది. అందుకే దీన్ని తీసుకోవడం తగ్గించడమో.. లేకపోతే పూర్తిగా మానేయడమో చేయాలి. లేదంటే షుగర్ మీ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉంది.

99

షుగర్ వ్యాధి, యూరిక్ యాసిడ్, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్నట్టైతే చక్కెరను పూర్తిగా తగ్గించాలి. లేదా పూర్తిగా మానేయాలి. ఎందుకంటే చక్కెర వల్ల ఈ రోగాలు మరింత ప్రమాదకరంగా మారుతాయి. లైంగిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది షుగర్. అలాగే పిల్లలకు కూడా ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇది పిల్లల్లో తామరకు చక్కెర కారణమవుతుంది. చక్కెర వినియోగం వల్ల పనిలో ఏకాగ్రత తగ్గుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Ruffle Sarees: అందమైన రంగుల్లో రఫుల్ చీరలు.. పార్టీలకు అదిరిపోతుంది
Recommended image2
Ring Mangalsutra: చైన్, బ్రేస్లేట్ కాదు..రింగ్ మంగళసూత్రాలు చూశారా?
Recommended image3
Dry Fruits: రోజుకు ఎన్ని బాదం, జీడిపప్పులు తింటే హెల్త్ కు బెనిఫిట్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved