Diabetes: పిల్లల్లో డయాబెటీస్ ను ఎలా గుర్తించాలి?
Diabetes: డయాబెటీస్ వయసుతో సంబంధం లేకుండా సోకుతోంది. ముఖ్యంగా పిల్లలు సైతం దీనిబారిన పడుతున్నారు. అయితే వీరిలో కొన్ని లక్షణాలను బట్టి మీ పిల్లలకు డయాబెటీస్ ఉందో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు.

Diabetes in children
ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (ఐడిఎఫ్) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 1.1 మిలియన్ల మంది పిల్లలు , కౌమారులు (20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు) ప్రస్తుతం టైప్ 1 డయాబెటిస్ తో బాధపడుతున్నారట. అదనంగా ప్రతి ఏడాది 1, 32, 000 మంది పిల్లలు మరియు కౌమారులు టైప్ 1 డయాబెటిస్ తో బాధపడుతున్నారు.
ఈ డయాబెటీస్ అనేది దీర్ఘకాలిక అనారోగ్య సమస్య. దీనిలో క్లోమం తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయదు. లేదా శరీరరం దానిని సమర్థవంతంగా ఉపయోగించడంలో విఫలమవుతుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది. రక్తంలో ఉండే గ్లూకోజ్ యే మన శరీరానికి ప్రధాన శక్తి వనరు. ఈ గ్లూకోజ్ మనం తినే ఆహారం ద్వారా వస్తుంది. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఇది రక్తంలోని గ్లూకోజ్ మీ కణాల్లోకి ప్రవేశించడానికి, దానిని శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది.
diabetes in children
కాగా మీ శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కానప్పుడు లేదా అది ఉత్పాదకంగా ఉపయోగించనప్పుడు గ్లూకోజ్ రక్తప్రవాహంలో ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడానికి దారితీస్తుంది. డయాబెటీస్ రెండు రకాలు. ఒకటి టైప్ 1, రెండోది టైప్ 2 డయాబెటీస్. అయితే మీ పిల్లలకు డయాబెటీస్ వచ్చిందా లేదా అన్న విషయాలను పిల్లల్లో కనిపించే కొన్ని లక్షణాల ద్వారా కనిపెట్టొచ్చు. అవేంటంటే..
diabetes
అలసిపోవడం.. పిల్లలు బలహీనతకు, అలసటకు ఎన్నో కారణాలుంటాయి. అయితే మీ పిల్లలు ఎప్పుడూ అలసిపోయినట్టుగానే కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించి రోగనిర్దారణ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది మధుమేహానికి సంకేతం కావొచ్చు.
బరువులో హెచ్చుతగ్గులు.. మధుమేహంతో బాధపడుతున్న పిల్లల్ల బరువులో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా డయాబెటీస్ ఉంటే పిల్లలు బరువు తగ్గుతారు. డయాబెటీస్ పిల్లల్లో క్లోమం తగినంతగా ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయదు. లేదా ఇన్సులిన్ ను సమర్థవంతంగా ఉపయోగిచనప్పుడు గ్లూకోజ్ ను శక్తిగా మార్చే ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. దీంతో వారి శరీరానికి కావాల్సిన శక్తి లభించదు. దాంతో అది శక్తి కోసం కొవ్వును, కండరాలను తినడం ప్రారంభిస్తుంది. దీంతో ఉన్నట్టుంది పిల్లలు బరువు తగ్గుతారు.
నిద్ర, ఆహారపు అలవాట్లు.. నిద్ర, ఆహారపు అలవాట్లు కూడా మధుమేహానికి కారణమవుతాయి. తీవ్రమైన ఆకలి, విపరీతమైన దాహం, నిద్రలేమి వంటి సమస్యలన్నీ మధుమేమానికి సంకేతాలుగా భావించొచ్చు.
తరుచుగా మూత్రవిసర్జన.. పిల్లల్లో మధుమేహం ప్రారంభ లక్షణం తరచుగా మూత్రవిసర్జన చేయడం. అయితే ఇలా తరచుగా మూత్రానికి వెళ్లడానికి.. నీళ్లను ఎక్కువగా తాగడం కూడా ఒక కారణం కావొచ్చు.
అస్పష్టమైన దృష్టి.. డయాబెటీస్ కంటి సమస్యలకు దారీ తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటీస్ సోకితే కంటిచూపు మందగిస్తుందని చెబుతున్నారు. కొన్ని కొన్ని సార్లు ఈ మధుమేహం కంటి కటకాన్ని( eye Lens ) ఉబ్బిపోయేలా చేస్తుంది. దీంతో పిల్లలు స్పష్టంగా చూడలేరు.
Gastrointestinal problems.. మధుమేహం ఉన్న పిల్లలు గుండెల్లో మంట, ఉబ్బరం వంటి ఎన్నో జీర్ణశయాంతర సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే డయాబెటీస్ గ్యాస్ట్రోపరేసిస్ కు దారితీస్తుంది. ఇది మీ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.