Temporary wife: ఇదేమీ సాంప్రదాయం.. అక్కడ అద్దెకు భార్యలను ఇస్తారట
డబ్బుల సంపాదించేందుకు ఎన్నో మార్గాలు వెతుకుతోంది నేటి తరం. అలా ఇప్పుడు పరాయి మగవారికి తమ భార్యలను అద్దెకిచ్చే వ్యాపారం కూడా థాయిలాండ్ లో మొదలైపోయింది. పెళ్లికాని వారు కూడా అద్దె భార్యగా వెళ్లి డబ్బులు సంపాదిస్తున్నారు. ఆదాయం కూడా అధికంగానే ఉంటుంది.

అద్దె భార్యల వ్యాపారం
కారు, ఇల్లు రెంట్ కి తీసుకున్నట్టే థాయిలాండ్ భార్యను కూడా అద్దెకు తీసుకోవచ్చు. కొన్ని గంటలు లేదా రోజులకు అద్దె భార్య దొరుకుతుంది అక్కడ. ఏ వయసు మగనవారైనా తగిన మొత్తంలో డబ్బు చెల్లించి ఒక మహిళను కొన్ని రోజులు పాటూ తన భార్యగా ఉంచుకోవచ్చు. ఆమె తన తాత్కాలిక భర్తకు అసలైన భార్యలాగే అన్ని సేవలు చేస్తుంది. అతనితో సంతోషంగా జీవిస్తుంది. అయితే అద్దె ఒప్పందం పూర్తవ్వగానే మాత్రం అతను ఆమెను వదిలేయాలి. ఇందుకు ఎక్కువ మొత్తంలో డబ్బులు కూడా చెల్లించాల్సి వస్తుంది. ఇది చట్టబద్ధమైన బంధంగా మాత్రం ఉండదు. కేవలం ఒక వ్యాపారం. ఒకవేళ వారిద్దరూ ఇష్టపడితే మాత్రం పెళ్లి చేసుకోవచ్చు కూడా. లేకుండా ఎవరి దారి వారిదే. కూటి వరకు కోటి విద్యలు అంటారు… అలా డబ్బుల కోసం ఇలాంటి కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి.
పేద కుటుంబాల వారే బలి
థాయిలాండ్ లో పెరుగుతున్న ఈ అద్దె భార్యల ట్రెండ్ గురించి లావర్ట్ ఇమ్మాన్యుయేల్ అనే వ్యక్తి పుస్తకం రాశారు. ఆ పుస్తకం ప్రకారం పేద కుటుంబాలకు చెందిన మహిళలే అధికంగా ఇలా అద్దె భార్యలుగా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. వీరిలో చాలా మంది హోటళ్ళు, బార్లలో పనిచేస్తూ అక్కడ విదేశీ పర్యాటకులను కలుస్తారు. వారికి అద్దె భార్యలుగా ఉండేందుకు డబ్బులు తీసుకుంటారు. ఆ సమయంలో గర్భం దాల్చిన మహిళల సంఖ్య కూడా అధికంగా ఉంది.
అద్దె ఎంత?
అద్దె ఎంత అనేది ఆ మహిళ వయస్సు, అందం, విద్య వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఆమెను ఎన్ని రోజులు పాటూ మీరు అద్దె భార్యగా ఉంచుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి అద్దెను నిర్ణయిస్తారు. సాధారణంగా అద్దె భార్య ధర 1600 డాలర్ల నుండి 1,16,000 డాలర్ల వరకు (అంటే ₹1.4 లక్షల నుండి ₹1 కోటికి పైగా) ఉండవచ్చు. ఇది థాయ్‌లాండ్‌లో ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది.
మహిళలు సంపాదిస్తున్నారు
ఈ వింత సంప్రదాయాలు లేదా ఉద్యోగాల వల్ల మహిళలు అధికంగా సంపాదిస్తున్నారు. వారు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. అయితే ఇది నైతిక మైన పని కాదు. సమాజంలో ఇలాంటి పనులు వివాదాస్పదమవుతున్నాయి. వేగంగా పెరుగుతున్న ఈ సంప్రదాయం గురించి థాయ్‌లాండ్ ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది. ఈ ఉద్యోగాల్లో మహిళలకు భద్రత ఉండదేమోనని కలవరపడుతోంది. అందుకు అద్దె భార్యల పనుల్లో కఠినమైన చట్టాలను తీసుకురావాలని భావిస్తోంది.