Electricity Bill: కరెంట్ బిల్లు తగ్గాలంటే ఈ తప్పులు మాత్రం చేయకండి..!

ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం బాగా పెరిగిపోయింది. ప్రతి పనికి మెషిన్లు వచ్చేస్తున్నాయి. ఫ్రిడ్జి, వాషింగ్ మెషిన్, టీవీ ఇలా ఇంట్లో బోలెడు వస్తువులు ఉంటున్నాయి. దీంతో కరెంట్ బిల్లు కూడా బాగా పెరిగిపోతోంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా కరెంట్ బిల్లు తగ్గించుకోవచ్చు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

High Electricity Bill Home Appliance Mistakes to Avoid in telugu KVG

ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం బాగా పెరిగిపోయింది. ఫ్రిడ్జ్, ఓవెన్, మైక్రోవేవ్, వాషింగ్ మిషన్ ఇలా ప్రతి ఇంట్లో చిన్నవి, పెద్దవి కలిపి చాలా రకాల వస్తువులు ఉంటున్నాయి. అయితే ఈ వస్తువులను సక్రమంగా వాడకపోతే కరెంట్ బిల్లు పెరిగే అవకాశం ఉంది. మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల బిల్లు భారీగా పెరుగుతుంది. మరి ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకుంటే కరెంట్ బిల్ తక్కువ వస్తుందో ఇక్కడ చూద్దాం.

ప్లగ్ తీసేయడం

వస్తువులు వాడిన తర్వాత వాటి ప్లగ్ ఆఫ్ చేయడం చాలామంది మర్చిపోతుంటారు. కరెంటు బిల్లు తగ్గించాలంటే ముందుగా ఇది చేయాలి. ఇంట్లో చాలా చోట్ల ల్యాప్‌టాప్, ప్రింటర్, కాఫీ మేకర్, ఫోన్ ఛార్జర్లు, ఇంకా చాలా వస్తువులు పనిలేకపోయినా ప్లగ్ ఆన్ చేసి ఉంటాయి. టీవీ, వీడియో గేమ్ కన్సోల్ వాడకపోయినా ప్లగ్ ఇన్ చేసి ఉంచితే వాటిలో పవర్ వస్తూనే ఉంటుంది.  

'పీక్' టైమ్‌లో వాడొద్దు

పీక్ టైమ్‌లో వస్తువులు వాడితే కరెంటు ఛార్జీలు ఎక్కువగా వేస్తారు. మధ్యాహ్నం వేళల్లో చాలామంది వస్తువులు వాడుతుంటారు. డిష్ వాషర్, వాషర్, డ్రయర్ లాంటివి వాడేటప్పుడు రాత్రిపూట లేదా తెల్లవారుజామున వాడటానికి ట్రై చేయండి. ఆ టైమ్‌లో వాడకం తక్కువగా ఉంటుంది. కాబట్టి కరెంటు బిల్లు కూడా తక్కువగా వస్తుంది.

పాతబడిపోయిన వస్తువులు

ఏసీ లేదా కూలర్లకు ఎక్కువ పవర్ అవసరం అవుతుంది. కాబట్టి అవి సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా ఏమైనా లోపాలున్నాయో తెలుసుకోవాలి. ఒకవేళ బాగా పాతబడిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు వాడినా ఎక్కువ కరెంటు బిల్లు వస్తుంది. మీరు వాడే వస్తువులకు 10 ఏళ్ల గ్యారెంటీ ఉన్నా చాలాసార్లు రిపేర్లు చేయించాల్సి వస్తుంది. 

కొన్నిసార్లు వస్తువులు మార్చాల్సి కూడా వస్తుంది. ఇది ఖర్చుతో కూడుకున్నదే అయినా కొత్తది ఎక్కువ పవర్ సేవ్ చేస్తుంది. చాలాకాలం వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ టైమ్ ప్రకారం రిపేర్లు చేయిస్తూ ఉంటే మీ వస్తువులు ఎక్కువ కాలం పనిచేస్తాయి.

పవర్ సేవింగ్ సెట్టింగ్స్

ప్రతి వస్తువులో ఒకటి కంటే ఎక్కువ పవర్ సేవింగ్ సెట్టింగ్‌లు ఉంటాయి. కాబట్టి ప్రతి వస్తువును కరెక్ట్‌గా వాడటానికి ట్రై చేయండి. వాషింగ్ మెషీన్, డిష్ వాషర్ వాడేటప్పుడు ఫిల్టర్లు క్లీన్ చేస్తూ ఉండాలి. మధ్యమధ్యలో సర్వీసింగ్ చేయించాలి. ఫ్రిడ్జ్ వాడేటప్పుడు టెంపరేచర్ సెట్టింగ్ చూసి చల్లదనం సరిగ్గా వచ్చేలా సెట్ చేయాలి. ఇలాంటి చిన్న విషయాలు గుర్తుంచుకుంటే మీ కరెంటు బిల్లు ఈజీగా తగ్గించుకోవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios