MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Smart Gadgets: 100 రూపాయలలోపు దొరికే స్మార్ట్ గ్యాడ్జెట్లు.. ధర తక్కువ, ఉపయోగం ఎక్కువ!

Smart Gadgets: 100 రూపాయలలోపు దొరికే స్మార్ట్ గ్యాడ్జెట్లు.. ధర తక్కువ, ఉపయోగం ఎక్కువ!

Smart Gadgets: రోజువారీ జీవితంలో స్మార్ట్ గ్యాడ్జెట్లు చాలా ఉపయోగపడతాయి. అయితే స్మార్ట్ గ్యాడ్జెట్స్ అంటే చాలామంది ఖరీదైన వస్తువులనే ఊహిస్తారు. కానీ ఆన్ లైన్ లో రూ.100 లోపే దొరికే, మన పనిని ఈజీ చేసే కొన్ని చిన్న గ్యాడ్జెట్లు ఉన్నాయి. అవేంటో చూద్దాం. 

1 Min read
Author : Kavitha G
Published : Jun 08 2026, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పోర్టబుల్ LED లైట్
Image Credit : amazon

పోర్టబుల్ LED లైట్

పోర్టబుల్ LED లైట్ రోజూవారీ జీవితంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ LED లైట్ ని మొబైల్ ఛార్జర్ అడాప్టర్‌కు నేరుగా కనెక్ట్ చేసి ప్లగ్ ఇన్ చేస్తే వెంటనే వెలుగుతుంది. అలాగే పవర్ బ్యాంక్ తో కూడా కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. రాత్రి సమయంలో చదవడానికి, అత్యవసర పరిస్థితుల్లో లేదా చిన్న గదుల్లో అదనపు లైటింగ్ కోసం ఇది మంచి ఎంపిక. తక్కువ విద్యుత్ వినియోగంతో మంచి వెలుతురును అందించడం దీని ప్రత్యేకత.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మినీ USB ఫ్యాన్
Image Credit : amazon

మినీ USB ఫ్యాన్

వేసవి కాలంలో బయటకు వెళ్లినప్పుడు ఈ చిన్న USB ఫ్యాన్ బాగా ఉపయోగపడుతుంది. పవర్ బ్యాంక్, ల్యాప్‌టాప్ లేదా మొబైల్‌కు కనెక్ట్ చేస్తే వెంటనే పనిచేస్తుంది. పరిమాణంలో చిన్నదైనా, వ్యక్తిగతంగా చల్లదనం అందించడంలో బాగా సహాయపడుతుంది. బస్సు లేదా రైలు ప్రయాణాల సమయంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Related Articles

Related image1
Smart Gadgets: 50 రూపాయలలోపు దొరికే సూపర్ గ్యాడ్జెట్లు.. వీటితో మీ పనులు చాలా ఈజీ!
Related image2
Train Horn Meaning: ట్రైన్ హారన్ వెనుక ఇంత అర్థముందా? ఇవి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
35
క్లీనింగ్ బ్రష్
Image Credit : amazon

క్లీనింగ్ బ్రష్

ల్యాప్‌టాప్ కీబోర్డ్‌లలో, బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌లో, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో దుమ్ము పేరుకుపోవడం సాధారణమే. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యేకంగా రూపొందించిన క్లీనింగ్ బ్రష్ ఎంతో ఉపయోగపడుతుంది. చిన్న మూలల్లోని దుమ్మును కూడా సులభంగా తొలగించడంతో పాటు పరికరాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

45
మొబైల్ హోల్డర్ స్టాండ్
Image Credit : amazon

మొబైల్ హోల్డర్ స్టాండ్

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు మొబైల్ హోల్డర్ ఒక అవసరమైన గ్యాడ్జెట్‌గా మారింది. వీడియోలు చూడటం, ఆన్‌లైన్ క్లాసులు అటెండ్ కావడం లేదా వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు ఫోన్‌ను చేతిలో పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. టేబుల్‌పై స్థిరంగా ఉంచి సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు. దీని ధర తక్కువైనా, ఉపయోగం మాత్రం చాలా ఎక్కువ.

55
గ్యాడ్జెట్ క్లీనర్ కిట్
Image Credit : amazon

గ్యాడ్జెట్ క్లీనర్ కిట్

మొబైల్, టాబ్లెట్, ల్యాప్‌టాప్ స్క్రీన్లు తరచూ వేలిముద్రలు, దుమ్ముతో మసకబారిపోతుంటాయి. గ్యాడ్జెట్ క్లీనర్ కిట్‌లో క్లీనింగ్ లిక్విడ్, మైక్రోఫైబర్ క్లాత్, చిన్న బ్రష్ వంటి పరికరాలు ఉంటాయి. వీటి సహాయంతో గ్యాడ్జెట్లను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. ఇది స్క్రీన్‌ను గీతలు పడకుండా కాపాడుతూ కొత్తదానిలా మెరిపిస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
గాడ్జెట్‌లు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Chandramukhi Chicken Fry: నార్మల్ చికెన్ ఫ్రై బోర్ కొట్టిందా? ఈ చంద్రముఖి చికెన్ ఫ్రై ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది
Recommended image2
Coin Necklace: ఏ సందర్భానికైనా సూటయ్యే కాసు నక్లెస్ డిజైన్లు..చూసేయండి
Recommended image3
Earrings Designs: వావ్ అనిపించే డిజైన్ లో హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్
Related Stories
Recommended image1
Smart Gadgets: 50 రూపాయలలోపు దొరికే సూపర్ గ్యాడ్జెట్లు.. వీటితో మీ పనులు చాలా ఈజీ!
Recommended image2
Train Horn Meaning: ట్రైన్ హారన్ వెనుక ఇంత అర్థముందా? ఇవి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved