MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లను తప్పకుండా తినండి

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లను తప్పకుండా తినండి

ఎన్నో కారణాల వల్ల మన మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. డయాబెటీస్, అధిక రక్తపోటు వంటి లైఫ్ స్టైల్ వ్యాధుల వ్యాధులు కొన్ని కొన్ని సార్లు మన మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తాయి. మూత్రం లేదా మూత్రపిండాలలో రాళ్లు కూడా మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 03 2023, 05:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
kidney health

kidney health

మారుతున్న జీవన శైలికి అనుగుణంగా మన ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం అయిన మూత్రపిండాల ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే మూత్రపిండాలు మన శరీరం నుంచి మలినాలను బయటకు పంపే అవయవం. మూత్రపిండాలు గనుక సరిగ్గా పనిచేయకపోతే ఇతర అవయవాల పనితీరు కూడా ప్రభావితం అవుతుంది. మన మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతినడానికి ఎన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి అనేక జీవనశైలి వ్యాధులే మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మూత్రపిండాల వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యం బాగుండాలంటే మీ ఆహారంలో ఉప్పును చాలా వరకు తగ్గించాలి. అలాగే నీటిని పుష్కలంగా తాగాలి. ఇవన్నీ చేస్తేనే మీ మూత్రపిండాల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మూత్రపిండాల ఆరోగ్యం కోసం కోలాలతో సహా కృత్రిమ శీతల పానీయాలకు వీలైనంత దూరంగా ఉండాలి. అలాగే తీపి పదార్థాలను ఎక్కువగా తినకూడదు. శాఖాహారాలనే ఎక్కువగా తినాలి. అయితే కొన్ని పండ్లు మన కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని రోజూ తినాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

37

స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీలు , బ్లూబెర్రీస్ వంటి బెర్రీలలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ బెర్రీల్లో మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ సి, ఫైబర్  కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ బెర్రీలు కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.  
 

47
apples

apples

ఆపిల్ 

ఆపిల్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పండును రోజూ ఒకటి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా మూత్రపిండాల ఆరోగ్యం బాగుంటుంది కూడా. విటమిన్ బి, కాల్షియం పుష్కలంగా ఉండే యాపిల్స్ గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
 

57
pineapple

pineapple

అనాస పండు

మీ రోజు వారి ఆహారంలో పైనాపిల్ ను చేర్చుకోవడం వల్ల మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే పైనాపిల్ మూత్రపిండాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. 
 

67

ద్రాక్ష 

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ద్రాక్ష మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. అంతేకాదు గుండె జబ్బులను నివారించడానికి కూడా ఈ పండు సహాయపడుతుంది. 
 

77

నారింజ

నారింజతో సహా సిట్రిస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు మన మూత్రపిండాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Earrings: 14 క్యారెట్లతో అదిరిపోయే ట్రెండీ వెస్ట్రన్ చెవిపోగులు
Recommended image2
Silver Jewelry: తల నుంచి పాదాల దాకా జిగేలుమనే ట్రెండీ సిల్వర్ నగలు
Recommended image3
Silver Jewelry: ఈసారి పెళ్లిళ్లలో ఇలాంటి వెండి నగలతో మెరిసిపోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved